Putin Body Double : పుతిన్ ఒరిజినలా?నకిలీయా?రష్యా అధ్యక్షుడు ‘బాడీ డబుల్’వెనకున్న మిస్టరీ ఏంటి?

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. తన బాడీ డబుల్‌ చేశారని యుక్రెయిన్ కొత్త వాదన మొదలుపెట్టింది. దీంతో.. ప్రపంచ దేశాల్లో.. మరోసారి పుతిన్ కటౌట్ మీద చర్చ మొదలైంది. నిజంగానే.. ఒరిజినల్‌ పుతిన్‌కు బదులు నకిలీ పుతిన్‌ జనం మధ్య తిరుగుతున్నారా..? యుక్రెయిన్ వాదన వెనుక దాగున్న మిస్టరీ ఏంటి?

Putin Body Double : పుతిన్ ఒరిజినలా?నకిలీయా?రష్యా అధ్యక్షుడు ‘బాడీ డబుల్’వెనకున్న మిస్టరీ ఏంటి?

Russian President  Putin Body Double

Russian President  Putin Body Double : రష్యా-యుక్రెయిన్ మధ్య యుద్ధం మొదలై.. కొన్ని నెలలు దాటింది. ఇప్పటికీ వార్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇదే టైంలో.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. తన బాడీ డబుల్‌ను తెరపైకి తెచ్చారని యుక్రెయిన్ కొత్త వాదన మొదలుపెట్టింది. దీంతో.. ప్రపంచ దేశాల్లో.. మరోసారి పుతిన్ కటౌట్ మీద చర్చ మొదలైంది. నిజంగానే.. ఒరిజినల్‌ పుతిన్‌కు బదులు నకిలీ పుతిన్‌ జనం మధ్య తిరుగుతున్నారా..? యుక్రెయిన్ వాదన వెనుక దాగున్న మిస్టరీ ఏంటి?

పుతిన్.. మోస్ట్ పవర్‌ఫుల్ దేశాధినేతల్లో ఒకరు. ఆయన వేసే అడుగులు, తీసుకునే నిర్ణయాలు.. రష్యానే కాదు.. ప్రపంచ దేశాలను కూడా ఆశ్చర్యపరుస్తుంటాయ్. అతనికి సంబంధించి.. ఎలాంటి విషయం బయటకొచ్చినా.. దానిపై పెద్ద డిబేటే రన్ అవుతుంది. వ్లాదిమిర్ పుతిన్ విషయంలో.. వెస్ట్రన్ మీడియా కూడా వీలైనంత వ్యతిరేక ప్రచారం చేస్తూ ఉంటుంది. కొన్ని నెలల కిందట.. యుక్రెయిన్‌పై దండెత్తిన తర్వాత.. పుతిన్‌ని మరింత టార్గెట్ చేశారు. ఆయన ఆరోగ్యం క్షీణించిందని.. ఇంకెంతో కాలం బతకరని.. రకరకాల అంచనాలు, అంతకుమించిన ఊహాగానాలతో.. వరుస కథనాలు వచ్చాయి. వీటిపై.. ప్రపంచ దేశాల్లో పెద్ద చర్చే నడిచింది. అలాగే.. ఇప్పుడు మరో థియరీ తెరమీదికొచ్చింది. అదే.. పుతిన్ బాడీ డబుల్!

యుక్రెయిన్ – రష్యా మధ్య యుద్ధం జరుగుతున్న ఈ సమయంలోనే.. వ్లాదిమిర్ పుతిన్‌.. తనకు బాడీ డబుల్‌ను తెరమీదకు తెచ్చారని.. యుక్రెయిన్‌ వాదిస్తోంది. పుతిన్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని.. నిత్యం మెడికల్ చెకప్‌లకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని.. అందువల్ల అధికారిక కార్యక్రమాలకు ఆయన తనకు బదులుగా తనలా ఉన్న మరో వ్యక్తిని ఉపయోగిస్తున్నారని.. యుక్రెయిన్ మిలటరీ ఇంటలిజెన్స్ చీఫ్ మేజర్ General Kyrylo Budanov చెబుతున్నారు. పుతిన్‌కు సంబంధించిన ఫుటేజీలను నిశితంగా గమనిస్తే.. చాలా సమావేశాల్లో ఆయన హైట్, వెయిట్, చెవుల భాగంలో.. తేడాలు పరిశీలించొచ్చని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

మనిషి చేతి వేళ్లు యూనిక్‌గా ఉన్నట్లే.. చెవి భాగం కూడా ఒక్కొక్కరికీ ఒక్కో విధంగా ఉంటుంది. ఇప్పుడు.. పుతిన్ చెవి భాగంలో.. ఆ తేడాను సులువుగా గమనించొచ్చంటున్నారు యుక్రెయిన్ మిలటరీ అధికారులు. అంతేకాదు.. ఆ మధ్య ఇరాన్ పర్యటనకు సైతం పుతిన్ తన బాడీ డబుల్‌నే పంపించారని.. ఆ టూర్‌లో పుతిన్ బాగా జోష్‌లో కనిపించారని యుక్రెయిన్ వాదిస్తోంది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పుతిన్.. ప్రజలకు కనిపించేందుకు వీలుగా తన బాడీ డబుల్స్‌ని వాడుతున్నారేమోనని యుక్రెయిన్ ఇంటలిజెన్స్ అనుమానం వ్యక్తం చేస్తోంది. మరోవైపు.. ఈ వాదనపై క్రెమ్లిన్ నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు. ఇది కూడా.. అనుమానాలకు బలం చేకూరుస్తోంది.

ఈ మధ్యకాలంలో.. పుతిన్ పాల్గొన్న సమావేశాలు, ఆయన బయట కనిపించిన విజువల్స్‌ని పరిశీలిస్తే.. అందులో చాలా తేడాలు కనిపించాయ్. ఒక్కోసారి ఎంతో హుషారుగా కనిపించిన పుతిన్.. వారం తేడాలోనే మరో కార్యక్రమానికి హాజరైనప్పుడు.. డీలాగా కనిపించారు. ఇలా.. ఒకే పుతిన్.. విభిన్న వ్యవహారశైలిలో కనిపించడంతో.. ఆయన బాడీ డబుల్ వినియోగిస్తున్నారనే ఊహాగానాలు మరింత పెరిగాయ్. ఇవన్నీ చూశాక.. నిజంగానే.. వెస్ట్రన్ మీడియా చెబుతున్నట్లు.. పుతిన్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా? ఆయనకు ఏమైందనే.. ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

పుతిన్‌.. బాడీ డబుల్‌ థియరీపై ఊహాగానాలు ఇప్పుడేం కొత్త కాదు. 2018లోనే పుతిన్‌లాగా ఇద్దరు కాదు ముగ్గురు ఉన్నారంటూ.. ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ ఆసక్తికర కథనం వెలువరించింది. ఆ సమయంలో.. ట్విట్టర్‌లో.. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న మూడు భిన్న రూపాలున్న పుతిన్ ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. ఇప్పటికే.. పుతిన్ బాడీ డబుల్‌కు సంబంధించి.. ఇంటర్నెట్‌లో చాలా ఫోటోలున్నాయి. వీటికి ఇప్పుడు.. యుక్రెయిన్ వాదన మరింత బలమిస్తోంది.

ఒక వ్యక్తికి బదులుగా.. అలాంటి ముఖ కవళికలు, శరీర ఆకృతి ఉన్న వ్యక్తి.. ఆ పనిని పూర్తి చేయడం. దీనినే.. బాడీ డబుల్ అని పిలుస్తారు. అంటే.. 69 ఏళ్ల పుతిన్‌కు బదులు.. అచ్చం ఆయనలాగే ఉన్న మరో వ్యక్తి.. పుతిన్ స్థానంలోకి వెళ్లి.. ఎవ్వరికీ అనుమానం రాకుండా ఆ పనిని పూర్తి చేస్తారన్నమాట. అయితే.. ఇదంతా.. దేశాధినేత రక్షణ, దేశ భద్రత, రహస్యాలకు సంబంధించిన అంశం. బాడీ డబుల్ విషయంలో.. ఎన్నో ఊహాగానాలు వస్తుంటాయి. రకరకాల ప్రచారాలు జరుగుతుంటాయి. ఎప్పటిలానే ఇప్పుడు కూడా రష్యా ఈ ప్రచారాలపై స్పందించలేదు. అందువల్ల.. నిజంగానే.. పుతిన్‌లా మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారా? లేరా? అన్నది.. ఎప్పటికీ మిస్టరీగానే మిగిలిపోతుంది.