Russia-ukraine war: క్రిమియాలో ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చేసిన రష్యా.. ఉక్రెయిన్‌పై కొనసాగుతున్న దాడులు

ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో క్రిమియాలోకి ఉక్రెయిన్ డ్రోన్లు ప్రవేశించగా వాటిని కూల్చేశామని రష్యా అధికారులు చెప్పారు. అలాగే, ఉక్రెయిన్ ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో రష్యా ఆర్మీ దాడులు కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్ లో అంతర్భాగమైన క్రిమియా 2014 నుంచి రష్యా అధీనంలోకి వెళ్ళిపోయిన విషయం తెలిసిందే. పశ్చిమ క్రిమియాలోకి చిన్నపాటి డ్రోన్లు ప్రవేశించి గగనతల రక్షణ వ్యవస్థపై దాడి చేయడానికి ప్రయత్నించాయని క్రిమియా గవర్నర్ సలహాదారు ఒలేగ్ క్రుచ్కోవ్ కూడా తెలిపారు.

Russia-ukraine war: క్రిమియాలో ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చేసిన రష్యా.. ఉక్రెయిన్‌పై కొనసాగుతున్న దాడులు

Russia-ukraine war

Russia-ukraine war: ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో క్రిమియాలోకి ఉక్రెయిన్ డ్రోన్లు ప్రవేశించగా వాటిని కూల్చేశామని రష్యా అధికారులు చెప్పారు. అలాగే, ఉక్రెయిన్ ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో రష్యా ఆర్మీ దాడులు కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్ లో అంతర్భాగమైన క్రిమియా 2014 నుంచి రష్యా అధీనంలోకి వెళ్ళిపోయిన విషయం తెలిసిందే. పశ్చిమ క్రిమియాలోకి చిన్నపాటి డ్రోన్లు ప్రవేశించి గగనతల రక్షణ వ్యవస్థపై దాడి చేయడానికి ప్రయత్నించాయని క్రిమియా గవర్నర్ సలహాదారు ఒలేగ్ క్రుచ్కోవ్ కూడా తెలిపారు.

అయితే, గగనతల రక్షణ వ్యవస్థలు ఆ దాడిని తిప్పికొట్టాయని వివరించారు. ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణ నష్టమూ జరగలేదని చెప్పారు. తాజాగా జరిగిన ఈ దాడి క్రిమియాలోని రష్యా దళాలకు ఆందోళనకు గురిచేస్తోంది. నల్ల సముద్రంలోని రష్యా నౌకాదళ ప్రధాన కార్యాలయంపై జూలై 31న దాడి జరగగా, ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అలాగే, క్రిమాలోని రష్యా ఆయుధ డిపోపై, వైమానిక స్థావరంపై కూడా దాడి ఇటీవలే దాడి జరిగింది.

రష్యా-ఉక్రెయిన్ మధ్య దాదాపు ఆరు నెలల నుంచి యుద్ధం జరుగుతోంది. అయితే, రష్యా చేసే దాడులను తిప్పికొట్టడమే తప్ప రష్యా భూభాగంపై ఉక్రెయిన్ దాడులు చేయట్లేదు. క్రిమియాలో మాత్రం దాడులు జరుపుతుండడం గమనార్హం. ఉక్రెయిన్ లో రష్యా దాడులు కొనసాగుతుండడంతో అక్కడి సాధారణ పౌరులు కూడా గాయాలపాలవుతున్నారు.

Tomato Fever: భారత్‌లో 82కి చేరిన టమాటా ఫ్లూ కేసులు.. ఒడిశాలో 26 మంది చిన్నారులకు వైరస్