Srilanka: “వీసా ఆన్ ఎరైవల్”ను పునఃప్రారంభించిన శ్రీలంక, పాకిస్తాన్ కి మాత్రం లేదు

రెండేళ్లుగా వీసా ఆన్ ఎరైవల్ లేకపోవడంతో పెద్దగా పర్యాటకులు వచ్చింది లేదు. దీంతో దేశంలో పర్యాటక రంగాన్ని ఆదుకునేందుకు వీసా ఆన్ ఎరైవల్ పునరుద్ధరించింది శ్రీలంక.

Srilanka: “వీసా ఆన్ ఎరైవల్”ను పునఃప్రారంభించిన శ్రీలంక, పాకిస్తాన్ కి మాత్రం లేదు

Srilanka

Srilanka Tourism: కరోనాతో కుదేలైన రంగాల్లో పర్యాటకం ఒకటి. ప్రపంచమంతా లాక్ డౌన్ గుప్పెట్లో చిక్కుకున్న సమయంలో.. అత్యధికంగా పర్యాటక పరిశ్రమ నష్టపోయింది. ఇప్పుడిప్పుడే కరోనా మహమ్మారి కరుణించడంతో తిరిగి దేశాల సరిహద్దులు తెరుచుకుంటున్నాయి. కరోనా ధాటికి శ్రీలంక దేశంలో పర్యాటకం కుదేలైంది. మహహ్మరి కట్టడి నేపథ్యంలో అంతర్జాతీయ పర్యాటకులను అనుమతించలేదు ఆ దేశం. పర్యాటక వీసాలను కూడా నిలిపివేసింది. అయితే ఇటీవల శ్రీలంకలో కాస్త పరిస్థితులు మెరుగుపడడంతో పర్యాటకులకు అనుమతి ఇస్తుంది ప్రభుత్వం. కానీ..పర్యాటకంపైనే ఆధారపడి ఉన్న శ్రీలంకను చేరుకోవాలంటే.. వాయుమార్గం, సముద్ర మార్గాలు తప్పా మరోదారి లేదు.

Also read: IPL Auction: చిన్న ప్లేయర్లపై అన్ని కోట్లు కుమ్మరించాల్సిన అవసరం లేదు: గవాస్కర్

గత రెండేళ్లుగా వాయుమార్గాన వచ్చే పర్యాటకుల కోసం వీసా ఆన్ ఎరైవల్ లేకపోవడంతో పెద్దగా పర్యాటకులు వచ్చింది లేదు. దీంతో దేశంలో పర్యాటక రంగాన్ని ఆదుకునేందుకు వీసా ఆన్ ఎరైవల్ పునరుద్ధరించింది శ్రీలంక. అయితే భారత్ సహా కొన్ని దేశాలకు మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని ఆదేశ పర్యాటకశాఖ మంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా భారత్, రష్యా, బ్రిటిష్ పర్యాటకులు అధికంగా శ్రీలంకకు వస్తుంటారు. దీంతో కొన్ని దేశాలకే ఈ వీసా ఆన్ ఎరైవల్ సౌకర్యాన్ని కల్పించింది శ్రీలంక ప్రభుత్వం. అయితే, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్, సిరియా, నైజీరియా, ఘనా, ఐవరీ కోస్ట్, కామెరూన్, మయన్మార్, నేపాల్ మరియు ఉత్తర కొరియా పాస్‌పోర్ట్ హోల్డర్లకు ఈ సౌకర్యం అందుబాటులో ఉండదని శ్రీలంక పర్యాటకశాఖ మంత్రి పేర్కొన్నారు.

Also read: Career Websites: ఉద్యోగాల కోసం ఈ టాప్ 10 వెబ్‌సైట్లను చూడండి