Singapore-India Flights : భారతీయ పర్యాటకులకు గుడ్ న్యూస్..క్వారంటైన్ ఫ్రీ ట్రావెల్ అనుమతించిన సింగపూర్

కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న భారతీయ పర్యాటకులకు సింగపూర్ గుడ్ న్యూస్ చెప్పింది. రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న భారతీయ పర్యాటకులు ఎలాంటి క్వారంటైన్ లేకుండా సింగపూర్ లో

Singapore-India Flights :  భారతీయ పర్యాటకులకు గుడ్ న్యూస్..క్వారంటైన్ ఫ్రీ ట్రావెల్ అనుమతించిన సింగపూర్

Singapore

Singapore-India Flights  కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న భారతీయ పర్యాటకులకు సింగపూర్ గుడ్ న్యూస్ చెప్పింది. రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న భారతీయ పర్యాటకులు ఎలాంటి క్వారంటైన్ లేకుండా సింగపూర్ లో అడుగుపెట్టవచ్చు. ఈ మేరకు సింగపూర్ పౌర విమానయాన అథారిటీ(CAAS)ఆదివారం ప్రకటించింది. సింగపూర్ మరియు భారతదేశం మధ్య షెడ్యూల్డ్ కమర్షియల్ ఫ్లైట్ పునఃప్రారంభంపై భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు CAAS తెలిపింది.

వ్యాక్సినేటెడ్ ట్రావెల్ లేన్ ( VTL) కార్యక్రమం కింద సింగపూర్ మరియు భారతదేశం మధ్య వాణిజ్య విమానాలు నవంబర్ 29 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలిపింది. ప్రతిరోజూ 6 విమాన సర్వీసులు ఉంటాయని సింగపూర్ పౌర విమానయాన అథారిటీ తెలిపింది. చెన్నై, ఢిల్లీ, ముంబై నుంచి రోజువారీ 6 విమానాల సర్వీసులు ఉంటాయని CAAS తెలిపింది.

ALSO READ Kaikala Satyanarayana : విషమంగానే కైకాల సత్యానారాయణ ఆరోగ్యం