చోరీ కోసం పోలీసు ఇంటికొచ్చి..కూతురు రూమ్ లో ఏసీ వేసుకుని పడుకున్న దొంగ

బ్యాంకాక్ లో మాత్రం ఓ దొంగ ఏకంగా ఓ పోలీసు ఇంటికే కన్నం వేయటానికి వచ్చాడు. వచ్చినవాడు వచ్చిన పని చూసుకోకుండా అత్యుత్సాహాని పోయి ఇరుక్కుపోయాడు. ఇంకేముందీ...సదరు పోలీసాయనకు దొరికిపోయి ఒళ్లంతా హూనం చేసుకున్నాడు. ఆ తరువాత ఊచలు లెక్కపెడుతూ కూర్చున్నాడు.

చోరీ కోసం పోలీసు ఇంటికొచ్చి..కూతురు రూమ్ లో ఏసీ వేసుకుని పడుకున్న దొంగ

Thai Man Falls Asleep At House He Was Trying To Robbery

Thai man falls asleep at house he was trying to Robbery : దొంగతనానికి వచ్చి వచ్చిన పని చూసుకోకుండా కొంతమంది దొంగలు కోతు పనులు..వెర్రి పనులు చేసి దొరికిపోయిన ఘటనల గురించి విన్నాం. దొంగతనానికి వచ్చి ఉన్నందంతా దోచుకుపోవటం..లేదంటే వచ్చిన పని అయ్యాక అదే ఇంట్లో ఉన్న ఫుడ్ అంతా మెక్కి జంపైపోయిన వాళ్లనీ చూశాం. కానీ..బ్యాంకాక్ లో మాత్రం ఓ దొంగ ఏకంగా ఓ పోలీసు ఇంటికే కన్నం వేయటానికి వచ్చాడు. వచ్చినవాడు వచ్చిన పని చూసుకోకుండా అత్యుత్సాహాని పోయి ఇరుక్కుపోయాడు. ఇంకేముందీ…సదరు పోలీసాయనకు దొరికిపోయి ఒళ్లంతా హూనం చేసుకున్నాడు. ఆ తరువాత ఊచలు లెక్కపెడుతూ కూర్చున్నాడు. ఆ పై చోరీకి వచ్చి అందినకాడికి దోచుకెళ్లకుండా తాను చేసిన వెర్రి పనికి తలపట్టుకుని తాపీగాఊచలులెక్కపెడుతున్నాడు.

7

థాయ్‌ల్యాండ్‌లోని ఫెట్చాబున్ ప్రావిన్స్‌లో మార్చి 22న ఓ ఇంటికి ఓ దొంగ వచ్చాడు. మెల్లగా లోపల దూరాడు. ఇల్లంతా చక్కగా వెతికి చూసుకున్నాడు ఏమేం పట్టుకెళ్లాలా? అని..అలా అన్నీ చెక్ చేసుకుంటూ ఓ రూమ్ లోకి వెళ్లాడు. అక్కడ ఓ మంచం కనిపించింది. దానిపై మెత్తని పరుపు కనిపించింది. దానిపై కూర్చున్నాడు. గోడకు ఉన్న ఏసీ కనిపించింది. ఏసీ ఆన్ చేశాడు. రూమ్ అంతా చల్లగా మంచు దుప్పటి కప్పుకున్నట్లుగా కూల్ గా అయిపోయింది. దీంతో సదరు దొంగగారికి నిద్ర ముంచుకొచ్చింది. వచ్చిన పని మర్చిపోయి..హాయిగా దుప్పటి కప్పుకుని గుర్రు పెట్టి మరీ నిద్రపోయాడు…!!

1

తెల్లరి లేచి చూసేసరికి పాపం ఆ దొంగగారికి దిమ్మ తిరిగిపోయింది. అది ఓ పోలీసు అధికారి ఇల్లు..అది పోలీసు ఇల్లని తెలిక వచ్చాడు. వచ్చినపని చూసుకోకుండా ఏసీ వేసుకుని నిద్రపోయాడు. ఈ విషయం అతనికి ఎలా తెలిసిందంటే..డ్యూటీ మీద వెళ్లిన పోలీసు అధికారి మరుసటి రోజు ఉదయం ఇంటికొచ్చేసరికి తన కూతురి రూంలో ఏసీ ఆన్‌లో ఉన్నట్టు గుర్తించారు. ఇంట్లో కూతురు లేదు కదా..ఏసీ ఆన్ లో ఉందేంటీ? అనే డౌట్ వచ్చింది. వెంటనే రూమ్ లోకెళ్లి చూశాడు. మంచంమీద ఎవరో దుప్పటి కప్పుకుని నిద్రపోతున్నట్లుగా గుర్తించాడు.

7

దీంతో అతని డౌట్ మరింత పెరిగింది. అంతే దుప్పటి లాగి చూసి షాక్ అయ్యాడు. ఎవరో తెలియని వ్యక్తి తన ఇంట్లో తన కూతురు మంచంమీద నిద్రపోతుండటం చూసి షాక్ అయ్యాడా పోలీసు అధికారి. అంతే కోసం కట్టలు తెంచుకుంది. మంచం మీద పడుకున్నవాడిని ఒక్క తన్ను తన్ని..‘‘ఎవడ్రా నువ్వు..ఇక్కడ పడుకున్నావ్’’ అంటూ ప్రశ్నించాడు.

6

అంతే..నిద్రాభంగంకలిగిన దొంగగారు.. కళ్లు నలుపుకుంటూ లేచి చూసేసరికి నిద్రమత్తు ఒక్కసారిగా దిగిపోయింది. ఎదురుగా పోలీస్ డ్రెస్ లో ఉన్న వ్యక్తిని చూడగానే దిమ్మ తిరిగిపోయింది. రాత్రి చోరీకి రావటం..ఏసి వేసుకుని నిద్రపోవటం గుర్తుకొచ్చింది. తనో పోలీస్ ఇంట్లో చోరీకి వచ్చానని తెలుసుకుని అవాక్కయ్యాడు. ఆ తరువాత..ఇంకేముంది? అతడి చేతులకీ బేడీలు పడటం.. కేసు నమోదవడం అన్నీ చకచకా జరిగిపోయాయి.

2

పోలీసులు తమదైన శైలిలో విచారించేసరికి దొంగగారు అసలు విషయం బైటపెట్టాడు. చోరీకి వచ్చాననీ..అది పోలీసు ఆఫీసర్ ఇల్లు అని తెలియలేదనీ..బాగా అలసటగటా ఉండటంతో చిన్న కునుకు తీద్దామని మంచమెక్కానని, ఇంతలోనే ఏసీ కూడా వేసుకోవటంతో నిద్ర పట్టేసిందని చెప్పుకొచ్చాడు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.