PM Modi : నేడు ప్రధాని మోదీతో రష్యా మంత్రి భేటీ.. ఇరు దేశాల మధ్య సంబంధాలపై చర్చ

చైనా, బ్రిటన్‌ విదేశాంగ మంత్రుల భారత్‌ పర్యటన తర్వాత తాజాగా రష్యా విదేశాంగ మంత్రి కూడా రావడం కీలకంగా మారింది.

PM Modi : నేడు ప్రధాని మోదీతో రష్యా మంత్రి భేటీ.. ఇరు దేశాల మధ్య సంబంధాలపై చర్చ

Pm Modi (2)

Russian Minister meet PM Modi : భారత్‌లో పర్యటిస్తున్న రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్.. ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి జై శంకర్‌తో సమావేశం కానున్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు, వ్యాపార కార్యకలాపాలపై ఆయన చర్చించనున్నారు. యుక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఆరంభమైన తర్వాత ఆ దేశానికి చెందిన కీలక మంత్రి భారత్‌ను సందర్శించడం ప్రాధాన్యత సంతరించుకున్నది.

చైనా, బ్రిటన్‌ విదేశాంగ మంత్రుల భారత్‌ పర్యటన తర్వాత తాజాగా రష్యా విదేశాంగ మంత్రి కూడా రావడం కీలకంగా మారింది. మరోవైపు.. చైనాతో చర్చలు జరిపిన మరునాడే రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ భారత్‌కు వచ్చారు.

Sergei Lavrov : యుక్రెయిన్ సంక్షోభం.. భారత్‌కు రష్యా విదేశాంగ మంత్రి.. రెండు రోజులు పర్యటన!

బుధవారం చైనాకు వెళ్లి ఆ దేశ విదేశాంగ మంత్రిలో చర్చలు జరిపిన సెర్గీ లావ్రోవ్, అనంతరం నేరుగా భారత్‌కు వచ్చారు. ఫిబ్రవరి 24న యుక్రెయిన్‌పై రష్యా దాడి తర్వాత శాంతి చర్చల ప్రతిపాదన కోసం ఆయన తొలుత టర్కీలో పర్యటించారు. యుక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో రష్యాపై పశ్చిమ దేశాలు పలు ఆంక్షలు విధించాయి.

అయితే భారత్‌ మాత్రం రష్యా నుంచి చమురుతో పాటు పామాయిల్‌ వంటి అనేక వస్తువుల కొనుగోళ్లను కొనసాగిస్తున్నది. దీంతో అమెరికాతో పాటు ఆస్ట్రేలియా కూడా భారత్‌ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశాయి. అభివృద్ధి చెందుతున్న భద్రతా భాగస్వాముల మధ్య విభేదాలకు ఇది దారి తీయవచ్చని పేర్కొన్నాయి.