sri lanka crisis: ద‌యచేసి నా మాట వినండి: ‘హింస’ వేళ శ్రీ‌లంక ఆర్మీ చీఫ్ విజ్ఞ‌ప్తి

ఆర్థిక, రాజ‌కీయ సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీ‌లంక‌లో హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు చోటుచేసుకుంటోన్న వేళ ప్ర‌జ‌ల‌కు ఆ దేశ ఆర్మీ చీఫ్ ష‌వేంద్ర సిల్వా ప‌లు సూచ‌న‌లు చేశారు. రాజ‌కీయ సంక్షోభాన్ని శాంతియుతంగా ప‌రిష్క‌రించుకునే అవ‌కాశం ప్ర‌స్తుతం ఉంద‌ని చెప్పారు.

sri lanka crisis: ద‌యచేసి నా మాట వినండి: ‘హింస’ వేళ శ్రీ‌లంక ఆర్మీ చీఫ్ విజ్ఞ‌ప్తి

Srilanka Army Chief

sri lanka: ఆర్థిక, రాజ‌కీయ సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీ‌లంక‌లో హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు చోటుచేసుకుంటోన్న వేళ ప్ర‌జ‌ల‌కు ఆ దేశ ఆర్మీ చీఫ్ ష‌వేంద్ర సిల్వా ప‌లు సూచ‌న‌లు చేశారు. రాజ‌కీయ సంక్షోభాన్ని శాంతియుతంగా ప‌రిష్క‌రించుకునే అవ‌కాశం ప్ర‌స్తుతం ఉంద‌ని చెప్పారు. శాంతి, భ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ కోసం ప్ర‌జ‌లు దేశ ప్ర‌జ‌లు స‌హ‌క‌రించాల‌ని ఆయ‌న కోరారు. శ్రీలంక‌లో నెల‌కొన్న సంక్షోభానికి బాధ్య‌త‌వ‌హిస్తూ అధ్య‌క్షుడు గోట‌బాయ రాజ‌ప‌క్స రాజీనామా చేయాలంటూ ఆయ‌న నివాసం వ‌ద్ద నిన్న ఆందోళ‌న‌కారులు విధ్వంసానికి పాల్ప‌డ్డ విష‌యం తెలిసిందే.

Gardening: తోట‌పని చేస్తే మాన‌సిక ఆరోగ్యం

దీంతో ఆయ‌న ఈ నెల 13న రాజీనామా చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. అలాగే, ప్ర‌ధాని ప‌ద‌వికి విక్ర‌మ‌సింఘే రాజీన‌మా చేస్తున్న‌ట్లు తెలిపారు. అయిన‌ప్ప‌టికీ నిన్న విక్ర‌మ సింఘే ఇంటికి నిప్పంటించారు. దీంతో ఇవాళ శ్రీ‌లంక ఆర్మీ చీఫ్ ఓ ప్ర‌క‌ట‌న చేశారు. శాంతి కోసం కృషి చేస్తోన్న‌ ఆర్మీ, పోలీసుల‌కు ప్ర‌జ‌లు స‌హ‌క‌రించాల‌ని ఆయ‌న కోరారు. కాగా, శ్రీ‌లంకలో నెల‌కొన్న ఆర్థిక‌ సంక్షోభంతో ప్ర‌జ‌లు ఎన్నో ఇబ్బందులు ప‌డుతున్నారు. పెట్రోలు, డీజిల్ దొరక‌డం కూడా గ‌గ‌న‌మైపోయింది. విద్యుత్ కోత‌లు వేధిస్తున్నాయి.