Viruses from China: చైనా నుంచి మరో 18 వైరస్‌లు కనుగొన్న సైంటిస్టులు

చైనాలోని నిత్యం రద్దీగా ఉండే మార్కెట్లలో 18కొత్త వైరస్ లను కనుగొన్నారు ఇంటర్నేషనల్ సైంటిస్టుల టీం. వీటివల్ల జంతువులతో పాటు మనుషులకు కూడా ప్రమాదం ఉన్నట్లు గుర్తించారు.

Viruses from China: చైనా నుంచి మరో 18 వైరస్‌లు కనుగొన్న సైంటిస్టులు

China Scientists

Viruses from China: చైనాలోని నిత్యం రద్దీగా ఉండే మార్కెట్లలో 18కొత్త వైరస్ లను కనుగొన్నారు ఇంటర్నేషనల్ సైంటిస్టుల టీం. వీటివల్ల జంతువులతో పాటు మనుషులకు కూడా ప్రమాదం ఉన్నట్లు గుర్తించారు. కొవిడ్-19 మహమ్మారి పుట్టిన స్థలంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న చైనాలోని వూహాన్ లో అతిపెద్ద సీఫుడ్ మార్కెట్ ఉంది. కరోనావైరస్ తొలినాళ్లలో జంతువుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందింది కూడా ఇక్కడే.

చైనా, అమెరికా, బెల్జియం, ఆస్ట్రేలియాకు చెందిన సైంటిస్టులు కనుగొన్న దాని ప్రకారం.. అక్కడి వాసులు వేటాడి లేదా దొరికిన మాంసం తింటారు. వాటిల్లో SARS-CoV, SARS-CoV-2 ఆనవాళ్లున్నట్లుగా గుర్తించారు. అంతేకాకుండా తొలిసారి చాలా రకాలైన వైరస్ లు ఉన్నట్లుగా తెలిసింది. కొవిడ్ మహమ్మారితో మూసేసిన మార్కెట్లో తొలిసారి ఈ విషయం తెలిసింది.

మొత్తం 1725జంతువుల నమూనాలను విశ్లేషించారు. వాటిల్లో చైనా వ్యాప్తంగా 16రకాలైన ఆనవాళ్లున్నట్లు తెలిసింది. ‘ఈ స్టడీ నుంచి 71 వైరస్ లు గుర్తించాం. 45వైరస్ ల పేర్లు తొలిసారి వింటున్నాం. 18వైరస్ లు మాత్రం మనుషులకు, పెంపుడు జంతువులకు హాని కలిగించేవిగా తెలిసింది’ అని రచయిత షో సు అన్నారు.

……………………………………..: ఘోరం.. యువతిని వివస్త్రను చేసి, జననాంగాన్ని కాల్చేసి..