Singapore: కాఫీ, మిల్క్ షేక్ అమ్మడం కూడా నేరమే.. అలా చేసినందుకు జైలుపాలైన ఓ వ్యక్తి

అయితే షే హీ అమ్మకాల నుంచి ఎటువంటి కమీషన్ పొందనప్పటికీ, అతని నెలవారీ అమ్మకాల లక్ష్యాలను చేరుకోవడానికి మాత్రం ఉత్తర కొరియాతో రహస్య ఒప్పందం చేసుకున్నాడని కోర్టు పత్రాలు వెల్లడించాయి. సింగపూర్‌లోని ఉత్తర కొరియా రాయబార కార్యాలయంలో అంబాసిడర్‌గా పనిచేస్తున్న మిస్టర్ కిమ్‌ను హీ కలిశాడు. అనంతరం 2014లో రాయబార కార్యాలయంలోని మరొక ఉద్యోగికి పరిచయం అయ్యాడు. ఆ పరిచయాల నుంచే ఈ వ్యాపారం చేసినట్లు కోర్టు ప్రస్తావించింది.

Singapore: కాఫీ, మిల్క్ షేక్ అమ్మడం కూడా నేరమే.. అలా చేసినందుకు జైలుపాలైన ఓ వ్యక్తి

Singaporean jailed for selling strawberry milk, coffee to North Korea

Singapore: గంజాయి, కొకైన్ లాంటివి అమ్మితే జైల్లో వేస్తారు. కానీ కాఫీ, మిల్క్ షేక్ అమ్మినా కూడా జైల్లో వేస్తారా అనే అనుమానం మీకు కలిగి ఉండవచ్చు. మామూలుగా అయితే ఇది నేరం కాదు కానీ, ఆంక్షలు ఉన్న దేశాలకు అమ్మితే నేరం కిందకే వస్తుంది. ఈ తప్పే చేశాడు సింగపూర్‭కు చెందిన ఒక వ్యాపారి. ఉత్తర కొరియాకు సుమారు 8 కోట్ల రూపాయల కాఫీ, మిల్క్ షేక్ విక్రయించాడట. ఉత్తర కొరియాపై సింగపూర్ కొన్ని ఆంక్షలు విధించింది. ఆ జాబితాలో డ్రింక్స్‭కు సంబంధించిన నిషేధాలు కూడా ఉన్నాయి. అందుకే సదరు వ్యక్తిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు.

Uttar Pradesh: తండ్రితో కలిసి భార్యను చంపిన డాక్టర్.. 400 కిలోమీటర్ల దూరంలో రహస్యంగా అంత్యక్రియలు

ఐక్యరాజ్య సమితి నిబంధనలకు విరుద్ధంగా న్యూక్లియర్, బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగాలు చేసింది ఉత్తర కొరియా. దీంతో ఆ దేశంతో 2017లో సింగపూర్ వ్యాపార సంబంధాల్ని తెంచుకుంది. ఇకపోతే, 2017 అనంతరం షే హీ (58) అనే వ్యాపారి మాత్రం ఉత్తర కొరియాతో వ్యాపార సంబంధాలను కొనసాగించారు. బేవరేజెస్ వ్యాపారంలో ఉన్న ఆయన.. ఉత్తర కొరియాకు 8 కోట్ల రూపాయల కాఫీ, మిల్క్ షేక్ పదార్థాలను విక్రయించినట్లు సింగపూర్ ప్రభుత్వం గుర్తించింది. నిషేధం ఉన్న దేశంతో ఇంత పెద్ద మొత్తంలో వ్యాపారం చేయడంతో అతడిని అరెస్ట్ చేసి జైలులో వేశారు.

CM Nitish Kumar: బీహార్ సీఎం నితీష్ కుమార్ ఉగ్రరూపం.. సభలో బీజేపీ నేతలపై మండిపడ్డ సీఎం ..

అయితే షే హీ అమ్మకాల నుంచి ఎటువంటి కమీషన్ పొందనప్పటికీ, అతని నెలవారీ అమ్మకాల లక్ష్యాలను చేరుకోవడానికి మాత్రం ఉత్తర కొరియాతో రహస్య ఒప్పందం చేసుకున్నాడని కోర్టు పత్రాలు వెల్లడించాయి. సింగపూర్‌లోని ఉత్తర కొరియా రాయబార కార్యాలయంలో అంబాసిడర్‌గా పనిచేస్తున్న మిస్టర్ కిమ్‌ను హీ కలిశాడు. అనంతరం 2014లో రాయబార కార్యాలయంలోని మరొక ఉద్యోగికి పరిచయం అయ్యాడు. ఆ పరిచయాల నుంచే ఈ వ్యాపారం చేసినట్లు కోర్టు ప్రస్తావించింది.

PMGSY: ప్రధాన మంత్రి సడక్ యోజన కింద పడకేసిన 4,000 ప్రాజెక్టులు

ఉత్తర కొరియాకు నిషేధిత వస్తువులను సరఫరా చేసినందుకు ఇప్పటికే అనేక మంది వ్యక్తులు, సంస్థలపై అనేక కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ప్రారంభంలో రెండు సింగపూర్ కంపెనీలు ఉత్తర కొరియాకు విస్కీ, వైన్ ఇతర పానీయాలను ఎగుమతి చేశాయని ఈ ఏడాది ప్రారంభంలో అభియోగాలు వచ్చాయి. వాటిపై కేసులు కూడా నమోదు అయ్యాయి. సింగపూర్ నుంచి ఉత్తర కొరియాకు వస్తువులను ఎగుమతి చేసినందుకు గరిష్టంగా 100,000 సింగపూర్ డాలర్లు జరిమానా లేదా ఎగుమతి చేసిన వస్తువుల విలువకు మూడు రెట్లు జరిమానాతో పాటు రెండు సంవత్సరాల జైలు శిక్ష లేదంటే రెండూ విధిస్తారు.