Fragments Of Rocket: రైతు పొలంలో పడ్డ రాకెట్ శకలాలు.. ఆస్ట్రేలియా స్పేస్ ఏజెన్సీ ఏం చేసిదంటే..

మిక్ మైనర్స్ అనే రైతు న్యూ సౌత్ వేల్స్ సమీపంలోని గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఓ రోజు అతను తన పొలానికి వెళ్లి చూడగా పొడువాటి చెట్టు వలే భూమిలో పాతుకుపోయిఉన్న నల్లటి వస్తువును చూశాడు.

Fragments Of Rocket: రైతు పొలంలో పడ్డ రాకెట్ శకలాలు.. ఆస్ట్రేలియా స్పేస్ ఏజెన్సీ ఏం చేసిదంటే..

Fragments of rockets

Fragments Of Rocket: మిక్ మైనర్స్ అనే రైతు న్యూ సౌత్ వేల్స్ సమీపంలోని గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఓ రోజు అతను తన పొలానికి వెళ్లి చూడగా పొడువాటి చెట్టు వలే భూమిలో పాతుకుపోయిఉన్న నల్లటి వస్తువును చూశాడు. ఏమై ఉంటుందా అని పరిశీలించేందుకు దగ్గరకు వెళ్తున్న క్రమంలోనే దానికి కొద్దిదూరంలోనే మరో రెండు నల్లటి వస్తువులు కనిపించాయి. ఆత్రుతగా వెళ్లి చూడగా విచిత్రమైన ఆకారంలో అవి కనిపించాయి. వీటిని గుర్తించేందుకు ఆస్ట్రేలియా జాతీయ యూనివర్సిటీకి చెందిన ఖగోళ-భౌతిక శాస్త్రవేత్త డాక్టర్ బ్రాడ్ టకర్‌ను పిలిపించారు.

ఈ నల్లటి వస్తువులను పరిశీలించిన బ్రాడ్ టకర్ వస్తువులు అంతరిక్షం నుంచి పడిన రాకెట్ శకలాలుగా తేల్చారు. అయితే ఈ వస్తువును ఇంత దగ్గరగా చూడటం చాలా ఉత్సాహంగా ఉందని, అంతరిక్షానికి చెందిన ఒక శిథిలం ఇలా పడిపోవడాన్ని నేనెప్పుడూ చూడలేదని అన్నారు. మాములుగా అయితే ఇలాంటి శిథిలాలు, వ్యర్థాలు సముద్రాల్లో పడతాయని.. భూమిపై అరుదుగా మాత్రమే పడతాయని ఆయన అన్నారు.

ఈ విషయాన్ని తెలుసుకున్న ఆస్ట్రేలియా స్పేస్ ఏజెన్సీ (ఏఎస్ఏ) అది.. స్పేస్ ఎక్స్ క్యాప్యూల్ శిథిలం అని తెలిపింది. అయితే ప్రస్తుత కాలంలో అంతరిక్షంలోకి రాకెట్లు విస్తృతంగా పంపిస్తున్న నేపథ్యంలో ఇలాంటి ఘటనలు సర్వసాధారణంగా మారుతున్నాయని ఏఎస్ఏ ప్రతినిధులు తెలిపారు. ఇలాంటివి కనిపిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని ఆస్ట్రేలియా స్పేస్ ఏజెన్సీ ప్రజలను కోరింది.