Texas school shooting: తెలివైన పిల్ల.. రక్తాన్ని ఒంటికి పూసుకొని ప్రాణాలు దక్కించుకుంది..

అప్పటి వరకు ప్రశాంతం వాతావరణంలో క్లాసులో టీచర్లు చెప్పే పాఠాలు వింటున్న విద్యార్థులకు ఊహించని ప్రమాదం ఎదురైంది.. ఓ వ్యక్తి తుపాకీతో వచ్చి అందరినీ పిట్టలను కాల్చినట్లు కాల్చేస్తున్నాడు. తన చుట్టుపక్కన విద్యార్థులు దుండగుడి తుపాకీ నుంచి వచ్చిన తూటాలు తాకి కిందపడిపోతున్నారు.. ఊహించని పరిణామంతో 11ఏళ్ల మియా సెర్రిల్లో గజగజా వణికిపోయింది..

Texas school shooting: తెలివైన పిల్ల.. రక్తాన్ని ఒంటికి పూసుకొని ప్రాణాలు దక్కించుకుంది..

Texas School Shooting

Texas school shooting: అప్పటి వరకు ప్రశాంత వాతావరణంలో క్లాసులో టీచర్లు చెప్పే పాఠాలు వింటున్న విద్యార్థులకు ఊహించని ప్రమాదం ఎదురైంది.. ఓ వ్యక్తి తుపాకీతో వచ్చి అందరినీ పిట్టలను కాల్చినట్లు కాల్చేస్తున్నాడు. తన చుట్టుపక్కన విద్యార్థులు దుండగుడి తుపాకీ నుంచి వచ్చిన తూటాలు తాకి కిందపడిపోతున్నారు.. ఊహించని పరిణామంతో 11ఏళ్ల మియా సెర్రిల్లో గజగజా వణికిపోయింది.. ఇక నా వంతే అనుకుంటున్న సమయంలో.. మనస్సులో అద్భుత ఆలోచన తట్టింది.. ఆ ఆలోచనే మియా సెర్రిల్లోను ప్రాణాలతో బయటపడేసింది. ఈ ఘటన గత మూడు రోజుల క్రితం అమెరికాలోని టెక్సాస్ స్కూల్ లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో చోటు చేసుకుంది. దుండగుడు జరిపిన కాల్పుల్లో 19మంది విద్యార్థులతో సహా మొత్తం 21 మంది ప్రాణాలు కోల్పోయారు.

Texas School : టెక్సాస్‌లో మారణహోమం.. మరుసటిరోజే స్కూల్ బయట తుపాకీతో మరో విద్యార్థి..!

మియా సెర్రిల్లో ఎలిమెంటరీ స్కూల్ లో నాల్గో తరగతి చదువుతోంది. ఎప్పటిలాగే గత మంగళవారం కూడా పాఠశాలకు వెళ్లింది. నిశ్శబ్ధ వాతావరణంలో టీచర్లు చెప్పే పాఠాలు వింటోంది. గుర్తు తెలియని వ్యక్తి తుపాకీతో వచ్చి అందరినీ కాల్చేస్తున్నాడు. మియా చుట్టుపక్కన ఉన్న ఫ్రెండ్స్ తుపాకీ తూటాలతో ఒక్కొక్కరుగా నేలవాలుతున్నారు. పాఠాలు చెప్పే టీచర్ సైతం దుండగుడి తూటాకు బయలైంది. మరో తూటా వస్తే తగలాల్సింది మియాకే.. ఇక నా ప్రాణాలు పోయినట్లేనని మనస్సులో భయంతో వణిపోతోంది.. ఈ సమయంలో మియాకు అద్భుత ఆలోచన తట్టింది. వెంటనే పక్కనే స్నేహితుల మృతదేహాల నుంచి కారుతున్న రక్తాన్ని చేతులకు పూసుకొని తన వంటికి రాసుకుంది. రక్తపు మడుగులో పడుకొని శవంలా నటించింది. కొద్దిసేపు ఊపిరిబిగబట్టుకొని అలానే ఉంది. దుండగుడు అక్కడి నుంచి వెళ్లిపోవటంతో అమాంతం ఊపిరి పీల్చుకొని ప్రాణాలు కాపాడుకుంది.

Biden Emotional : అమెరికాలో మారణహోమం.. బైడెన్‌ భావోద్వేగం..!

దుండగుడు వెళ్లిపోయిన వెంటనే పక్కనే చనిపోయిన టీచర్ చేతిలో ఉన్న ఫోన్ ను తీసుకొని 911 నెంబర్ కు ఫోన్ చేసింది. అయితే చాకచక్యంగా ప్రాణాలు కాపాడుకున్న మియాను కాల్పుల ఘటన ఇంకా వెంటాడుతూనే ఉందని మియా తండ్రి మిగుల్ సెరిల్లో తెలిపాడు. ఆ రోజు రాత్రంతా మియా నిద్రపోలేదని, భయంతో వణికిపోతూ కూర్చొందని.. ‘డాడీ.. మీరు కూడా తుపాకీ తెచ్చుకోండి ఆ దుర్మార్ఘుడు మళ్లీ వస్తాడు’ అంటూ చెబుతుంటే మాకు కన్నీళ్లు ఆగలేదంటూ తండ్రి స్థానిక మీడియా ఎదుట వాపోయాడు. మియా క్లాస్ రూంలో ప్రాణాలు దక్కించుకున్న తీరును తన తండ్రికి వివరించింది. అయితే మియాకు స్వల్ప గాయాలు కావడంతో ఆమెను ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించారు. దుండగుడి కాల్పుల ఘటనలో మియా తప్పించుకున్న తీరును అందరూ ప్రశంసిస్తున్నప్పటికీ.. మియాలో భయం మాత్రం అలానే ఉందంటూ మియా తండ్రి తెలిపాడు.