Karnataka: గర్భిణిని ఆస్పత్రిలో చేర్చుకోని సిబ్బంది.. ఇంట్లోనే ప్రసవించి ప్రాణాలు వదిలిన మహిళ.. అప్పుడే పుట్టిన కవలలూ మృతి

పురిటి నొప్పులతో వచ్చిన గర్భిణిని ఆస్పత్రిలో చేర్చుకోకుండా తిరిగి పంపించారు ప్రభుత్వాసుపత్రి వైద్యులు. దీంతో గర్భిణి ఇంట్లోనే కవలలకు జన్మనిచ్చింది. అయితే, అధిక రక్తస్రావం కావడంతో అక్కడే మరణించింది. కాస్సేపటికి కవలలు కూడా ప్రాణాలు కోల్పోయారు.

Karnataka: గర్భిణిని ఆస్పత్రిలో చేర్చుకోని సిబ్బంది.. ఇంట్లోనే ప్రసవించి ప్రాణాలు వదిలిన మహిళ.. అప్పుడే పుట్టిన కవలలూ మృతి

Karnataka: కర్ణాటకలో దారుణం జరిగింది. కుటుంబ సభ్యులు ఎవరూ లేని గర్భిణి విషయంలో అమానవీయంగా వ్యవహరించారు వైద్య సిబ్బంది. వైద్యుల నిర్లక్ష్యంతో నిండు బాలింత, అప్పుడే జన్మించిన కవలలు మరణించారు. ఈ ఘటన కర్ణాటక, తుముకూరు జిల్లాలో జరిగింది.

Unstoppable : బట్టలిప్పుతూ డ్యాన్స్ చేసిన శర్వానంద్, అడివి శేష్.. జత కలిసిన బాలయ్య.. రచ్చ రచ్చ చేశారుగా..

తొమ్మిది నెలల గర్భిణి అయిన కస్తూరి అనే మహిళ తుముకూరు జిల్లాలోని, భారతీ నగర్ పరిధిలో ఒక అద్దె ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. అప్పటికే ఆమెకు ఒక కూతురు కూడా ఉంది. మరోసారి ఆమె గర్భం దాల్చింది. అయితే, కస్తూరి గర్భిణి అయినప్పటికీ తనను చూసుకోవడానికి ఇంట్లో ఎవరూ లేరు. ఈ క్రమంలో గత బుధవారం ఆమెకు పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. ఆమె ఇంట్లో సాయం చేసేందుకు ఎవరూ లేకపోవడంతో స్థానికులంతా కలిసి కొంత డబ్బు సేకరించారు. వాళ్లంతా కలిసి దగ్గర్లోని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమెకు ఆధార్ కార్డు, ఆస్పత్రి రిజిస్ట్రేషన్ కార్డు వంటివి లేకపోవడంతో ఆస్పత్రిలో చేర్చుకునేందుకు నిరాకరించారు. అంతగా కావాలంటే బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో చేసేదేం లేక ఆమెను స్థానికులు ఇంటికే తీసుకొచ్చారు.

Prakash Raj: తెలంగాణాలో ఎమ్మెల్యే ల కొనుగోలు పై ప్రకాష్ రాజ్ సంచలన ట్విట్..

ఈ క్రమంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో తిరిగి పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. అప్పుడే ఒక పాపకు జన్మనిచ్చింది. తర్వాత మరో పాపకు జన్మనిచ్చింది. ఈ సమయంలో ఎలాంటి వైద్య సదుపాయం లేకపోవడంతో తీవ్ర రక్తస్రావమైంది. ఒంట్లోని రక్తం కోల్పోవడంతో కస్తూరి అక్కడికక్కడే మరణించింది. తర్వాత కొద్దిసేపటికి అప్పుడే పుట్టిన కవలలు కూడా ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురూ ఆమె ఇంట్లోనే ప్రాణాలు వదిలారు. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కస్తూరిని ఆస్పత్రిలో చేర్చుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన కర్ణాటక ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు వైద్య సిబ్బందిని సస్పెండ్ చేసింది.