Warship sinks : సముద్రంలో మునిగిన భారీ యుద్ధ నౌక,33 మంది గల్లంతు

సముద్రంలో గస్తీ నిర్వహిస్తున్న ఓ భారీ యుద్ధ నౌక మునిగిపోయింది. గల్ఫ్‌ ఆఫ్ థాయ్‌లాండ్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ థాయ్‌ యుద్ధ నౌక రాత్రి సయమంలో ప్రమాదవశాత్తూ నీట మునిగింది.

Warship sinks : సముద్రంలో మునిగిన భారీ యుద్ధ నౌక,33 మంది గల్లంతు

Thailand Navy ship sinks

Thailand Navy ship sinks : సముద్రంలో గస్తీ నిర్వహిస్తున్న ఓ భారీ యుద్ధ నౌక మునిగిపోయింది. గల్ఫ్‌ ఆఫ్ థాయ్‌లాండ్‌ (Gulf of Thailand)లో విధులు నిర్వహిస్తున్న ఓ థాయ్‌ యుద్ధ నౌక ప్రమాదవశాత్తూ రాత్రి సయమంలో నీట మునిగింది. ఆదివారం (డిసెంబర్ 18,2022) రాత్రి జరిగిన ఈ ఘటనలో 33మంది గల్లంతు అయ్యారు. 106 మంది నేవీ సిబ్బంది ఉన్న ఈ నౌక బలమైన గాలులు వీచటంతో ఒక్కసారిగా ఊగిపోయింది. ఈ ప్రమాదంలో నేవీ సిబ్బంది 75 మందిని కాపాడారు. కానీ 33మంది గల్లంతు అయ్యారు. గల్లంతైనవారి కోసం నౌకలు, హెలికాప్టర్లతో గాలిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

థాయ్‌లాండ్‌ లోని ప్రచుప్‌ ఖిరి ఖాన్‌ ప్రావిన్స్‌లో సముద్ర తీరానికి 20 నాటికల్‌ మైళ్ల దూరంలో హెచ్‌టీఎంస్‌ సుఖొథాయ్‌ నౌక గస్తీ నిర్వహిస్తోంది. ఆ సమయంలో బలమైన ఈదురుగాలులు వీచాయి. దీంతో నౌక ఊగిపోవటంతో సముద్రపు నీరు యుద్ధనౌకలోకి చేరింది. దీంతో విద్యుత్తు వ్యవస్థ దెబ్బతింది. ఈ ఘటనపై సిబ్బంది థాయ్‌ నౌకాదళానికి సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఆ యుద్ధనౌక వద్దకు మూడు ఫ్రిగెట్లు, రెండు హెలికాప్టర్లను పంపించింది. వారు అక్కడకు చేరుకుని మొబైల్‌ పంపింగ్‌ మిషన్లను నీటిని బయటకు పంపించేందుకు ప్రయత్నించినా బలమైన తీవ్ర గాలులు వీచటంతో వారి యత్నాలు ఫలించలేదు.

నీరు భారీగా నౌకలోకి చేరటంతో ఇంజిన్‌ వ్యవస్థ కూడా దెబ్బతింది. పనిచేయకుండాపోయింది. దీనికి తోడు విద్యుత్ లేకపోవటంతో సహాయం చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. దీంతో నౌక నెమ్మదిగా ఓ వైపు ఒరుగుతూ నెమ్మది నెమ్మదిగా నీటమునిగింది.