Ballia Hospital: తాజాగా మరో 14 మంది మృతి.. బలియా ఆసుపత్రిలో పెరుగుతున్న మరణాలు, వేడిగాలులకు 4 రోజుల్లో 68 మంది మృతి

భారత వాతావరణ శాఖ ప్రకారం శుక్రవారం బల్లియాలో గరిష్ఠ ఉష్ణోగ్రత 42.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది సాధారణం కంటే 4.7 డిగ్రీలు ఎక్కువ. పాట్నా, నలందా పట్టణాల్లో ఎండవేడిమితో ఎక్కువమంది మరణించారు. బీహార్ రాజధాని పాట్నాలో గరిష్ఠంగా 44.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.

Ballia Hospital: తాజాగా మరో 14 మంది మృతి.. బలియా ఆసుపత్రిలో పెరుగుతున్న మరణాలు, వేడిగాలులకు 4 రోజుల్లో 68 మంది మృతి

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వీస్తున్న వేడిగాలులకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. వేడిమి తాపానికి గురై రాష్ట్రంలోని బలియా ఆసుపత్రిలో చేరుతున్న అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా 14 మంది ఎండ వేడిమి వల్ల మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. దీంతో కేవలం నాలుగు రోజుల్లో ఆ ఆసుపత్రిలో మరణించిన వారి సంఖ్య 68కి చేరింది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంతో పాటు బిహార్ రాష్ట్రంలోనూ వడగాలుల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఈ ధాటికి వందల మంది అస్వస్థతకు గురవుతున్నారు. ఇందులో కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు.

MP Soyam Bapurao : నా సొంత అవసరాల కోసం ఎంపీ లాడ్స్ నిధులు వాడుకున్నా.. తప్పేంటీ..? : ఎంపీ సోయం బాపూరావు

రాష్ట్రంలోని బలియా జిల్లాలో గత మూడు రోజుల్లో జ్వరం, వడదెబ్బతో ఆసుపత్రిలో చేరారు. తీవ్ర జ్వరం, శ్వాస ఆడకపోవడం, ఇతర ఆరోగ్య సమస్యలతో మూడు రోజుల్లో 400 మంది బలియా జిల్లా ఆసుపత్రిలో చేరారని వైద్యులు చెప్పారు. బలియా జిల్లా వ్యాప్తంగా ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, దీంతో ప్రజలు వైద్యం కోసం ఆసుపత్రిలో చేరుతున్నారని చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జయంత్ కుమార్ తెలిపారు. ఎండ దెబ్బకు గురైన వారిలో 60 ఏళ్ల వయసు దాటిన వారు ఎక్కువ మంది ఉన్నారని వైద్యులు చెప్పారు. అసలే అనారోగ్యాలతో బాధపడుతున్న వారు తీవ్రమైన వేడి కారణంగా గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, డయేరియా వల్లే ఎక్కువ మంది మరణిస్తున్నారని బలియా చీఫ్ మెడికల్ ఆఫీసర్ జయంత్ కుమార్ వివరించారు.

Golden Temple Gurbani: స్వర్ణ దేవాలయం గుర్బానీ వివాదం.. చట్ట సవరణ చేస్తామని సీఎం సంచలన ప్రకటన.. జోక్యం చేసుకుంటే బాగుండదని సిక్కు సంఘం వార్నింగ్

భారత వాతావరణ శాఖ ప్రకారం శుక్రవారం బల్లియాలో గరిష్ఠ ఉష్ణోగ్రత 42.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది సాధారణం కంటే 4.7 డిగ్రీలు ఎక్కువ. పాట్నా, నలందా పట్టణాల్లో ఎండవేడిమితో ఎక్కువమంది మరణించారు. బీహార్ రాజధాని పాట్నాలో గరిష్ఠంగా 44.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. షేక్‌పురాలో 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో అత్యంత వేడిగా ఉంది. ఎండల ధాటితో పాట్నాలో జూన్ 24 వతేదీ వరకు పాఠశాలలు మూసివేశారు.

konda Murali : వరంగల్‌లో కంపెనీలు పెడతానని భూములు తీసుకున్నారు, ఏడేళ్లు అయినా అతీగతీ లేదు : కొండా మురళీ

రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా విద్యా సంస్థలను మూసివేయాలని ఆదేశించారు. జూన్ 18, 19 తేదీల్లో బీహార్ రాష్ట్రానికి వేడిగాలుల హెచ్చరికను ఐఎండీ జారీ చేసింది. ఔరంగాబాద్, రోహ్తాస్, భోజ్‌పూర్, బక్సర్, కైమూర్, అర్వాల్. పాట్నా, బెగుసరాయ్, ఖగారియా, నలంద, బంకా, షేక్‌పురా, జాముయి రెడ్ అలర్ట్ ప్రభావిత జిల్లాలుగా ప్రకటించారు.