Ukraine Crisis: ఎంతకైనా తెగిస్తాం.. రష్యా సేనలను అడ్డుకొనేందుకు ఉక్రెయిన్ వాసుల సాహసోపేత చర్యలు

ఉక్రెయిన్ పై రష్యా సేనలు విరుచుకుపడుతున్నాయి. క్రూరంగా వ్యవహరిస్తూ మిస్సైళ్ల వర్షం కురిపిస్తున్నాయి. ఫలితంగా ఎంతో మంది ఉక్రెయిన్ వాసులు ప్రాణాలు కోల్పోతున్నారు...

Ukraine Crisis: ఎంతకైనా తెగిస్తాం.. రష్యా సేనలను అడ్డుకొనేందుకు ఉక్రెయిన్ వాసుల సాహసోపేత చర్యలు

Ukraine Crisis

Ukraine Crisis: ఉక్రెయిన్ పై రష్యా సేనలు విరుచుకుపడుతున్నాయి. క్రూరంగా వ్యవహరిస్తూ మిస్సైళ్ల వర్షం కురిపిస్తున్నాయి. ఫలితంగా ఎంతో మంది ఉక్రెయిన్ వాసులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆస్తులు ధ్వసమవుతున్నాయి. ఒకపక్క ప్రాణాలు పోతాయని తెలిసిన రష్యా సేనలను అడ్డుకొనేందుకు ఉక్రెయిన్ వాసులు ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు. యుద్ధం ప్రారంభమై సుమారు రెండు నెలలు దాటిన రష్యా సేనలను నిలువరించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంతకైనా తెగిస్తూ తమ ప్రాంతాలను, దేశాన్ని కాపాడుకొనేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో దేశాన్ని కాపాడుకొనేందుకు ఉక్రెయిన్ ప్రజల పోరాట పటిమ, సాహసోపేత చర్యలు ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్నాయి.

ఉక్రెయిన్ రాజధాని కీవ్ లోకి రష్యన్ సేనలు రాకుండా ఆ సమీపంలోని ఓ గ్రామ వాసులు వరదలతో అడ్డుకట్ట వేశారు. కీవ్ కు ఉత్తరాన దిమిదివ్ అనే గ్రామం ఉంది. ఈ గ్రామం నుంచి రష్యన్ ట్యాంక్ లు వెళ్లకుండా చేసేందుకు ఇటీవల అక్కడి ప్రజలు ఊరిని వరదలతో నింపేశారు. సమీపంలోని దివిప్రో నది నుంచి మోటార్ల సాయంతో పొలాల్లోకి, వీధుల్లోకి నీటిని నింపేశారు. దీంతో వీధులన్నీ నదులను తలపించాయి. తాము నష్టపోయినా పర్వాలేదు.. రష్యా సేనలను అడ్డుకోవటమే తమ లక్ష్యమని అక్కడి ప్రాంత వాసులు పేర్కొన్నారు.

Russia ukraine : war @ 2నెలలు..యుక్రెయిన్ పై యుద్ధంతో రష్యా ఏం సాధించింది…?

మరోవైపు కీవ్ లోకి రష్యా సేనలు రాకుండా పరిసర ప్రాంతాల ప్రజలు స్వీయ నష్టానికి వెనుకాడటం లేదు. బ్రిడ్జిలను ఎక్కడికక్కడ ధ్వంసం చేస్తూ రష్యన్ కాన్వాయ్ లు రాకుండా అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా దేశంలో 300కు పైగా వంతెనలను అక్కడి పౌరులు ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఉక్రెయిన్ ప్రభుత్వ అధికారి ఒకరు తాజాగా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వీటిని చూసి ప్రపంచ దేశాల ప్రజలు ఉక్రెయిన్ వాసుల పోరాట పఠిమకు ఆశ్చర్య పోతున్నారు.

Ukraine Crisis 2