Botsa Satyanarayana: ప్రత్యేక హోదా సాదించేంత వరకు తమ పోరాటం కొనసాగుతుంది

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కేంద్రం ఇచ్చిన హామీ అని.. ప్రత్యేక హోదా సాధనకు వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

Botsa Satyanarayana: ప్రత్యేక హోదా సాదించేంత వరకు తమ పోరాటం కొనసాగుతుంది

Botsa

Botsa Satyanarayana: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కేంద్రం ఇచ్చిన హామీ అని.. ప్రత్యేక హోదా సాధనకు వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆదివారం విజయనగరంలో మంత్రి బొత్స మీడియాతో మాట్లాడారు. కేంద్రం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీలో ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని పక్కనబెట్టడంపై బొత్స స్పందిస్తూ..ప్రత్యేక హోదా సాదించేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. గతంలో సీఎం జగన్.. ప్రధానిని, ఇతర కేంద్ర మంత్రులను కలిసిన సమయంలోనూ, వైకాపా ఎంపీలు పార్లమెంట్ లోనూ ప్రత్యేక హోదాపై తమ గళం వినిపించారని బొత్స పేర్కొన్నారు.

Also read: Dinosaur : మధ్యప్రదేశ్ లో కోటి సంవత్సరాల కిందటి డైనోసార్ రాతి గుడ్లు

అయితే ప్రస్తుతం ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రం పక్కనబెట్టడంపై మంత్రి బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా సాదించేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేసారు. రాజధాని ఏర్పాటు అంశం రాష్ట్రాల ఇష్టమే అని కేంద్రం ప్రకటించిందని, ఆమేరకు ఏపీలో రాజధాని ఏర్పాటు పై మరోసారి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని మంత్రి బొత్స పేర్కొన్నారు.
సాంకేతిక కారణాల వలన మూడు రాజధానులు బిల్లు వెనక్కి తీసుకున్నామన్న మంత్రి బొత్స.. విస్తృతమైన అంశాలను పరిగణలోకి తీసుకుని మరోసారి బిల్లు పెడతామని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ ఇది వరకే అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించారని ఆ మేరకు మళ్లీ మూడు రాజధానులు ఏర్పాటు కోసం బిల్లు పెట్టి.. విశాఖను పరిపాలన రాజధానిగా చేసి తీరుతామని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

Also read: Raviteja : ‘ఖిలాడీ’ మూవీ ఆపాలంటూ కేసు వేసిన బాలీవుడ్ నిర్మాత