Russian Crew: అంతరిక్షంలో సినిమా తీసి సక్సెస్‌ఫుల్‌గా భూమి మీదకి..

ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో 12 రోజుల పాటు సినిమా షూటింగ్‌ సక్సెస్‌ఫుల్‌గా ముగించుకున్న రష్యా మూవీ టీం భూమి మీదకు సేఫ్‌గా ల్యాండ్ అయింది.

Russian Crew: అంతరిక్షంలో సినిమా తీసి సక్సెస్‌ఫుల్‌గా భూమి మీదకి..

New Project (2)

Russian Crew: ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో 12 రోజుల పాటు సినిమా షూటింగ్‌ సక్సెస్‌ఫుల్‌గా ముగించుకున్న రష్యా మూవీ టీం భూమి మీదకు సేఫ్‌గా ల్యాండ్ అయింది. ఒలెగ్‌ నోవిట్‌స్కీ, యులియా పెరెసిల్డ్, క్లిమ్‌ షిపెంకోలతో కూడిన సోయూజ్‌ స్పేస్ క్రాఫ్ట్ ఆదివారం కజఖ్‌స్తాన్‌లోని మైదాన ప్రాంతానికి చేరుకుంది. ఆ సమయంలోనే యులియా, నోవిట్‌స్కీలు సీట్లలో ఉండి 10 నిమిషాలపాటు కొన్ని షాట్స్ తీసుకున్నారు.

నేలపైకి చేరుకున్న వారిని మెడికల్ టెస్టుల కోసం హాస్పిటల్ కు తరలించారు. ముగ్గురి ఆరోగ్యంగా ఉండటంతో పాటు ఉత్సాహంగా ఉన్నారని అధికారులు తెలిపారు. దర్శకుడు షిపెంకో ఛాలెంజ్‌ అనే మూవీ షూటింగ్ కోసం నటి యులియాతో కలిసి అక్టోబర్ 5వ తేదీన అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు.

వ్యోమగామి అనారోగ్యానికి గురికావడంతో అతనికి చికిత్స అందించే సీన్ కోసం అక్కడికి వెళ్లారు. సర్జన్‌ పాత్ర యులియా పెరెసిల్ద్ (37)తో కలిసి ప్రొడ్యూసర్ – డైరక్టర్ క్లిమ్ షిపెంకో (38) అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. అనారోగ్యం బారిన పడిన ఆస్ట్రోనాట్ పాత్రను ఇప్పటికే ఆరు నెలలకుపైగా (191 రోజులుగా) ఐఎస్‌ఎస్‌లోనే ఉన్న వ్యోమగామి అంటన్‌ ష్కాప్లెరోవ్‌తో సుమారు 40 నిమిషాలు ఉండే ఆ సన్నివేశాల్ని చిత్రీకరించారు.

………………………………………… : హాలీవుడ్ ని ఢీ కొడుతున్న చైనా సినిమా

దాదాపు 12రోజుల పాటు అంతరిక్షంలోనే గడిపి చిత్రీకరణ పూర్తి చేసుకున్న తర్వాత షెడ్యూల్ ప్రకారం అక్టోబర్‌ 17 ఉదయం భూమిని చేరుకున్నారు. ఈ పర్యటన విజయవంతమైనట్లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌) వెల్లడించింది. దీంతో అంతరిక్షంలో సినిమా చిత్రీకరించిన తొలి దేశంగానూ రష్యా నిలిచింది. సినిమా షూటింగ్‌ ఇంకా కొనసాగుతోందని, సినిమా రిలీజ్‌ ముహూర్తం ఖరారు కాలేదని సమాచారం.