Elon Musk: నన్ను మభ్యపెట్టి సంతకం పెట్టించారు: ట్విట్టర్‭పై మస్క్ ఆరోపణ

గతేడాది కేంద్ర ప్రభుత్వం ఐటీ చట్టంలో కొన్ని మార్పులు చేసింది. అయితే ఈ నూతన చట్టాలకు అనుగుణంగా నడుచుకునేందుకు ట్విట్టర్ ఒప్పుకోలేదు. సరికదా నూతన చట్టాలు వ్యక్తుల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉన్నాయంటూ ట్విట్టర్ ఆరోపించింది. దీనిపై గతేడాది జూలైలో కర్ణాటక హైకోర్టును ట్విట్టర్ ఆశ్రయించింది. ఈ చట్టాల కారణంగా రాజకీయ నాయకులు, సమాజిక కార్యకర్తలు, జర్నలిస్టుల పోస్టులు కూడా తొలగించాల్సి వస్తోందని

Elon Musk: నన్ను మభ్యపెట్టి సంతకం పెట్టించారు: ట్విట్టర్‭పై మస్క్ ఆరోపణ

They tricked me into signing for twitter deal says musk

Elon Musk: ట్విట్టర్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుని మళ్లీ వెనక్కి తగ్గడమే కాకుండా ట్విట్టర్ అనేక ఆరోపణలు చేస్తూ వస్తోన్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తాజాగా ట్విట్టర్‭పై మరిన్ని ఆరోపణలు చేశారు. వాస్తవాలను దాచి తనను మభ్యపెట్టి ట్విట్టర్ కోనుగోలుకు తనతో సంతకం చేయించారంటూ మస్క్ వ్యాఖ్యానించారు. అలాగే భారత ప్రభుత్వంతో ట్విట్టర్ ఎదుర్కొంటున్న న్యాయపరమైన వివాదాన్ని కూడా మస్క్ ప్రస్తావించారు. కొనుగోలు రద్దు కావడంతో మస్క్‭పై డెలావర్ కోర్టులో ట్విట్టర్ దావా వేసింది. అయితే దీనిపై ఇటీవల మస్క్ కౌంటర్ దావా వేశారు. ఆ పిటిషన్‮‭లో మస్క్ పై విధంగా పేర్కొన్నారు.

‘‘భారత ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన చట్టాలను పాటించుకుండా ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్విట్టర్ కోర్టుకు వెళ్లింది. దీంతో ట్విట్టర్‭లో అతిపెద్ద మార్కెట్‭లలో ఒకటి ప్రమాదంలో పడింది. ఈ ప్రమాదకర వ్యాజ్యం గురించి ఒప్పందంలో పేర్కొనలేదు’’ అని తన పిటిషన్‭లో మస్క్ పేర్కొన్నారు. దీనికి ముందు నకిలీ ఖాతాల గురించి వివరాలు ఇవ్వడంలో ట్విట్టర్ ఫివలం అవ్వడంతోనే ఒప్పందం రద్దు చేసుకున్నట్లు మస్క్ తెలిపారు. అయితే ఒప్పందం నుంచి తప్పుకోవడానికే మస్క్ ఇవన్ని కుంటిసాకులు చెబుతున్నారని ట్విట్టర్ మండిపడుతోంది.

గతేడాది కేంద్ర ప్రభుత్వం ఐటీ చట్టంలో కొన్ని మార్పులు చేసింది. అయితే ఈ నూతన చట్టాలకు అనుగుణంగా నడుచుకునేందుకు ట్విట్టర్ ఒప్పుకోలేదు. సరికదా నూతన చట్టాలు వ్యక్తుల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉన్నాయంటూ ట్విట్టర్ ఆరోపించింది. దీనిపై గతేడాది జూలైలో కర్ణాటక హైకోర్టును ట్విట్టర్ ఆశ్రయించింది. ఈ చట్టాల కారణంగా రాజకీయ నాయకులు, సమాజిక కార్యకర్తలు, జర్నలిస్టుల పోస్టులు కూడా తొలగించాల్సి వస్తోందని ఇలా అయితే భారత్‭లో తాము వ్యాపారం చేయలేమని కోర్టులో వేసిన పిటిషన్‭లో ట్విట్టర్ పేర్కొంది. ఈ విషయమై స్పందించాలని కేంద్ర ప్రభుత్వానికి కోర్టు నోటీసులు పంపింది.