షాపులోకెళ్లి చిప్స్ ప్యాకెట్ చోరీ చేసిన పక్షి

షాపులోకెళ్లి చిప్స్ ప్యాకెట్ చోరీ చేసిన పక్షి

Thief Bird

thief bird cute video goes viral : కారం కారంగా చిప్ప్ కనిపిస్తే తినకుండా ఉండలేం. కరకరా నమిలేయాలనిపిస్తుంది. అలాగే కోతులకు మనుషుల చేతిలో చిప్స్ ప్యాకెట్స్ కనిపిస్తే ఎత్తుకెళ్లిపోతాయి. కానీ పక్షులు చిప్స్ ప్యాకెట్స్ ఎత్తుకెళ్లటం ఎక్కడైనా చూశారా? స్కాట్లాండ్‌లోని… అబెర్దీన్‌లో పట్టపగలు ఓ పక్షి దర్జాగా ఓ షాపులోకి చొరబడింది. ఆటోమేటిక్ గా తెరుచుకుంటూ..మూసుకుపోయే డోర్ లోంచి లోపలికెళ్లిందో పక్షి..షాపులోపల ర్యాక్ లో ఉండే చిప్స్ ప్యాకెట్స్ లోంచి ఓ ప్యాకెట్ తీసుకుని గబగబా నడుచుకుంటూ బైటకొచ్చేసింది. దీనికి సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సీగల్ పక్షి. సముద్రాలు, నదుల నీటిపైనే ఎక్కువగా తిరుగుతుంటాయి. చేపల్ని వేటాడి తింటాయి. ఈ పక్షులు… జనావాసాల్లోకి పెద్దగా రావు. కానీ స్కాట్లాండ్ లో మాత్రం ఓ సీగల్ పక్షి ఓ సూపర్ మార్కెట్ ముందుకొచ్చి వాలింది. పాపం ఎంత ఆకలితో ఉందో ఏమో… కాసేపు అటూ ఇటూ దిక్కులు చూసింది. లోపల నుంచి ఓ వ్యక్తి ఆటోమేటిక్ డోర్ నుంచి బైటకు రావటం చూసింది. అది చూసిన ఆ పక్షి… ఓస్ ఇంతేనా… నేను కూడా వెళ్లి… నాకు కావాల్సింది తెచ్చేసుకంటే పోద్దిగా..అనుకుందేమో..అంతే చటుక్కున లోపలికి దూరింది.

అంతా బాగానే ఉన్నా పక్షికి ఓ సమస్య ఎదురైంది. సూపర్ మార్కెట్‌కి సెన్సార్ గ్లాస్ ఫ్రంట్ డోర్లు ఉన్నాయి. ఎవరైనా డోర్ దగ్గరకు వస్తే తప్ప అవి తెరచుకోవు. దీనిపై నిశితంగా పరిశీలించిన సీగల్… ఓ కస్టమర్ బయటకు వస్తున్నప్పుడు డోర్లు తెరచుకోవడాన్ని చూసింది. కస్టమర్ బయటకు వెళ్లిపోగానే… డోర్లు మూసుకుపోయే లోపే… వేగంగా నడుస్తూ… సూపర్ మార్కెట్‌లోకి వెళ్లింది. అక్కడ ఎన్నో రకాల చిప్స్ ప్యాకెట్లను చూసింది. వాటిలో ఓ ప్యాకెట్‌ని నోక కరచుకొని… మళ్లీ డోర్ల దగ్గరకు వచ్చింది. సెన్సార్ డోర్లు… పక్షి దగ్గరకు రాగానే తెరచుకున్నాయి. అంతే గబగబా బయటకు వచ్చేసి… చిప్స్ ప్యాకెట్‌కి కన్నం పెట్టేందుకు ముక్కుతో పొడుస్తున్న ఈ ఫన్నీ వీడియో

ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన ఈ వీడియో అందరికీ నచ్చేస్తోంది. సూపర్, అదిరింది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఫేస్‌బుక్ కంటే ముందు… ఓ వెబ్‌సైట్‌లో నీల్ ట్రేనర్ ఈ వీడియోను పోస్ట్ చేశారు. మిస్ అవ్వకుండా చూడాల్సిన వీడియోలో ఇదీ ఒకటి అని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఫేస్‌బుక్‌తోపాటూ… ఇతర సోషల్ మీడియాలలోనూ ఇది వైరల్ అవుతోంది.
https://youtu.be/Q6KKaD_-yus