Afghanistan : మరో దారుణం.. జానపద గాయకుడిని హత్యచేసిన తాలిబన్లు

అఫ్ఘానిస్తాన్ లో తాలిబన్ల అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. అఫ్ఘాన్ ను తమ చేతుల్లోకి తీసుకోగానే శాంతిమంత్రం జపించిన తాలిబన్లు.. తమ నిజస్వరూపం బయటపెడుతున్నారు.

Afghanistan : మరో దారుణం.. జానపద గాయకుడిని హత్యచేసిన తాలిబన్లు

Afghanistan

Afghanistan : అఫ్ఘాన్ ను ఆక్రమించిన తాలిబన్లు గతంలో తమకు వ్యతిరేకంగా పనిచేసిన వారిపై ప్రతీకారం తీర్చుకుంటున్నారు. ఇప్పటికే వందల మంది అఫ్ఘాన్ పౌరులను పొట్టనపెట్టుకున్న తాలిబన్లు తాజాగా ఓ జానపద గాయకుడిని హత్యచేశారు. జానపద గాయకుడు ఫవాద్ అందరాబీని అతడి పేరుపై ఉన్న అందరాబీ పర్వత ప్రాంతానికి తీసుకొని హత్యచేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఈ ఘటనపై ఫవాద్ కుమారుడు జవాద్ అందరాబీ ఆవేదన వ్యక్తం చేశారు. తాలిబన్లు ఈ విధంగా చేస్తారని తామసలు ఊహించలేదని తెలిపాడు. కొద్దీ రోజుల క్రితం తాలిబన్లు తమ ఇంటికి వచ్చి తన తండ్రితో కలిసి టీతాగారని.. వాళ్లు మారారని మేము పొరపడ్డామని అన్నారు. తన తండ్రి హత్యపై స్థానిక తాలిబన్ కౌన్సిల్ లో ఫిర్యాదు చేశామని.. హత్య చేసిన వారిని గుర్తించి శిక్షిస్తామని తాలిబన్లు హామీ ఇచ్చారని జవాద్ పేర్కొన్నారు.

ఈ ఘటనపై తాలిబన్ల ప్రతినిధి.. జాబిహుల్లా ముజాహిద్ స్పందించారు. హత్యకు కారకులను త్వరలోనే పట్టుకుంటామని జవాద్ కుటుంబానికి హామీ ఇచ్చారు. మరోవైపు తాలిబన్లు దేశాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడంతో నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. ఒక్క వాటర్ బాటిల్.. రూ.3000 లకు చేరింది. బిస్కెట్ ప్యాకెట్ వెయ్యి నుంచి పదిహేను వందలకు అమ్ముతున్నారు. ఇందుకు కూడా కండిషన్స్ అప్లై అంటున్నారు స్థానిక వ్యాపారులు, డాలర్ లో చెల్లింపులు చేస్తేనే ఇస్తామని తెగేసి చెబుతున్నారు. దీంతో చాలామంది అర్దాకలితో అలమటిస్తున్నారు.