Viral Video: వామ్మో.. ఇదేందయ్యో.. రెండు రుచులను ఒకేసారి చూడగలదు..!

మన ముందు రెండు రకాల తినుబండారాలు కానీ, రెండు రకాల జ్యూస్ లు ఉంటే మనం ఏం చేస్తాం..? ఒకదాని తరువాత ఒకటి రుచిచూస్తాం.. కానీ అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన బ్రియన్నా మేరీ షిహాడే మాత్రం రెండు రకాల జ్యూస్ లను ఒకేసారి ...

Viral Video: వామ్మో.. ఇదేందయ్యో.. రెండు రుచులను ఒకేసారి చూడగలదు..!

Two Flavors

Viral Video: మన ముందు రెండు రకాల తినుబండారాలు కానీ, రెండు రకాల జ్యూస్ లు ఉంటే మనం ఏం చేస్తాం..? ఒకదాని తరువాత ఒకటి రుచిచూస్తాం.. కానీ అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన బ్రియన్నా మేరీ షిహాడే మాత్రం రెండు రకాల జ్యూస్ లను ఒకేసారి రుచిచూస్తుంది. అంటే ఆమెకు రెండు నాలుకలు ఉన్నాయా అనే డౌట్ మీకు రావొచ్చు.. అలాంటిదేమీ లేదు.. కానీ ఆమె నాలుక ముందుభాగం రెండు పాయలుగా చీలి ఉంటుంది. దీంతో ఆమె ముందు రెండు రకాల తినుబండారాలు పెడితే వాటిని ఒకేసారి రుచిచూసి కరెక్ట్‌గా చెప్పేస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. దీంతో షిహాడే ప్రతిభను చూసి నెటిజర్లు తెగ లైక్‌లు కొట్టేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో సందడి చేస్తోంది.

Viral Video: కోతి, బాతు పిల్లలు పుచ్చకాయ తినడం కాదు.. ఇక్కడ చూడండి కింగ్ కోబ్రా ఏం చేస్తోందో..‍!!

అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన షిహాడేకు బాడీ మోడిఫికేషన్(శస్త్ర చికిత్సతో శరీరంలో మార్పులు) అంటే చాలా ఇష్టం. ఈ క్రమంలో ఆమె సర్జరీ ద్వారా తన నాలుకను రెండుగా స్ల్పిట్ చేయించుకుంది. ఇటీల ఆమె ఒక గ్లాస్ లో స్పైట్ కూల్ డ్రింక్, మరో గ్లాస్ లో మంచినీళ్లు పెట్టుకొని రెండింటిని ఒకేసారి తాగి తన స్ల్పిట్ నాలుకతో రెండింటి రుచులను చెప్పేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్ గా మారింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో 2.2లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈ వీడియోను చూసినవారంతా వామ్మో.. అంటూ ఆశ్చర్య పోతున్నారు. అయితే వైద్యులు మాత్రం స్ల్పిట్ టంగ్ అనేది చాలా ప్రమాదకరమని చెబుతున్నారు.