2 నెలలుగా కోమాలో..చికెన్ తినమని చెప్పగానే లేచి..ఆవురావురమని తినేసాడు..!!

  • Published By: nagamani ,Published On : November 9, 2020 / 02:09 PM IST
2 నెలలుగా కోమాలో..చికెన్ తినమని చెప్పగానే లేచి..ఆవురావురమని తినేసాడు..!!

Taiwan 18 yers Teen coma ‘Chicken Fillet’ : నాన్ వెజ్ లో చికెన్ టేస్టే వేరు..చికెన్ తో ఎన్ని రకాల వెరైటీస్ చేయాలో అన్ని రకాలు చేయొచ్చు. ఘుమఘుమలాడె చికెన్ నోట్లో వేసుకుంటూ నా సామిరంగా..స్వర్గం ఎక్కడో కాదు మన నాలుకమీదే ఉండదూ..చికెన్ పేరు చెబితే నోరూరిపోతుంది. ఐసీయూలో కోమాలో ఉండే పేషెంట్ కూడా చికెన్ పేరు చెబితే లేచి కూర్చుంటాడు. ఏంటీ..మరీ ఓవర్అనుకుంటున్నారా? అలాగైతే కోమాలో ఉండే పేషెంట్ లు అందరికీ పక్కన ఘుమఘుమటలాడే చికెన్ పెడితే చక్కగా లేచి కూర్చుంటారుగా..మరి వాళ్లు ట్రీట్ మెంట్ లెందుకు? అని అనుకోవచ్చు..కానీ ఇది నిజ్జంగా నిజంగా జరిగింది.



గత రెండు నెలలకు పైగా కోమాలో ఉండే ఓ పేషెంట్ చికెన్ తినొచ్చని డాక్టర్ చెప్పగానే లేచి కూర్చుని ‘‘ఎక్కడా ఎక్కడా చికెన్ ఎక్కడా’’ అంటూ లేచి కూర్చుని ఆవురావురు మంటూ చికెన్ లాగించేసిన ఘటన తైవాన్ లో జరిగింది..!!



వివరాల్లోకి వెళితే..తైవాన్ కు చెందిన చియూ టీనేజ్ కుర్రాడు. 18ఏళ్లు అతని వయస్సు. కొద్ది నెలల క్రితం అతను బైక్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుండగా యాక్సిడెంట్ అయింది. తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా రక్తస్రావం అయ్యింది. రోడ్డలంతా ఎర్రని రక్తమే. చూస్తేనే ప్రాణాలు హడలిపోయేలా ఆ చుట్టుపక్కలంతా రక్తం చిందింది. ఎవరో పుణ్యం కట్టుకుని చియూని ఆస్పత్రికి తరలించారు. అతన్ని ఆ పరిస్థితిలో చూసిన డాక్టర్లు రక్తం చాలా పోయింది బతకడం కష్టమేనన్నారు. ఆమాట విన్న అతని కుటుంబ సభ్యులు భోరుమన్నారు. ఎలాగైనా బతికించండీ డాక్టర్ అని వేడుకున్నాడు. మా ప్రయత్నం మేం చేస్తాం..అపై దేవుడి దయ అన్నాడు. అలా చియూకు డాక్టర్లు ఆరు ఆపరేషన్లు చేశారు.
https://10tv.in/ice-meat-scientists-have-created-a-meat-flavoured-ice-cream-its-all-too-real/


ప్రాణమైతే ఉంది..గానీ ఎప్పటికి కోలుకుంటాడో తెలీదు. కోమాలోకి వెళ్లిపోయాడు. అతను కోలుకోవటానికి డాక్టర్లు చేయాల్సిందంతా చేశారు. అలా రెండు నెలలు దాటింది. చియూ ఎప్పటికైనా కోలుకుంటాడని కుటుంబ సభ్యులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఎలా లేస్తాడో తెలియదు. ప్రతీ రోజు డాక్టర్లు ఏవో పరీక్షలు చేస్తునే ఉన్నారు. చియూ తల్లిదండ్రులకు ఎక్కడో ఒక ఆశ. ‘నా కొడుకు తిరిగి లేవకపోతాడా..? అని..గతంలోలాగా తిరిగి మళ్లీ మాతో కలిసి ఉండకపోతాడా..?..’ అని చిన్న ఆశ. భగవంతుడి మీద భారం వేశారు. పదిరోజులైదంది. ఇరవై రోజులైంది. నెల దాటింది. రెండు నెలలు కూడా దాటిపోయింది. కానీ వాళ్లు ఆశించినట్లుగా కొడుకు లేవలేదు.



ఆ తల్లిదండ్రులలో ఆందోళన రోజురోజుకూ పెరిగిపోతోంది. ఎదిగిన కొడుకు కళ్లముందే ఎటూ కదలకుండా కోమాలో పడి ఉండే సరికి వారికి మనసు మనుసులో లేదు. మానసికంగా కృంగిపోయేవారు. ప్రతీరోజు ఆశగా తల్లిదండ్రులతో పాటు చియూ అన్నకూడా వచ్చి చూస్తుండేవారు. డాక్టర్లు కూడా చియూతో ఏదోకటి మాట్లాడుతుండండీ..అతనికి ఇష్టమైనవాటి గురించి మాట్లాడుతూండండీ అని చెప్పేవారు. అలా ప్రతీరోజు చియూతో మాట్లాడుతుండేవారు. అలా ఓ రోజు చియూ అన్న ఆస్పత్రికి వచ్చాడు. తమ్ముడి దగ్గరకు వెళ్లి.. ‘తమ్ముడూ.. నీ కోసం నీకు ఎంతో ఇష్టమైన చికెన్ ఫిల్లెట్ తీసుకొచ్చాను. నువ్వూ నేను కలిసి చికెన్ ఎంత ఇష్టంగా తినేవాళ్లం.. నూవు లేవకుంటే నీవాటా కూడా నేనే తినేస్తా..ఇదిగో తినేస్తున్నా..ఇదిగో నోట్లో పెట్టేసుకుంటున్నా’’ అంటూ తమ్ముడి చెవిలో చెప్పాడు..!!



ఆ తరువాత జరిగిన ఘటన చియూ అన్నకూడా నమ్మలేనంత జరిగింది. డాక్టర్లు కూడా షాక్ అయ్యారు. వాళ్లు కోలుకోవటానికి చాలా టైం పట్టింది. అప్పటిదాకా కంప్యూటర్ స్క్రీన్ మీద ఒక క్రమంలో వెళ్తున్న ఈసీజీ లైన్లు.. వరుస మార్చుకున్నాయి. (అచ్చం సినిమాలోలాగా) చియూ పల్స్ వేగంగా కొట్టుకో సాగింది. చియూలో చిన్న కదలిక వచ్చింది.



ముందు చేతి వేళ్లు కదిలాయి. ఆతరువాత చేతులు.. కాళ్లు.. అలా ఒక్కొక్కటిగా అన్నీ అవయవాల్లో కదలిక వచ్చింది. ఉన్నట్టుండి చియూ లేచి కూర్చున్నాడు. ‘‘ అది చూసి అక్కడున్న వాళ్లు వారి కళ్లను వారే నమ్మలేదు. చియుకి చికెన్ అంటే భలే ఇష్టమట. ఇంట్లో చికెన్ వండితే గిన్నెలు ఖాళీ కావాల్సిందేనట. అన్నదమ్ములిద్దరూ పోటీ పడి మరీ చికెన్ లాగించేవారట..



అది గుర్తుకొచ్చిన చియూ అన్నయ్య.. తన తమ్ముడిని బతికించుకోవడానికి..కోమాలోంచి లేచేలా చేయటానికి ఆఖరి ప్రయత్నంగా తీసుకొచ్చిన చికెన్ గురించి చెప్పేసరికి తమ్ముడిలో కదలిక వచ్చింది. చికెన్ తిరిగి చియూకు ప్రాణాలు పోసింది. లేచి కూర్చున్న తమ్ముడికి చికెన్ పెట్టొచ్చా? అని డాక్టర్ ని అడగ్గా పెట్టమని డాక్టర్ చెప్పటంతో తాను తెచ్చిన చికెన్ ని తమ్ముడికి చెప్పటంతో ఆవురావురుమని లాగించేశాడు చియూ..



ఇప్పుడు చియూ క్రమ క్రమంగా కోలుకున్నాడు. ఆస్పత్రి నుంచి కూడా డిశ్చార్జి అయ్యాడు. తనను కాపాడినందుకు ఆస్పత్రి సిబ్బందితో కేక్ కట్ చేసి.. సంబరాలు చేసుకున్నారుచియూ కుటుంబ సభులు. అదికూడా చికెన్ వంటకాలతో. మనకు ఇష్టమైన ఆహారం ఆరోగ్యాన్నే కాదు.. మానసిక స్థితినీ మెరుగుపర్చుతుందని మరోసారి రుజువైంది వైద్యపరంగా…! మరి ఇప్పుడైనా నమ్ముతారా? కోమాలో ఉన్నవారు కూడా చికెన్ కోసం లేచి కూర్చుంటారనీ..!