Spider-Man : వరల్డ్ వైడ్ కలెక్షన్లతో బిలియన్ డాలర్లు క్రాస్.. 2021 ఫస్ట్ పాండమిక్ మూవీ ఇదే!

హాలీవుడ్ మూవీల్లో స్పైడర్ మ్యాన్.. ఈ మూవీకి ఉండే క్రేజే వేరు.. పిల్లలకు అత్యంత ఇష్టమైన మూవీల్లో ఇదొకటి. రిలీజ్ అయితే చాలు.. బాక్సాఫీసుల దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించాల్సిందే..

Spider-Man : వరల్డ్ వైడ్ కలెక్షన్లతో బిలియన్ డాలర్లు క్రాస్.. 2021 ఫస్ట్ పాండమిక్ మూవీ ఇదే!

Spider Man No Way Home Becomes First Pandemic Era Film To Top 1bn

Spider-Man No Way Home : హాలీవుడ్ మూవీల్లో స్పైడర్ మ్యాన్.. ఈ మూవీకి ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు.. పిల్లలకు అత్యంత ఇష్టమైన మూవీల్లో ఇదొకటిగా చెప్పవచ్చు. రిలీజ్ అయితే చాలు.. బాక్సాఫీసుల దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించాల్సిందే.. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 16న రిలీజ్ అయిన Spider-Man No Way Home మూవీ సూపర్ హిట్ టాక్ అందుకుంది. అంతేకాదు.. వరల్డ్ వైడ్ బిలియన్ డాలర్లతో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. 2021 ఏడాదిలో వందల కోట్ల డాలర్లు దాటేసిన మొదటి పాండమిక్ మూవీ (Spider-Man: No Way Home)గా టాప్ ప్లేసులో నిలిచింది.

జాన్ వాట్స్ తెరకెక్కించిన ఈ సినిమాను Disney’s Marvel Studios and Sony ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా ఇండియా తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ భాషల్లో రిలీజ్ చేసింది. 2012లో అత్యధిక కలెక్షన్లు కొలగొట్టిన మూవీగా టైటిల్ దక్కించుకుంది. చైనా నిర్మించిన కొరియన్ వార్ ఎపిక్ నేపథ్యంలో వచ్చిన The Battle of Lake Changjin మూవీ రికార్డులను కూడా స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ దాటేసింది. వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ 905 మిలియన్ల డాలర్లకు పైగా వసూలు చేసింది. ఇప్పుడు ఈ మూవీ రికార్డులను కూడా బ్రేక్ చేసిన స్పైడర్ మ్యాన్ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ మూవీలో బెనెడిక్ట్ కుంబర్‌బ్యాచ్, జెండయ, జాన్ ఫెవర్యూ, జాకబ్ బటలన్, మరిస టొమి, జె. బీ స్మూవీ, బెనెడిక్ట్ వాంగ్, ఆల్ఫ్రాడ్ మోలిన, జామీ ఫాక్స్, విల్లెమ్ డఫో, రాయిస్ ఇఫాన్స్ థామస్ హడెన్ చర్చ్ లీడ్ రోల్స్ చేశారు.

కామ్‌స్కోర్ ప్రకారం… 2019లో వచ్చిన ఆఫర్ స్పైడర్ మ్యాన్: ఫార్ ఫ్రమ్ హోమ్ (Spider-Man: Far From Home) బాక్స్ ఆఫీస్ దగ్గర 1 బిలియన్ డాలర్ల మార్కును దాటేసిన మొదటి స్పైడర్ మ్యాన్ మూవీగా రికార్డు క్రియేట్ చేసింది. ప్రస్తుతం గ్లోబల్ టిక్కెట్ అమ్మకాలలో 1.132 బిలియన్ డాలర్ల ఫ్రాంచైజీలో అత్యధిక వసూళ్లు చేసిన మూవీగా నిలిచింది. ఇప్పుడు వచ్చిన స్పైడర్ మ్యాన్ నో వే హోమ్.. ఫార్ ఫ్రమ్ హోమ్‌ తర్వాతి స్థానంలో నిలిచింది. 2015లో, డిస్నీ, మార్వెల్ స్టూడియోస్, సోనీ స్పైడర్ మ్యాన్ మూవీ రైట్స్ దక్కించుకున్నాయి. కరోనా దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా సినీ ఇండస్ట్రీ కుదేలైంది.

గత రెండేళ్లుగా సినిమాలపై కరోనా తీవ్ర ప్రభావం పడటంతో ఆర్థికంగా నష్టపోయింది. కరోనా తగ్గుముఖం పట్టడంతో సినిమా ఇండస్ట్రీ నెమ్మదిగా కోలుకుంటోంది. సినీ పరిశ్రమ నుంచి మూవీలు విడుదల కావడంతో గాడిలో పడుతోంది. నో వే హోమ్‌ (No Way Home)మూవీకి ముందు, MGM లేటెస్ట్ జేమ్స్ బాండ్ మూవీ నో టైమ్ టు డై, ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ వద్ద 774 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. 2021, మహమ్మారి రెండింటిలోనూ అత్యధిక వసూళ్లు చేసిన హాలీవుడ్ చిత్రంగా రికార్డులు తిరగరాసింది.

Read Also : Covid Booster Dose : కోవిడ్ బూస్టర్ డోసుకు మీరు అర్హులేనా? ఇలా తెలుసుకోండి..!