Taliban : అఫ్ఘానిస్తాన్ కొత్త అధ్యక్షుడిగా తాలిబన్ నేత ముల్లా బరాదర్!

తాలిబన్లతో పోరాడలేక అప్ఘానిస్తాన్ అధ్యక్ష పదవికి అష్రఫ్ ఘనీ ఆదివారం రాజీనామా చేసిన నేపథ్యంలో దేశ నూతన అధ్యక్షుడిగా తాలిబన్‌ కామాండర్‌ ముల్లా అబ్దుల్‌

Taliban : అఫ్ఘానిస్తాన్ కొత్త అధ్యక్షుడిగా తాలిబన్ నేత ముల్లా బరాదర్!

Mullah

Taliban తాలిబన్లతో పోరాడలేక అప్ఘానిస్తాన్ అధ్యక్ష పదవికి అష్రఫ్ ఘనీ ఆదివారం రాజీనామా చేసిన నేపథ్యంలో దేశ నూతన అధ్యక్షుడిగా తాలిబన్‌ కామాండర్‌ ముల్లా అబ్దుల్‌ ఘనీ బరదార్‌(53) బాధ్యతలు చేపట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తాలిబన్ల నేతృత్వంలో అఫ్ఘానిస్తాన్ లో మధ్యంతర ప్రభుత్వం ఏర్పడనున్న నేపథ్యంలో ముల్లా బరాదర్.. ఖతార్(ఆఫ్ఘానిస్తాన్ ప్రభుత్వం-తాలిబన్ల మధ్య చర్యలకు మధ్యవర్తిగా ఉన్న దేశం) సహాయంతో మరియు అమెరికా ఆమోదంతో ఆఫ్ఘానిస్తాన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం.

ముల్లా బరాదర్..అఫ్ఘాన్‌ ముజాహిద్‌ కమాండర్‌ ముల్లా ఉమర్‌తో కలిసి తాలిబన్‌ సంస్థకు పనిచేశారు. గతంలో తాలిబన్ల పాలనలో రెండు రాష్ట్రాలకు గవర్నర్‌గా కూడా పనిచేశారు. 2010లో పాకిస్తాన్‌ ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్‌, సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ అధికారులు ముల్లా బరాదర్ ని అరెస్ట్‌ చేశారు. 2018 అక్టోబర్‌ 24 వరకు పాక్‌ జైలులో గడిపారు. అమెరికా విజ్ఞప్తి మేరకు ముల్లాని  జైలునుంచి విడుదల చేసింది పాకిస్తాన్.