ముఖానికి ప్లాస్టిక్ ‘ఫేస్ షీల్డ్’ ధరించడం మంచిదేనా? వైద్య నిపుణులు ఏమంటున్నారు?

  • Published By: veegamteam ,Published On : June 29, 2020 / 04:10 AM IST
ముఖానికి ప్లాస్టిక్ ‘ఫేస్ షీల్డ్’ ధరించడం మంచిదేనా? వైద్య నిపుణులు ఏమంటున్నారు?

ప్రపంచవ్యాప్తంగా కరోనా కాలం నడుస్తోంది. కరోనాకు ముందురోజుల్లో మాదిరిగా సురక్షితమైన వాతావరణంలో మనం జీవించడం లేదు. బయట కరోనా ముప్పు పొంచి ఉంది. కనిపించని శత్రువులా మనుషుల ప్రాణాలను కబళిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మాస్క్ లేకుండా బయటకు వెళ్లలేని పరిస్థితి. ముఖానికి తప్పనిసరిగా మాస్క్ ఉండాల్సిందే. లేదంటే కరోనా కోరల్లో చిక్కుకుపోవాల్సిందే.. కరోనా బారిన పడకుండా ఉండేందుకు ప్రతిఒక్కరూ ముఖాలకు రకరకాల మాస్క్ లు ధరిస్తున్నారు

ఒక్కొక్కరూ తమకు అందుబాటులో ఉన్న మాస్క్‌లనే ధరిస్తున్నారు. అవి ఎంతవరకు సురక్షితమనేది ఎవరూ చెప్పలేరు. ఈ మధ్యన ప్లాస్టిక్ ఫేస్ షీల్డ్‌లు కూడా మార్కెట్లోకి వచ్చేశాయి. ఈ ప్లాస్టిక్ ఫేస్ షీల్డ్ సురక్షితమేనా? అసలు ఫేస్ మాస్క్ లకు ఫేస్ షీల్డ్‌లకు తేడా ఏంటి? ఈ రెండింటీలో ఏది సురక్షితమంటే.. ఫేస్ షీల్డ్ ధరించడం వల్ల అదనపు భద్రత మాత్రమే ఉంటుందంటున్నారు వైద్య నిపుణులు. క్లీన్ ప్లాస్టిక్ ఫేస్ షీల్డ్ ( ముఖ కవచం) ధరించడం ద్వారా మీ ముఖానికి స్ప్లాష్ ప్రూఫ్ అవరోధాన్ని అందిస్తాయి. ఫేస్ మాస్క్‌లకు ఇవి అదనపు భద్రత మాత్రమే తప్పా ఫేస్ మాస్క్‌లకు భర్తీ కాదని అంటున్నారు.

ఇతరుల నోటి తుంపర్ల నుంచి ఫేస్ షీల్డ్స్ రక్షిస్తాయి :

ఫేస్ మాస్క్‌లో అతి పెద్ద లోపాలలో వస్త్రాలు ఒక కారణం.. ఇతరుల నోటి తుంపర్ల నుంచి క్లాత్ ఫేస్ మాస్క్‌లు సమర్థవంతంగా నిరోధించలేవు. మీరు మాస్క్ ధరించలేదంటే.. మిమ్మల్ని మీరు సురక్షితంగా రక్షించుకోలేరు. అవతలి వ్యక్తి కూడా మాస్క్ ధరిస్తే మాత్రమే మీకు మాస్క్ నుంచి రక్షణ ఉంటుంది. మాస్క్ లోని అదనపు రక్షణ పొర ఉంటేనే సాధ్య పడుతుంది. స్ప్లాష్ ప్రూఫ్ ప్లాస్టిక్ ధరించి ఉంటే ఆ వ్యక్తి నోటి తుంపర్లు మీ ముఖం కంటే ఫేస్ షీల్డ్ తాకుతాయి. ఈ షీల్డ్ స్వభావం ఏమిటంటే కిందిభాగంలో ఓపెన్ టాప్ ఉంటుంది. మీరు నిలబడిన సమయంలో ఒక కుర్చీలో కూర్చొన్న వ్యక్తి ఎవరైనా మిమ్మల్ని చూసి తుమ్ముతే.. ఈ షీల్డ్ ఆ వ్యక్తి నోటి తుంపర్లను ముఖానికి చేరకుండా నిరోధించలేదు.

తుమ్మినప్పుడు ఇతరులను ఫేస్ షీల్డ్స్ పెద్దగా రక్షించలేవు :

మీ నోటి, ముక్కు నుంచి వెలువడిన మీ శ్వాసకోశ బిందువులను ఫేస్ మాస్క్ అయితే పట్టేసుకుంటుంది. కానీ ముఖ కవచం దిగువన తెరిచి ఉంటుంది. ఇది ముసుగు కంటే మంచిది కాదు.. ఎందుకంటే.. కిందివైపు నుంచి తుంపర్లు ముఖాన్ని తాకే ప్రమాదం ఉందని గుర్తించాలి. ఫేస్ షీల్డ్ ధరించే ఆరోగ్య కార్యకర్తలు కూడా లోపల మరో మాస్క్ ధరిస్తున్నారు. కవచం వారిని రక్షిస్తుంది. వారి మాస్క్‌ను కూడా శుభ్రంగా ఉంచుతుంది. తద్వారా మాస్క్‌ను దానిని ఎక్కువసేపు ధరించవచ్చు. వాస్తవానికి మాస్క్ లు ఒకేసారి మాత్రమే వాడాలి. కాని చాలా ఆస్పత్రుల్లో మాస్క్‌ల సరఫరా చాలా తక్కువగా ఉందని నివేదికలు చెబుతున్నాయి.

ఫేస్ షీల్డ్స్‌లతో ఇతర ప్రయోజనాలు ఏంటి? :

మీ నోరు ముక్కును రక్షించడంతో పాటు, ముఖ కవచాలు కూడా మీ కళ్ల నుంచి వైరస్ నిండిన నోటి తుంపర్లను దూరంగా ఉంచుతాయి. ప్రమాదవశాత్తు మీ ముఖాన్ని లేదా మాస్క్‌కు తాకడం కూడా దాదాపు అసాధ్యమనే చెప్పాలి. ఫేస్ షీల్డ్స్ కూడా శుభ్రం చేయడం చాలా సులభమని అంటున్నారు. ఎప్పటికప్పుడూ శానిటైజ్ చేయవచ్చు. మాస్క్‌ల కన్నా ఎక్కువ ఫుల్ ప్రూఫ్‌గా ఉంటాయి. ఎందుకంటే మీరు అనుకోకుండా మీ గడ్డం మీద ఫేస్ షీల్డ్ ధరించినప్పుడు మాస్క్ తీసినట్టుగా వీలు కాదు.

మీరు బయటికి వచ్చినప్పుడు ముఖ కవచాన్ని ధరించాలా? అంటే.. కొంతమంది నిపుణులు.. మాస్క్‌లు అందుబాటులో లేనప్పుడు మీరు మాస్క్‌తో పాటు లేదా దానికి బదులుగా ఫేస్ షీల్డ్ ధరించవచ్చునని సూచిస్తున్నారు. మీరు ఇంట్లో COVID-19 రోగిని చూసుకుంటుంటే.. అనారోగ్యంతో ఉన్న వ్యక్తులతో మీరు సన్నిహితంగా ఉంటే ఫేస్ షీల్డ్ ఖచ్చితంగా మంచిదేనని అంటున్నారు. COVID-19 పరీక్షలను నిర్వహించే వ్యక్తులతో సహా కొందరు వైద్య నిపుణులు ఫేస్ షీల్డ్‌లను నెలల తరబడి ధరిస్తూనే ఉన్నారు. సాధ్యమైనంతవరకు ఫేస్ మాస్క్ ధరించినప్పటికి కూడా ఫేస్ షీల్డ్ రెండూ ధరించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Read: పచ్చని కాపురాల్లో కరోనా చిచ్చు… కూలుతున్న కుటుంబాలు