‘E’ bowl, ‘E’ spoon Salty Taste : ఈ గిన్నె,స్పూన్‌తో తింటే ‘రుచి’ పెరుగుతుంది.. ‘ఉప్పు వాడకాన్ని’ తగ్గించేస్తాయ్..

ఈ గిన్నె,స్పూన్‌తో తింటే ‘రుచి’ పెరుగుతుంది..ఉప్పు వాడకాన్ని ఇవి తగ్గించేస్తాయ్..

‘E’ bowl, ‘E’ spoon Salty Taste : ఈ గిన్నె,స్పూన్‌తో తింటే ‘రుచి’ పెరుగుతుంది.. ‘ఉప్పు వాడకాన్ని’ తగ్గించేస్తాయ్..

‘E’ bowl, ‘E’ spoon Salty Taste :

‘E’ bowl, ‘E’ spoon Salty Taste : ఉప్పు ఎక్కువగా తింటే ముప్పు తప్పదని హెచ్చరిస్తుంటారు డాక్టర్లు. ఉప్పులేనిదే ఏ వంటా ఉండదు. ఉప్పు కాస్త ఎక్కువైతే తినలేము. కాస్త తక్కువైనా ఎక్కువైనా ఇబ్బందే. ప్రతీరోజూ మనం తీసుకునే ఆహారపదార్థాల ద్వారా శరీరానికి అవసరమైన ఉప్పును అందిస్తాం. శరీరానికి ఉప్పు అవసరమే. కానీ ఎక్కువైతే ప్రమాదం తప్పదని డాక్టర్లు హెచ్చరిస్తుంటారు. కానీ ఉప్పు తక్కువైతే తినలేమే ఎలా మరి అంటుంటారు కొంతమంది. అదిగో అటువంటివారి కోసం ఈ ప్రత్యేకమైన ‘E’ గిన్నె, ‘E’ స్పూన్లు అంటున్నారు శాస్త్రవేత్తలు. ఏంటీ ‘E’ గిన్నె, ‘E’ స్పూన్లు అంటే..‘E’ అంటే ఎలక్ట్రిక్ అని తెలిసిందే కదా..అదే ఈ ‘E’ గిన్నె ‘E’ స్పూన్ అన్నమాట..

ఉప్పు వాడకాన్ని తగ్గించే ఎలక్ట్రిక్‌ స్పూన్‌!ఉప్పు వాడకాన్ని తగ్గించే ఎలక్ట్రిక్‌ గిన్నెలు ఇవి. ఉప్పు వాడకాన్ని తగ్గించటానికి ఎలక్ట్రిక్‌ స్పూన్‌, గిన్నెను తయారుచేశారు జపాన్‌కు చెందిన మీజి యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. ఈ ఎలక్ట్రిక్‌ స్పూన్‌, గిన్నె విద్యుత్తు ప్రేరణ ద్వారా ఆహారంలో ఉప్పు రుచిని పెంచుతుంది. కాబట్టి మనం ఉప్పు వేసుకోకుండా (తగ్గించి) తినొచ్చు. ఈ గిన్నె, స్పూన్‌తో తినే ఆహారంలో ఒకటిన్నర రెట్లు ఉప్పు రుచి పెరుగుతుందని, తద్వారా ఉప్పు వాడకం తగ్గిపోతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

తక్కువ సోడియం కలిగిన ఆహారాల యొక్క ఉప్పు రుచిని పెంచడానికి బలహీనమైన విద్యుత్ ప్రేరణను ఉపయోగించవచ్చని తెలిపారు. 2023లో జపాన్‌లో విడుదల చేయనున్న “ఎలక్ట్రిక్ సాల్ట్” పరికరాలు రక్తపోటును పెంచకుండా ఉప్పు రుచిని 1.5 రెట్లు పెంచుతాయని తెలిపారు శాస్త్రవేత్తలు.