ఆమె అదృష్టం : బాడీగార్డ్‌ను పెళ్లి చేసుకున్న థాయ్‌లాండ్ రాజు

ఆమె అదృష్టం : బాడీగార్డ్‌ను పెళ్లి చేసుకున్న థాయ్‌లాండ్ రాజు

థాయ్‌లాండ్ రాజు మహా వజిరాలాంగ్‌కార్న్ బుధవారం సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన పర్సనల్ సెక్యూరిటీ చూసుకునే మహిళను పెళ్లాడాడు. రాణి సుతిదాగా మారిన ఆమె హోదా పెరిగిపోయింది. అందరూ ఆశ్యర్యపోయేలా ఈ వివాహాన్ని రాచమర్యాదలతో నిర్వహించారు. 

ఆ తర్వాత థాయ్‌లాండ్ టీవీ చానెళ్ల ద్వారా వివాహ కార్యక్రమాన్ని అందరికీ తెలియజేశారు. 66ఏళ్ల వయస్సున్న వజిరాలాంగ్‌కార్న్కు కింగ్ రామా X అనే పేరు కూడా ఉంది. అక్టోబరు 2016లో 70ఏళ్ల రాజ్యపాలన అనంతరం తండ్రి మరణించడంతో మహారాజుగా కిరీటం అందుకుని బాధ్యతలు భుజాన వేసుకున్నారు. 

ఈయనకు గతంలోనే 3వివాహాలు జరగ్గా ఏడుగురు పిల్లలు కూడా ఉన్నారు. అందరికీ విడాకులిచ్చేసి ఈమెను వివాహమాడాడు థాయ్‌లాండ్ రాజు. ఈ వివాహంతో 66ఏళ్ల రాజు వజిరాలాంగ్‌కార్న్‌ 40 ఏళ్లు బాడీగార్డ్ సుతిదా దంపతులయ్యారు. 

థాయ్ ఎయిర్‌వేస్‌లో అటెండెంట్‌గా ఫని చేసిన సుతిదా.. 2014వ సంవత్సరంలో వజిరాలాంగ్‌కార్న్ బాడీగార్డ్ యూనిట్‌కు డిప్యూటీ కమాండర్‌గా అపాయింట్ అయింది. తర్వాత కొన్నాళ్లకే వజిరాలాంగ్‌కార్న్‌కు సుతిదాకు మధ్యలో రొమాంటిక్ వ్యవహారాలు నడుస్తున్నాయంటూ పుకార్లు పుట్టుకొచ్చాయి. అప్పటి వరకూ రాజుగా ఉన్న వజిరాలాంగ్‌కార్న్ తండ్రి కాలం చేశారు. 

2016లో మహారాజుగా బాధ్యతలు అందుకున్న వజిరాలాంగ్‌కార్న్.. అదే సంవత్సరం రాయల్ థాయ్ ఆర్మీకి ఫుల్ జనరల్‌గా నియమించి సంవత్సరంలోనే రాజుగారి పర్సనల్ బాడీ గార్డ్‌గా ప్రమోషన్ ఇచ్చారు.