Covid-19 Face Mask: కొవిడ్ కణాలు తాకగానే మెరిసిపోయే మాస్క్.. సైంటిస్టులు సక్సెస్

జపాన్ టెక్నాలజీ సాయంతో కొత్త రకం ఫేస్ మాస్క్ లు రెడీ చేశారు. కొవిడ్-19తో ఉన్న వ్యక్తుల నుంచి వచ్చే వైరస్ కణాలను తాకగానే మాస్క్ మెరిసిపోతుందట. జపాన్ లోని క్యోటో ప్రీఫెక్చురల్.....

Covid-19 Face Mask: కొవిడ్ కణాలు తాకగానే మెరిసిపోయే మాస్క్.. సైంటిస్టులు సక్సెస్

Glowing Mask

Covid-19 Face Mask: జపాన్ టెక్నాలజీ సాయంతో కొత్త రకం ఫేస్ మాస్క్ లు రెడీ చేశారు. కొవిడ్-19తో ఉన్న వ్యక్తుల నుంచి వచ్చే వైరస్ కణాలను తాకగానే మాస్క్ మెరిసిపోతుందట. జపాన్ లోని క్యోటో ప్రీఫెక్చురల్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు మాస్క్ పై వైరస్ చేరినప్పుడు మెరిసిపోయే గుణాన్ని ఉండేలా ఏర్పాటు చేశారు.

ఈ మాస్కుల్లో రెండు ప్రత్యేకమైన పదార్థాలు ఉన్నాయి. ఆస్ట్రిచ్ గుడ్ల నుంచి తీసిన యాంటీబాడీలు, ఫోరోసెంట్ డై. వీటి సాయంతోనే యసుహీరో సుకమోటో టీం ఇన్నోవేషన్ డిటెక్షన్ సిస్టమ్ క్రియేట్ చేశారు. అంతా సజావుగా సాగితే ప్రభుత్వం నుంచి అనుమతి వస్తుందని ఆశిస్తున్నారు. అదే జరిగితే 2022 నాటికి ఈ ఫ్లోరోసెంట్ మాస్కులు మార్కెట్లోకి వచ్చేస్తాయి.

…………………………….. : జయలలిత నివాసాన్ని స్వాధీనం చేసుకున్న దీప

ఆస్ట్రిచ్ గుడ్లు ఎందుకంటే..
ఆస్ట్రిచ్ పక్షులు చాలా గుణాలు కలిగి ఉంటాయి. బయటి నుంచి వచ్చిన వైరస్ ను శరీరంలోకి రానివ్వకుండానే చంపేస్తాయి. అందుకే మాస్కులపై స్పెషల్ ఫిల్టర్ ను వాటితో తయారుచేశారు. వాటితో పాటు ఫ్లోరోసెంట్ డైను ఉంచడంతో ఆస్ట్రిచ్ గుడ్లతో చేసిన లేయర్ పై వైరస్ కణాలు చేరగానే మెరిసిపోతుంటాయి.

ఈ మాస్కుల సాయంతో ప్రజలు ముందుగానే జాగ్రత్తపడతారని.. అలా ముందస్తు ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా సీరియస్ అనారోగ్యానికి గురికాకుండా ఉంటారని అంటున్నారు. ఇక ఇదే టెక్నిక్ తో సెల్ఫ్ టెస్టింగ్ కిట్లు రెడీ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

……………………………………… : సెలవులు ఇవ్వడం లేదని తోటి విద్యార్థులకు విషం పెట్టాడు