Saudi Arabia : రంజాన్ మాసంలో ఉరిశిక్ష అమలు చేసిన సౌదీ అరేబియాపై విమర్శలు .. ఒక్క ఏడాదిలోనే 17 మరణశిక్షలు అమలు
ముస్లింలకు రంజాన్ అత్యంత పవిత్రమైన మాసం. ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసంలో ఉరిశిక్ష అమలు చేసింది. దీంతో సౌదీ అరేబియాపై విమర్శలు వస్తున్నాయి.

Saudi Executes Man During
Saudi Arabia : ముస్లింలకు రంజాన్ అత్యంత పవిత్రమైన మాసం. ఈ నెల రోజులు ముస్లింలు ఉపవాసాలతో నియమనిష్టలతో ఉంటారు. సౌదీ అరేబియా అంటే ఇస్లాం జన్మస్థలంగా భావిస్తారు ముస్లింసోదరులు. ఈ దేశంలోనే ముస్లింలకు అత్యంత పవిత్రమైన మదీనా నగరం ఉంది. మక్కా తోపాటు ఇస్లాంలో మదీనాను రెండవ పవిత్ర నగరంగా పేరొందింది. అటువంటి పవిత్ర నగరం ఉన్న పైగా రంజాన్ మాసంలో సౌదీ అరేబియాలో ఓ దోషికి ఉరి శిక్ష అమలు చేశారు.
ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసంలో ఉరిశిక్ష అమలు చేయటంతో సౌదీ అరేబియాపై విమర్శలు వస్తున్నాయి. రంజాన్ మాసం ప్రారంభమైన ఐదో రోజున అంటే మార్చి 28న ఇస్లాం రెండో పవిత్ర నగరాన్ని కలిగి ఉన్న మదీనా ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు ‘సౌదీ అధికారిక మీడియా ప్రెస్ ఏజెన్సీ’ (సోమవారం)వెల్లడించింది. సౌదీకి చెందిన వ్యక్తి ఓమహిళను కత్తితో పొడిచి చంపిన కేసులో అతనిని ఉరి తీసింది. ఎంతో పవిత్రమైన రంజాన్ మాసంలో సౌదీ అరేబియా ఓ వ్యక్తిని ఉరి తీసింది అని బెర్లిన్ కు చెందిన యూరోపియన్ సౌదీ ఆర్గనైజేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ (ESOHR)ప్రకటించింది.
ఇస్లాం జన్మస్థలం సౌదీ అరేబియాలో 2009 నుంచి రంజాన్ మాసంలో ఎప్పుడూ ఇలా జరగలేదని మీడియా వెల్లడించింది. ఈ ఘటనపై మానవహక్కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇస్లాం జన్మస్థలమైన సౌదీ అరేబియా ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 17 మందికి మరణశిక్ష అమలు చేసిందని ESOHR తెలిపింది. అలాగే 2022లో 147 మందిని ఉరి తీయగా..2021లో 69 మందికి మరణశిక్ష అమలు చేసింది. 2015లో కింగ్ సల్మాన్ బాధ్యతలు చేపట్టిన తర్వాతి నుంచి ఇప్పటి వరకు 1000 మందికిపైగా మరణశిక్ష అమలు చేసిందని తెలిపింది.