Singer Lee Jihan Dies : తొక్కిసలాటలో యంగ్ పాప్ సింగ‌ర్ మృతి.. తీవ్ర విషాదం నింపిన హాలోవీన్ వేడుకలు

దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో హాలోవీన్‌ వేడుకల్లో తొక్కిసలాట కారణంగా 154 మంది మరణించారు. ఈ ఘటనలో దక్షిణ కొరియా యువ గాయకుడు, నటుడు లిజిహాన్ ‌కూడా మృతి చెందాడు.

Singer Lee Jihan Dies : తొక్కిసలాటలో యంగ్ పాప్ సింగ‌ర్ మృతి.. తీవ్ర విషాదం నింపిన హాలోవీన్ వేడుకలు

Singer Lee Jihan Dies : దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో హాలోవీన్‌ వేడుకలు పెను విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలో తొక్కిసలాట కారణంగా 154 మంది మరణించారు. వందమందికిపైగా గాయపడ్డారు. కాగా, ఈ ఘటనలో దక్షిణ కొరియా యువ గాయకుడు, నటుడు లిజిహాన్ ‌(Lee Ji-han-24) కూడా మృతి చెందాడు.

అక్టోబర్‌ 29న సియోల్‌లో జరిగిన హాలోవీన్‌ వేడుకల్లో జరిగిన తొక్కిసలాటలో ఈ యంగ్‌ పాప్‌ సింగర్‌ మరణించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ వార్త‌ను లీ జిహాన్ పనిని నిర్వహించే ఏజెన్సీ 935 ఎంటర్‌టైన్‌మెంట్ ధృవీకరించింది. కాగా, జిహాన్ వ‌య‌సు 24 సంవ‌త్స‌రాలే. లిజిహాన్ మృతి దక్షిణ కొరియా సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నింపింది. లీ జీ హాన్‌ మృతిపై కొరియాకు చెందిన పలువురు నటీనటులు సోషల్‌ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

రాజధాని నగరం సియోల్‌లో రద్దీగా ఉండే నైట్ లైఫ్ జిల్లా ఇటావాన్‌లో శనివారం (అక్టోబర్‌ 29న) హాలోవీన్‌ వేడుకులను నిర్వహించారు. ఈ వేడుకకు భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈ క్రమంలో అక్కడి ఇరుకైన వీధుల్లోంచి జనం ఒక్కసారిగా పోటెత్తడంతో తొక్కిసలాట సంభవించింది. ఈ ఘటనలో ఊపిరాడక 154 మంది మరణించారు.