Career Websites: ఉద్యోగాల కోసం ఈ టాప్ 10 వెబ్‌సైట్లను చూడండి

మీ అర్హతలను పొందుపర్చుతూ ఆయా వెబ్ సైట్లలో వివరాలు నమోదు చేసుకున్నారంటే..ఉద్యోగాలు వెతుకుంటూ మీ దగ్గరకు వస్తాయి

Career Websites: ఉద్యోగాల కోసం ఈ టాప్ 10 వెబ్‌సైట్లను చూడండి

Top Webs

Career Websites: కరోనా మహమ్మారి మనుషుల జీవితాలను చిన్నాభిన్నం చేసింది. వ్యాపారాలు దెబ్బతిని వేలాది మంది ఉపాధి కోల్పోయారు. సరైన అర్హతలు ఉన్నా.. ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవడంలో కాస్త తడబడుతున్నారు ఉద్యోగార్థులు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పడుతుండడంతో.. తిరిగి కార్యాలయాలు తెరుచుకుని యధావిధిగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. అన్ని సమస్యలు సర్దుకుని కరోనా మునుపటి పరిస్థితులు త్వరలోనే రానున్నాయి. ఈక్రమంలో అనేక సంస్థలు ఉద్యోగుల కోసం ఎదురు చూస్తున్నాయి. సరైన అర్హతలు ఉండి.. ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టే వారికి..అనేక కెరీర్ సైట్లు(Websites) అందుబాటులో ఉన్నాయి. మీ అర్హతలను పొందుపర్చుతూ ఆయా వెబ్ సైట్లలో వివరాలు నమోదు చేసుకున్నారంటే..ఉద్యోగాలు వెతుకుంటూ మీ దగ్గరకు వస్తాయి. మరి టాప్ 10లో కెరీర్ వెబ్‌సైట్లు ఏంటో చూద్దామా.

Also read: Botsa Satyanarayana: ప్రత్యేక హోదా సాదించేంత వరకు తమ పోరాటం కొనసాగుతుంది
1. www.linkedin.com: ఈ లిస్ట్ లో మొదటగా చెప్పుకోవాల్సింది లింక్డ్ఇన్ వెబ్ సైట్ గురించి. సోషల్ ప్రొఫైల్స్ ను, కెరీర్ తో అనుసంధానం చేసిన ప్రొఫెషనల్ కెరీర్ నెట్వర్కింగ్ సైట్ ఇది. ఇతర జాబ్ పోర్టళ్ల కాకుండా..కేవలం ఉద్యోగి వివరాలు, గత అనుభవ వివరాలను నమోదు చేసుకోవడమే లింక్డ్ఇన్ ప్రత్యేకత. ఒకరకంగా చెప్పాలంటే.. వృత్తిపరమైన ఉద్యోగులను, ఆయా సంస్థలతో అనుసంధానం చేసే ప్రొఫెషనల్ వెబ్ సైట్ ఇది. మీ ఏదైనా ఈ-మెయిల్ తో “లింక్డ్ఇన్”లోకి లాగిన్ అవ్వొచ్చు. నేరుగా రెస్యూమేని అప్లోడ్ చేయడంగానీ, లేదా వివరాలు నమోదు చేయొచ్చు. మీకు సంబందించిన ఫీల్డ్ లోని ఇతర అభ్యర్ధులతోను కనెక్ట్ అవ్వొచ్చు.

2. www.Indeed.com: ప్రపంచంలో ఎక్కువ మంది వాడుతున్న జాబ్ పోర్టల్ “ఇండీడ్”. అటు సంస్థలను గానీ, ఇటు ఉద్యోగార్థులను గానీ..ఒక చోట చేర్చే ఇండీడ్ వెబ్ సైట్ కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఇందులో ఏదైనా ఈ-మెయిల్ అకౌంట్ తో లాగిన్ అయి.. నేరుగా రెస్యూమేను పోస్ట్ చేయడంగానీ, వివరాలు నమోదు చేయడం ద్వారా గాని మీ ప్రొఫైల్ ని తయారు చేసుకోవచ్చు. ఇండీడ్ లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే.. అభ్యర్థులకు నిర్దిష్టమైన మ్యాచింగ్ జాబ్ వెతికి, సంబంధిత సంస్థలకు చేరేలా చేస్తుంది. అవసరమైతే సంస్థ కాంటాక్ట్ నెంబర్, ఇమెయిల్ కూడా మనకు అందుబాటులో ఉంటాయి. పార్ట్ టైం, ఫుల్ టైం, శాలరీ వంటి ఒప్షన్స్ కూడా ఎంచుకోవచ్చు. మీ ప్రొఫైల్ బాగుంటే ఉద్యోగ సంస్థలే మీకు ఫోన్ చేస్తారు.

3. www.naukri.com: భారత్ సహా ఇతర ఔత్సహిక జాబ్ మార్కెట్లో పాతుకుపోయిన జాబ్ పోర్టల్ “నౌకరి”. భారత్ లో “నౌకరి” సైట్ గురించి తెలియని వారుండరు. ప్రొఫెషనల్స్ నుంచి ఫ్రెషర్స్ వరకు అందరూ నౌకరిలో జాబ్స్ వెతుకోవచ్చు. మిగతా వాటితో పోలిస్తే.. నౌకరిలో ప్రొఫైల్ తయారు చేసుకోవడం చాలా తేలిక. అంతేకాదు.. మీ చదువు, గత అనుభవ వివరాలు నమోదు చేసి ఫోన్ నెంబర్, ఇమెయిల్ ఐడి ఇచ్చారంటే.. ఉద్యోగ సంస్థలే కాల్ చేస్తుంటాయి. సరైన అర్హతలు ఉంటే నౌకరిలో ఎటువంటి జాబ్ అయినా ఇట్టేపెట్టేయొచ్చు. ముఖ్యంగా ఫ్రెషర్స్ కోసం నౌకరి ఎంతో ఉపయోగపడుతుంది.

Aslo read: Three Marriages : చిత్తూరులో నిత్యపెళ్లి కొడుకు.. గుట్టురట్టు చేసిన మూడో భార్య

4. www.monster.com: నౌకరి లాంటిదే “మోన్స్టర్” కూడా. అయితే మోన్స్టర్ ప్రపంచ వ్యాప్తంగా సేవలు అందిస్తుంది. అభ్యర్థులు ప్రాంతాన్ని, ఫీల్డ్ ఆఫ్ ఇంట్రస్ట్, జాబ్ స్కిల్ ని బట్టి ఇందులో జాబ్స్ వెతుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ ఉన్నవారితో పాటు ఫ్రెషర్స్ కూడా మోన్స్టర్ లో ప్రొఫైల్ తయారు చేసుకోవచ్చు. ఉచిత సర్వీస్ తో పాటు ప్రీమియం సర్వీస్ కూడా అందిస్తుంటుంది మోన్స్టర్. మిగతా వెబ్ సైట్లతో పోలిస్తే..మోన్స్టర్ లో “జెన్యూన్ జాబ్స్” ఉంటాయి. దీంతో అనుభవానికి సరితూగే ఉద్యోగం పొందడం చాలా సులభం. ఎప్పటికప్పుడు కొత్త జాబ్స్ అప్డేట్స్ ఈ వెబ్ సైట్లో వస్తుంటాయి.

5. www.careercloud.com: ఉద్యోగ వేట ఎలా మొదలు పెట్టాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఇంటర్వ్యూలకు తయారు కావడం ఎలా.. అనే అంశాలతో సతమతమయ్యే వారికి కెరీర్ క్లౌడ్ చక్కని దారి చూపిస్తుంది. ఇది జాబ్ పోర్టల్ అని చెప్పలేంగానీ.. అంతకుమించి సర్వీస్ లు ఇందులో ఉంటాయి. రెస్యూమే తయారు చేసుకోవడం ఎలా, మన రెస్యూమే ఎలా ఉంటే సంస్థలను ఆకట్టుకోవచ్చు, ఎలాంటి జాబ్స్ కి అప్లై చేసుకోవాలి, ఏ వెబ్ సైట్లలో సంబంధిత ఉద్యోగాలు ఉంటాయి అనే విషయాలపై పూర్తి అవగాహన కల్పిస్తుంది కెరీర్ క్లౌడ్. అంతే కాదు.. ఇంటర్వ్యూకి వెళ్లే ముందు అవసరమైన మోక్ టెస్టులు సైతం కెరీర్ క్లోడ్ లో అందుబాటులో ఉన్నాయి. ఇందులో రిజిస్టర్ చేసుకుంటే మిమ్మల్ని మీరు నిష్ణాతులుగా తీర్చిదిద్దుకోవచ్చు.

Also read: Aha OTT: తమిళంలో కూడా ఆహా.. గ్రాండ్‌గా లాంచింగ్!

6. www.bayt.com: ఇండియాతో పాటు దుబాయ్ వంటి అరబ్ దేశాల్లో ఉద్యోగాలు సాధించాలనే అభ్యర్థుల కోసం.. “బేట్” వెబ్ సైట్ ఉపయోగపడుతుంది. రాష్ట్రాల వారీగా, ప్రాంతాల వారీగా జాబ్స్ ఎన్ని ఉన్నాయనే విషయం “బేట్”లో ఇట్టే తెలుసుకోవచ్చు. మిగతా వాటితో పోలిస్తే.. ఈ వెబ్ సైట్ లో..ఉద్యోగార్ధుల కోసం సంస్థలే వచ్చి ఉద్యోగాలు ఆఫర్ చేస్తుంటాయి. నిర్మాణ రంగం కూలీలా నుంచి డెలివరీ ఉద్యోగాల వరకు, సాఫ్ట్ వేర్ జాబ్స్ నుంచి కార్ మెకానిక్ జాబ్ వరకు, డాక్టర్స్ నుంచి నర్సుల దాకా.. అందరు బేట్ లో ఉద్యోగాలు పొందవచ్చు. ముఖ్యంగా దుబాయ్ వంటి దేశాల్లో ఉద్యోగ సంస్థలే తమ కార్యాలయాల్లో ఉన్న ఖాళీల గురించి బేట్ వెబ్ సైట్లో ఉంచుతాయి. అయితే ఇది కేవలం అనుభవం ఉన్న అభ్యర్థులకు మాత్రమే పనికొస్తుంది.

7. Dice: అమెరికాకు చెందిన జాబ్ పోర్టల్ “డైస్”. కేవలం.. ఐటీ, టెక్నాలజీకి సంబంధించిన ఉద్యోగాలు మాత్రమే “డైస్”లో ఉంటాయి. మిగతా వాటితో పోలిస్తే.. ఇక్కడ జాబ్ వెతుకోవడం చాలా సులభం. ఒకరకంగా చెప్పాలంటే.. ఉద్యోగార్థులు, సంస్థల మధ్య.. మరొకరి ప్రమేయం లేకుండా నేరుగా జాబ్ వివరాలు పంచుకోవడానికి ఈ “డైస్” వెబ్ సైట్ వేదికగా నిలుస్తుంది. ప్రధానంగా ఐటీ ఉద్యోగాలనుద్దేశించి అభ్యర్థుల, సంస్థల వివరాలు ఒక చోట చేర్చడమే ఈ “డైస్” ప్రత్యేకత. ఈ వెబ్ సైట్లో భారత్ నుంచే అమెరికాలో ఉద్యోగ ఇంటర్వ్యూలు కూడా పొందే అవకాశం ఉంది. నేరుగా రెస్యూమే పోస్ట్ చేయొచ్చు లేదంటే ప్రొఫైల్ తయారు చేసుకోవచ్చు. ఉద్యోగానికి అవసరమైన కొత్త కోర్సులు కూడా ఇందులో నేర్చుకోవచ్చు.

Also read: Tirumala : శ్రీవారికి భక్తులకు గుడ్ న్యూస్.. ఈనెల 15 నుండి ఆఫ్ లైన్ లో సర్వదర్శనం టోకెన్లు

8. www.CareerBuilder.com: అమెరికా జాబ్ పోర్టల్ మార్కెట్ లో ఒకప్పుడు అగ్రస్థానంలో ఉన్న “కెరీర్ బిల్డర్” మధ్యలో కొంత వెనుకబడిపోయింది. పెరుగుతున్న టెక్ జాబ్స్ డిమాండ్ పుణ్యమాని మళ్లీ ఈ జాబ్ పోర్టల్ పుంజుకుంది. USA, కెనడా దేశాలు సహా.. యూరోప్, ఆసియా ఖండాల్లో కెరీర్ బిల్డర్ సేవలు అందిస్తుంది. భారత్ లోనూ చురుకుగా కెరీర్ బిల్డర్ కార్యకలాపాలు సాగుతున్నాయి. రాష్ట్రాలు, నగరాలూ, కేటగిరి వారీగా ఇందులో జాబ్స్ వెతుకోవచ్చు. అన్ని తరహా జాబ్స్ ఇందులో ఉంటాయి.

9. www.Jibberjobber.com: మిగతా జాబ్ పోర్టళ్లు, ప్రొఫెషనల్ నెట్వర్క్ లతో పోల్చితే.. కాస్త బిన్నంగా ఉంటుంది “జిబ్బర్‌జాబర్”. ఇందులో అకౌంట్ క్రియేట్ చేసుకుంటేనే లాగిన్ అవగలం. అదే సమయంలో విశ్వసనీయమైన ఉద్యోగాలు మాత్రమే అభ్యర్థులకు చేరేలా “జిబ్బర్‌జాబర్” సహాయపడుతుంది. ఒకేసారి వివిధ సంస్థల ఉద్యోగాలకు అప్లై చేసుకుని, అప్లికేషన్ స్టేటస్ ని ఎప్పటికప్పడు ట్రాక్ చేసుకునే సదుపాయం “జిబ్బర్‌జాబర్”లో ఉంది. అంతేకాదు.. ఒకే ఫీల్డ్ లో పనిచేసే ఇతర అభ్యర్థులను కలుసుకుని ఒకరికొకరు సలహాలు సూచనలు కూడా ఇచ్చిపుచ్చుకోవచ్చు.

Also read: Grapes : సేంద్రీయ పద్థితిలో ద్రాక్ష సాగుకు అనువైన నేలలు, వాతావరణం

10. www.glassdoor.com: ఈ లిస్టులో చివరగా చెప్పుకోవాల్సిన జాబ్ పోర్టల్ “గ్లాస్ డోర్”. ఒక సంస్థలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఎలాంటి అభ్యర్థులకు అవకాశాలు ఉన్నాయనే విషయాలతో పాటు.. ఆయా సంస్థల పుట్టుపూర్వోత్తరాలు, ఉద్యోగ వాతావరణం, ఉద్యోగుల సంతృప్తి, జీతభత్యాల వివరాలు వంటి విషయాలన్ని గ్లాస్ డోర్ లో తెలుసుకోవచ్చు. సంస్థల పనితీరును సూచిస్తూ.. ఆయా సంస్థల్లో పని చేసే ఉద్యోగులే రేటింగ్ కూడా ఇస్తారు. దీంతో ఆ సంస్థలో చేరాలా వద్దా అనే విషయాన్ని అభ్యర్థులు నిర్ణయించుకోవచ్చు. తమ సంస్థల్లో ఉద్యోగాలకు సంబంధించి సంస్థలే నేరుగా ఇందులో జాబ్స్ పోస్ట్ చేస్తుంటాయి. ఉద్యోగార్థులు ఒక్కసారి ప్రొఫైల్ తయారు చేసుకుంటే.. సంస్థలు నేరుగా కాంటాక్ట్ అవుతాయి. ప్రస్తుతం ప్రపంచంలోనే ఎక్కువ మంది అభ్యర్థులు ఫాలో అవుతున్న జాబ్ పోర్టళ్లలో గ్లాస్ డోర్ కూడా అగ్రస్థానంలో ఉంది.