CM Nitish Kumar: బీహార్ సీఎం నితీష్ కుమార్ ఉగ్రరూపం.. సభలో బీజేపీ నేతలపై మండిపడ్డ సీఎం ..
అసెంబ్లీ సమావేశాల్లో సీఎం నితీష్ కుమార్ ఒక్కసారిగా లేచి ఆగ్రహంతో ఊగిపోయారు. బీజేపీ సభ్యులు అబద్దాలు చెబుతున్నారు. డ్రామాలు ఆడుతున్నారు అంటూ మండిపడ్డాడు. ఈరోజు ప్రతిపక్ష బీజేపీ సభ్యులు తాగి ఉన్నారు అని సభలో గట్టిగా నితీష్ ఆవేశంగా అరిచారు.

Nisteesh Kumar
CM Nitish Kumar: బీహార్ సీఎం నితీష్ కుమార్ ఉగ్రరూపందాల్చాడు. కోపంతో ఊగిపోయాడు. అసెంబ్లీ వేదికగా బీజేపీ సభ్యులపై తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. బీహార్‌లో శాసనసభ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. ఛప్రాలో కల్తీ మద్యం తాగి ఏడుగురు చనిపోయారు. పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సమావేశాల్లో రెండోరోజు బుధవారం సభలో బీజేపీ సభ్యులు ఈ అంశాన్ని లేవనెత్తారు. అధికార పార్టీని ఈ ఘటనపై సమాధానం చెప్పాలని నిలదీశారు. అధికార పార్టీ నిర్లక్ష్యం వల్లనే ఏడుగురు మరణించారని అసెంబ్లీలో ప్రశ్నించారు. మద్యపాన నిషేధం ఏమైందంటూ సభలో నితీష్‌ను బీజేపీ సభ్యులు నిలదీశారు.
సభలో ఉన్న సీఎం నితీష్ కుమార్ ఒక్కసారిగా లేచి ఆగ్రహంతో ఊగిపోయాడు. బీజేపీ సభ్యులు అబద్దాలు చెబుతున్నారు. డ్రామాలు ఆడుతున్నారు అంటూ మండిపడ్డాడు. ఈరోజు ప్రతిపక్ష బీజేపీ సభ్యులు తాగి ఉన్నారు అని సభలో గట్టిగా నితీష్ ఆవేశంగా అరిచారు. దీంతో సభలో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. మద్య నిషేధానికి అందరూ అనుకూలంగా ఉన్నారు. ఇప్పుడేమైంది. మీరు కల్తీ మద్యం గురించి మాట్లాడుతున్నారు? అంటూ ఆగ్రహంతో నితీష్ ఊగిపోయారు.
नीतीश कुमार को देखिए…. छपरा में जहरीली शराब से हुई मौत को लेकर बीजेपी वालों के सवाल का शांति से सदन में जवाब दे रहे हैं. pic.twitter.com/6AQa00kvR5
— Ajeet Kumar (@iajeetkumar) December 14, 2022
సభలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో స్పీకర్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు. తిరిగి సమావేశమైన తర్వాత కూడా సభలో గందరగోళం కొనసాగింది. అయితే.. నితీష్ సభలో సహనం కోల్పోవడం ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాది మార్చిలోనూ నితీష్ కుమార్ అలాగే అప్పటి స్పీకర్ విజయ్ సిన్హాపై విరుచుకుపడ్డారు. సభను రాజ్యాంగం ప్రకారం నడపాలని కోరారు.