Chinese Rocket: చైనా రాకెట్ కూలుతుందన్న భయం.. స్పెయిన్‌లో ఎయిర్‌పోర్టుల మూసివేత

చైనా రాకెట్ శకలాలు కూలిపోతాయనే భయంతో స్పెయిన్ అప్రమత్తమైంది. తమ దేశ గగనతలంలోని విమానాల్ని రద్దు చేసింది. ఎయిర్‌పోర్టుల్ని మూసివేసింది. రాకెట్ శకలాలు తమ గగనతలంలోకి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో స్పెయిన్ ఈ నిర్ణయం తీసుకుంది.

Chinese Rocket: చైనా రాకెట్ కూలుతుందన్న భయం.. స్పెయిన్‌లో ఎయిర్‌పోర్టుల మూసివేత

Chinese Rocket: చైనా రాకెట్ ఒకటి అంతరిక్షంలో అదుపుతప్పి నేలపై కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. ‘లాంగ్ మార్చ్ 5బి (సీజడ్-5బి)’ అనే రాకెట్ అంతరిక్షంలో అదుపుతప్పింది. 20 టన్నుల బరువున్న ఈ రాకెట్ పేలి, దీని శకలాలు నేల మీద పడే అవకాశం ఉంది.

Karnataka: గర్భిణిని ఆస్పత్రిలో చేర్చుకోని సిబ్బంది.. ఇంట్లోనే ప్రసవించి ప్రాణాలు వదిలిన మహిళ.. అప్పుడే పుట్టిన కవలలూ మృతి

అయితే, కచ్చితంగా ఎక్కడ పడుతాయి అనే విషయంలో స్పష్టత లేదు. అయితే, స్పెయిన్ గగనతలంలోకి దూసుకొచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో స్పెయిన్ అప్రమత్తమైంది. తమ గగనతలంలోకి ప్రవేశించే విమానాల రాకపోకల్ని నిషేధించింది. అలాగే ఎయిర్‌పోర్టుల్ని మూసివేసింది. ఈ నిర్ణయానికి సంబంధించిన సమాచారాన్ని అధికారులు ప్రయాణికులకు తెలియజేశారు. అయితే, కొన్నిచోట్ల మాత్రం సమాచారం లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. స్పెయిన్ గగనతలం నుంచి రాకెట్ శకలాలు దూసుకెళ్లే అవకాశం ఉండటంతో, విమానాలకు ప్రమాదమని భావించి స్పెయిన్ ఈ నిర్ణయం తీసుకుంది. తాజా అంచనా ప్రకారం.. శనివారం ఉదయం రాకెట్ శకలాలు దూసుకొచ్చే అవకాశం ఉంది. అయితే, అంతకు చాలా ముందుగానే అధికారులు విమానాల్ని రద్దు చేసి, ఎయిర్‌పోర్టుల్ని మూసివేశారు.

Kerala: ఎంత అహంకారం.. కారుకు ఒరిగినందుకు బాలుడిని తన్నిన యజమాని.. వీడియో వైరల్

మరికొన్ని విమానాల్ని దారి మళ్లించారు. స్పెయిన్ మొత్తం ఇదే పరిస్థితి కొనసాగుతోంది. చైనా రాకెట్‌ను 2020 మేలో ప్రయోగించారు. గత నెల 30న ఈ రాకెట్ పేలిపోయింది. దీంతో ఈ రాకెట్ శకలాలు భూమి మీదకు దూసుకొస్తున్నాయి. అయితే, ఈ శకలాల్లో చాలా వరకు గాలిలోనే మండిపోయే అవకాశం ఉంది.