Odisha : సెలవులు ఇవ్వడం లేదని తోటి విద్యార్థులకు విషం పెట్టాడు

కస్మాత్తుగా...20 మంది విద్యార్థులు వాంతులు, వికారంతో బాధ పడ్డారు. వెంటనే వీరిని ఆసుపత్రిలో చేరిపించి...చికిత్స అందించడంతో...

Odisha : సెలవులు ఇవ్వడం లేదని తోటి విద్యార్థులకు విషం పెట్టాడు

Odisha school

Updated On : December 11, 2021 / 3:30 PM IST

Odisha School : ఒమిక్రాన్ వైరస్ విస్తరిస్తోంది. కేసులు పెరుగుతున్నాయి. దీంతో మళ్లీ లాక్ డౌన్, కఠిన ఆంక్షలు అమలవుతాయా ? అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. కరోనా కాలంలో మూసివేసిన స్కూళ్లు ఇటీవలే తెరుచుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరోసారి పాఠశాలలకు సెలవులిస్తారని ఓ విద్యార్థి ఆశించాడు. కానీ..అలాంటిదేమీ జరగలేదు. దీంతో ఓ దారుణానికి ఒడిగట్టాడు. తోటి విద్యార్థులకు నీళ్లలో విషం కలిపి ఇచ్చాడు. ప్రమాదవశాత్తు ఎమి జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలో చోటు చేసుకుంది.

Read More : Final Goodbye : రావత్ దంపతుల చితాభ‌స్మాన్ని గంగాన‌దిలో కలిపిన కుమార్తెలు

బర్ గార్ జిల్లాలో కామగాన్ హయ్యర్ సెకండరీ స్కూల్ ఉంది. ఇందులో 11వ తరగతి చదువుతున్నాడో ఓ విద్యార్థి. అకస్మాత్తుగా…20 మంది విద్యార్థులు వాంతులు, వికారంతో బాధ పడ్డారు. వెంటనే వీరిని ఆసుపత్రిలో చేరిపించి…చికిత్స అందించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అసలు ఏమి జరిగిందనే దానిపై ఆరా తీయగా..విస్తుగొలిపే విషయం బయటపడింది.

Read More : Maharashtra Omicron : ఒమిక్రాన్ టెన్షన్…ముంబాయిలో 144 సెక్షన్

ఒమిక్రాన్ కారణంగా…మరోమారు లాక్ డౌన్ పెడుతారని ఆ విద్యార్థి ఆశించాడని, కానీ..అలా జరగకపోవడంతో ఈపనికి పూనుకున్నాడని ప్రిన్స్ పాల్ ప్రేమానంద్ పటేల్ వెల్లడించారు. విషం కలిపిన విద్యార్థిని అరెస్టు చేయాలని తోటి విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేసినట్లు వెల్లడించారు. కానీ…విద్యార్థి భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా…కొన్ని రోజుల పాటు స్కూల్ నుంచి సస్పెండ్ చేయడం జరిగిందన్నారు. తోటలోని పురుగుల మందును నీళ్లలో కలిపి…విద్యార్థులకు తాగేందుకు ఇచ్చాడని తేలింది.