Three Marriages : చిత్తూరులో నిత్యపెళ్లి కొడుకు.. గుట్టురట్టు చేసిన మూడో భార్య
చిత్తూరు జిల్లాలో నిత్య పెళ్లికొడుకు వ్యవహారం బయటపడిది. మూడో భార్య ఫిర్యాదుతో అతగాడి బాగోతం బట్టబయలైంది.

Three Marriages
Three Marriages: చిత్తూరు జిల్లాలో నిత్య పెళ్లికొడుకు వ్యవహారం బయటపడిది. మూడో భార్య ఫిర్యాదుతో అతగాడి బాగోతం బట్టబయలైంది. అతడి పేరు మంజునాథ్. పెద్దతిప్ప సముద్రం మండలం నవాబుకోటకు చెందిన మంజునాథ్ మొదట చిత్తూరు జిల్లా అంగళ్లు ప్రాంతానికి చెందిన రజని అనే మహిళను ఆరేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకి చెందిన ఆశను పెళ్లి చేసుకున్నాడు. వారికి ఓ కుమార్తె కూడా జన్మించింది.
Sleep : అతిగా నిద్రపోతున్నారా!…అయితే జాగ్రత్త?
ఆ తర్వాత దావణగెరెకు చెందిన ప్రియాంకను కూడా పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో వారికీ కుమార్తె కలిగింది. అయితే భర్త మంజునాథ్ ప్రవర్తనపై మూడో భార్య ప్రియాంకకు ఎందుకో డౌట్ వచ్చింది. దీంతో గట్టిగా మంజునాథ్‌ను నిలదీసింది. అంతే.. అసలు విషయం వెలుగు చూసింది. తాను మోసపోయాయనని తెలిసి ప్రియాంక షాక్ తింది.
Realme C35 Phone : రూ.13 వేలకే రియల్‌మీ కొత్త ఫోన్.. 50MP ట్రిపుల్ కెమెరా..!
మూడు పెళ్లిళ్ల విషయం రెండో భార్య ఆశకి కూడా తెలిసింది. తాను మోసపోయానని తెలిసి ఆమె కూడా షాక్ కి గురైంది. ఆ తర్వాత ఆశ బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మూడో భార్య ప్రియాంక పెద్దతిప్ప సముద్రం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. మూడు పెళ్లిళ్లు చేసుకున్న నిత్య పెళ్లికొడుకు మంజునాథ్ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు.