Russian Generals : రష్యన్‌ జనరల్స్‌పై యుక్రెయిన్ బలగాల టార్గెట్..!

Russian Generals : క్షిపణులు, మిస్సైల్స్‌తో విరుచుకుపడుతున్న రష్యాపై ఢీ అంటే ఢీ అంటోంది యుక్రెయిన్. యుక్రెయిన్‌పై దండెత్తిన పుతిన్ వ్యూహాన్నిజెలెన్‌స్కీ బలగాలు తిప్పికొడుతున్నాయి.

Russian Generals : రష్యన్‌ జనరల్స్‌పై యుక్రెయిన్ బలగాల టార్గెట్..!

Russian Generals The Ukrainians Are Killing A Lot Of Russian Generals. It Won’t Help To End The War

Russian Generals : క్షిపణులు, మిస్సైల్స్‌తో విరుచుకుపడుతున్న రష్యాపై ఢీ అంటే ఢీ అంటోంది యుక్రెయిన్. పిచ్చుకల్లాంటి యుక్రెయిన్‌ను చీల్చిచెండాడుదామనుకున్న పుతిన్ వ్యూహాన్ని జెలెన్‌స్కీ బలగాలు తిప్పికొడుతున్నాయి. రష్యన్ సైనికులు యుక్రెయిన్‌లో విధ్వంసం సృష్టించాలని చూస్తే… వారు మాత్రం రష్యా జనరళ్లను టార్గెట్‌ చేస్తున్నారు. ఇప్పటివరకు ఏడుగురు జనరల్‌ స్థాయి అధికారులను మట్టుబెట్టినట్లు యుక్రెయిన్ రక్షణశాఖ ప్రకటించింది. ఇంతకీ జనరళ్లను ఎలా టార్గెట్‌ చేస్తోంది.

యుద్ధంలో ప్రత్యర్థుల నాయకత్వంపై గురిపెట్టి నేలకూల్చడం ఎప్పటి నుంచో వస్తోన్న వ్యూహం. ఇదే ప్లాన్‌ను రష్యాపై అప్లై చేస్తోంది యుక్రెయిన్‌. దీంతో రష్యన్‌ కమాండ్‌ కంట్రోల్‌ పోస్టు వద్ద ఎవరైనా సీనియర్‌ అధికారి కనిపిస్తే మట్టుబెట్టడమే లక్ష్యంగా యుక్రెయిన్‌ దళాలు పనిచేస్తున్నాయా అన్న స్థాయిలో మాస్కో సైనిక కమాండర్లు నేలరాలుతున్నారు. తాజాగా రష్యాకు చెందిన మరో సైనిక జనరల్‌ను చంపేసినట్లు యుక్రెయిన్‌ ప్రకటించింది. రష్యా ఏడో జనరల్‌ను కోల్పోయినట్లు పశ్చిమ దేశాల సైనిక వర్గాలు వెల్లడించాయి.

49వ కంబైన్డ్‌ ఆర్మీకి చెందిన కమాండర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ యాకోవ్‌ రెజాంట్సేవ్‌ మరణించాడు. యుద్ధం మొదలైనప్పటి నుంచి మరణించిన లెఫ్టినెంట్‌ జనరల్‌ స్థాయి అధికారుల్లో రెండోవాడు. ఖేర్సన్‌లో జరిగిన పోరులో యుక్రెయిన్‌ దళాలు ఓ కమాండ్‌ పోస్టును ధ్వంసం చేశాయి. ఈ సమయంలో యాకోవ్‌ రెజాంట్సేవ్‌ మరణించాడు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ స్థాయిలో జనరళ్ల మరణాలను రష్యా ఎన్నడూ చూడలేదు. అత్యంత భయంకరంగా సాగిన చెచెన్యా యుద్ధంలో కూడా ఈ స్థాయిలో అధికారుల మరణాలు లేవు. అయితే క్రెమ్లిన్‌ మాత్రం కేవలం ఒక్క సీనియర్‌ మరణించినట్లు ప్రకటించింది.

Russian Generals The Ukrainians Are Killing A Lot Of Russian Generals. It Won’t Help To End The War (1)

Russian Generals The Ukrainians Are Killing A Lot Of Russian Generals. It Won’t Help To End The War

రష్యా దళాలు దూకుడుగా ముందుకు కదలకుండా జాప్యం చేసేందుకు.. కమాండర్లను యుక్రెయిన్‌ బలగాలు లక్ష్యంగా చేసుకొంటున్నాయి. రష్యా దళాల నైతిక స్థైర్యాన్నిదెబ్బతీస్తున్నాయి. పుతిన్‌ వంటి బలమైన నేతలు పాలించే దేశాల్లో సైనిక నాయకత్వంలోని కిందిస్థాయి అధికారులు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడానికి చాలా తక్కువ అవకాశం ఉంటుంది.

పుతిన్‌కు వారు చూపే విధేయత ఆధారంగానే సైన్యం నాయకత్వం ఎంపిక ఉంటోంది. కానీ వారి ప్రతిభ ఆధారంగా కాదు. దీనికి 2012లో సెర్గీ షోయగు రక్షణ మంత్రిగా ఎంపికే పెద్ద ఉదాహరణ. షోయగుకు సైనిక శిక్షణ లేకపోయినా.. జనరల్‌ హోదాను అనుభవిస్తున్నారు. 2008లో జార్జియా ఆక్రమణలో రష్యా ఎదురుదెబ్బలు తిన్నా.. ఆ తర్వాత సైన్యంలో అతను భారీ మార్పులు చేయలేదు.

Read Also : Russia Fires Agian Kalibr : యుక్రెయిన్‌పై రష్యా భీకరదాడి.. మరోసారి కాలిబర్‌ మిస్సైల్ ప్రయోగం