Viral Video: గ్రాడ్యుయేషన్ పాసైన ఆనందంతో డాన్స్ చేసింది.. అదే ఆమె కొంప ముంచింది

విద్యార్థి తన గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ తీసుకోవడానికి ప్రిన్సిపాల్ వద్దకు వెళుతున్నప్పుడు నెమ్మదిగా డ్యాన్స్ చేయడం చూడవచ్చు. ఆమె స్పందన చూసి ప్రేక్షకులు నవ్వుకున్నారు. అప్పుడు ప్రిన్సిపాల్ తన సర్టిఫికేట్ ఇవ్వకుండా అమ్మాయిని తన సీటుకు తిరిగి వెళ్ళమని చెప్పడం చూడవచ్చు.

Viral Video: గ్రాడ్యుయేషన్ పాసైన ఆనందంతో డాన్స్ చేసింది.. అదే ఆమె కొంప ముంచింది

The Philadelphia High School: పరీక్షల్లో పాసైతే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. పాసైన సర్టిఫికెట్ చేతిలో పట్టుకున్నప్పుడు వారి ఆనందానికి అవధులు ఉండవు. ఆ ఆనందాన్ని కొందరు పాటతో, కొందరు ఆటతో తెలియజేస్తుంటారు. ఇలాగే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఒక యువతి చేసింది. పట్టా తీసుకోబోతూ స్టేజీపై డాన్స్ చేసింది. పాపం.. అదే ఆమె కొంప ముంచింది. డాన్స్ చేసినందుకు సర్టిఫికేట్‌ ఇచ్చేందుకు నిరాకరించారు. అప్పటి వరకు ఉన్న పట్టలేని ఆనందరం కాస్త, తీరని దు:ఖంగా మారింది. జరిగిన అవమానికి కన్నీళ్లు పెట్టుకుంది ఆ యువతి.

Soyam Bapurao: నేను అలా అనలేదు.. మా పార్టీ నేతలే కుట్ర పన్ని అలా ప్రచారం చేశారు: బీజేపీ ఎంపీ సోయం బాపూరావు

అమెరికాలోని ది ఫిలడెల్ఫియా హై స్కూల్ ఫర్ గర్ల్స్‭లో జూన్ 9వ తేదీన జరిగిన ఘటన ఇది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ది ఫిలడెల్ఫియా హై స్కూల్ ఫర్ గర్ల్స్‭ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న అబ్దుర్-రహ్మాన్ అనే 17 ఏళ్ల యువతి, సర్టిఫికెట్ జారీ చేస్తున్న క్రమంలో తన పేరు పిలవగానే డాన్స్ చేస్తూ వెళ్లింది. అంతే, అలా చేసినందుకు ఆమెకు సర్టిఫికెట్ ఇచ్చేందుకు నిరాకరించారు.

వైరల్ వీడియోలో, విద్యార్థి తన గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ తీసుకోవడానికి ప్రిన్సిపాల్ వద్దకు వెళుతున్నప్పుడు నెమ్మదిగా డ్యాన్స్ చేయడం చూడవచ్చు. ఆమె స్పందన చూసి ప్రేక్షకులు నవ్వుకున్నారు. అప్పుడు ప్రిన్సిపాల్ తన సర్టిఫికేట్ ఇవ్వకుండా అమ్మాయిని తన సీటుకు తిరిగి వెళ్ళమని చెప్పడం చూడవచ్చు. దీనిపై సదరు యువతి అబ్దుర్ రెహ్మాన్ తన దు:ఖాన్ని వ్యక్తం చేసింది. బాలికలు సంప్రదాయాలను దాటి ప్రవర్తించకూడదని బలవంత పెట్టడం అన్యాయమని అన్నారు.

Ballia Hospital: తాజాగా మరో 14 మంది మృతి.. బలియా ఆసుపత్రిలో పెరుగుతున్న మరణాలు, వేడిగాలులకు 4 రోజుల్లో 68 మంది మృతి

14 ఏళ్ల వయసులో హత్యకు గురైన తన సోదరి గౌరవార్థం ఈ వేడుక తన హృదయంలో ప్రత్యేక స్థానాన్ని పొందిందని ఆమె పేర్కొంది. ఆ ఆనందంలో తాను డాన్స్ చేశానని చెప్పింది. అయితే విద్యార్థులు వేదికపైకి వెళ్లినప్పుడు వారి కుటుంబాలు చప్పట్లు కొట్టవద్దని, ఎవరూ నవ్వకూడదని ప్రిన్సిపాల్ లీసా మెసి హెచ్చరించారట. ‘ష్’ అని శబ్దం చేస్తూ విద్యార్థులకు హెచ్చరిక చేయడం తాను గమనించానని రెహ్మాన్ చెప్పింది. రెహ్మాన్ డాన్స్ చేస్తున్నప్పుడు చాలా మంది నవ్వారు. అందుకే సర్టిఫికెట్ నిరాకరించాటర. కాగా, ప్రిన్సిపాల్ లీసాపై నెటిజెన్లు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు.