World Most Powerful Passport : ప్రపంచంలోనే మోస్ట్ పవర్ ఫుల్ పాస్‌పోర్టు ఇదే .. వీసా లేకుండా 193 దేశాల్లో పర్యటించొచ్చు

ప్రపంచంలోనే మోస్ట్ పవర్ ఫుల్ పాస్‌పోర్టు ఇది. ఈ పాస్‌పోర్టు ఉంటే వీసా లేకుండా 193 దేశాల్లో పర్యటించొచ్చు.

World Most Powerful Passport : ప్రపంచంలోనే మోస్ట్ పవర్ ఫుల్ పాస్‌పోర్టు ఇదే .. వీసా లేకుండా 193 దేశాల్లో పర్యటించొచ్చు

Singapore’s passport world Most powerful

Singapore’s passport world Most powerful : పాస్‌పోర్ట్ (passport)అంటే మీరు ఫలానా దేశానికి చెందిన పౌరులు అనే గుర్తింపు. మరి వీసా అంటే..? వీసా అంటే వీసా అనేది ఒక విదేశీ పౌరుడికి ఆ దేశం మంజూరు చేసిన షరతులతో కూడిన అనుమతిపత్రం. ఆ దేశానికి వెళ్లటానికి..అక్కడ ఉండటానికి (షరతులు వర్తిస్తాయి) ఇచ్చే అనుమతి. అలా మీరు ఏదేనికైనా వెళ్లాలంటే ఆదేశపు వీసా కంపల్సరి అనే విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే పాస్‌పోర్ట్ అలాంటిలాంటిది కాదు. ప్రపంచంలోనే మోస్ట్ పవర్ ఫుల్ పాస్‌పోర్ట్( most powerful passport). అంటే ఈ పాస్‌పోర్ట్ ఉంటే వీసాతో పనిలేకుండా ఒకటీ రెండు కాదు ఏకంగా 193దేశాల్ని చుట్టేయొచ్చు. ఇంతకీ ఆ పాస్‌పోర్ట్ (passport)ఏదేశానిది..? ఎందుకంత పవర్ ఫుల్ అంటారా..ఆ వివరాలేంటే చూసేద్దాం..

వీసా (Visa)అంటే ఒక దేశం నుంచి మరో దేశంలోకి అడుగుపెట్టాలంటే ఈ అనుమతి పత్రం తప్పనిసరి అనే విషయం చాలామందికి తెలిసిందే. కానీ కొన్ని దేశాలకు చెందిన పాస్‌పోర్టులు చాలా పవర్ ఫుల్ గా ఉంటారు. ఆ పాస్‌పోర్ట్ (passport)వచ్చిందంటే వీసా (Visa)లేకుండా పలు దేశాలు చుట్టిరవచ్చు. అటువంటి పవర్ ఫుల్ పాప్‌పోర్టుకు కు చెందిన వివరాలను హెన్లీ పాస్ పోర్టు ఇండెక్స్ (Henley Passport Index)సంస్థ వెల్లడించింది.

Elisabeath Guinness Record : 1600 లీటర్ల చనుబాలు దానం చేసిన అమ్మ, వేలాది చంటిబిడ్డల కడుపు నింపిన మాతృమూర్తికి దక్కిన గిన్నిస్ అవార్డ్

2023 కోసం గ్లోబల్ పాస్ట్ పోర్టు ర్యాకింగ్ ఇంటర్నేషనల్ ఎయిర ట్రాన్స్ పోర్టు అథారిటీ (International Air Transport Authority(IATA) అందించిన డేటా ఆధారంగా..ప్రపంచ శక్తిమంతమైన పాస్ పోర్టుల జాబితా వెల్లడించిన లిస్టులో ‘సింగపూర్’ (Singapore’s passport) అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచంలో 227 దేశాలు ఉండగా, ఒక్క సింగపూర్ పాస్‌పోర్ట్ తో 193 దేశాల్లో వీసా లేకుండానే (190 global destinations)పర్యటించవచ్చట.

గత ఐదేళ్లుగా శక్తిమంతమైన పాస్ పోర్టుల జాబితాలో జపాన్ ( Japan )నెంబర్ వన్ గా కొనసాగింది. అయితే 2023లో ఆ స్థానాన్ని సింగపూర్ ఆక్రమించింది. హెన్లీ పాస్ పోర్టు ఇండెక్స్ లో జపాన్ మూడో స్థానానికి పడిపోయింది..

పవర్ ఫుల్ పాస్ పోర్టుల్లో సింగపూర్ మొదటిస్థానంలో ఉండగా రెండో స్థానంలో జర్మనీ(Germany), ఇటలీ(Italy), స్పెయిన్ (Spain)దేశాలు నిలిచాయి. ఈ యూరప్ దేశాల పాస్ పోర్టు ఉంటే 190 దేశాల్లో తిరగొచ్చు వీసా లేకుండా..జపాన్ (Japan) తో పాటు దక్షిణ కొరియా(South Korea), ఫిన్లాండ్(Finland), ఆస్ట్రియా(Austria), ఫ్రాన్స్(France), లక్జెంబర్గ్(Luxembourg), స్వీడన్(Sweden) దేశాలు కూడా పవర్ ఫుల్ పాస్ పోర్టులు కలిగిన దేశాలు మూడో స్థానంలో ఉన్నాయి. ఈ లిస్టులో గ్రేట్ బ్రిటన్ (Britain)నాలుగో స్థానంలో ఉంది.