ఈ న‌వారు మంచం రేటు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

ఓ సాధారణ నవారు మంచం ఖరీదు షాక్ కలిగిస్తోంది. ఆన్ లైన్ లో అమ్మకానికి పెట్టిన ఓ నవారు మంచం ఏకంగా భారీ రేటుకు అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఇంతకీ ఈ మంచం ఖరీదు ఎంతంటే..

ఈ న‌వారు మంచం రేటు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Vintage Indian Daybed Cost Rs.41 Thousand

Vintage Indian Daybed cost Rs.41 thousand : రోజంతా అలసిపోయి విశ్రాంతి కోసం నిద్రించే మంచాల్లో చాలా రకాలున్నాయి. మడత మంచం, పందిరి మంచం,నులక మంచం, చెక్క మంచం, సన్ గ్రాస్ మంచం, నవారు మంచం. ఈరోజుల్లో చాలా రకలా మంచాలు వస్తున్నాయనుకోండి మార్కెట్ లోకి..వీటిలో పందిరి మంచాలు ఎంత అందమో వాటిని పెట్టుకోవటానికి అంత ప్లేసు ఉండాలి. అదే మడత మంచం అయితే పడుకున్నాక లేచి మడత పెట్టేయొచ్చు. అదే నులక మంచం అయితే పైకిలేపి గోడకు పెట్టేయ వచ్చు. అలాగే నవారు మంచం కూడా. నవారు మంచంమీద పడుకుంటే ఎంత సుఖమో..నవారు బద్దెల లోంచి కిందకు వేళ్లు చేతులు పెట్టి ఆడుకునే చిన్ననాటి రోజులు గుర్తుకొస్తాయి.

ఇంతకీ ఈ మంచాల కథ ఏంటిరా బాబూ అనుకుంటున్నారా? మంచం మీద పడుకుని. వీటిలో నవారు మంచం ఖరీదు ఎంతుంటుంది? మహా ఓ రూ.1000 లేదా ఇంకో రూ.500లు ఉంటుందేమో. కానీ ‘ANNABELLE’S’ ఓ ఈ కామ‌ర్స్ సైట్‌లో ఓ మంచానికి ఎంత ధ‌ర తెలిస్తే మాత్రం ఓరినాయనో దీని బదులు డబుల్ కాట్ కొనేసుకోవచ్చు అనుకోవాల్సిందే. ఓ సాధారణ నవారు మంచం ఖరీదు ఏకంగా 41 వేల రూపాయ‌లు. ఏంటీ షాక్ అయ్యారా? నిజమే మరి ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా..న్యూజిలాండ్ కరెన్సీలో దీని ధర $ 800.00 నిర్ణయించగా భారత కరెన్సీలో అది 41,211.85 గా నిర్ణయించారు. (41,211.85..ఈ విలువు ఇండియా కరెన్సీలో ఆయా రోజును బట్టి ఈ ఎమౌంట్ మారొచ్చు)

‘Vintage Indian Daybed’ పేరుతో న్యూజిలాండ్‌కు చెందిన ఈ కామర్స్ వెబ్‌సైట్‌లో ఈ మంచం అమ్మకానికి కనిపించింది. రూ.1000 లేదా రూ.1500లకు దొరికే ఈ మంచం ఇంత రేటా?అని ఆశ్చర్యపోవాల్సి వస్తోంది.కానీ ఈ మార్కెట్స్ లో మనం రోజువారి పెద్దగా పట్టించుకోని వస్తువులు కూడా భారీ ధరలకు పెట్టటం మనకు షాకింగ్ గా అనిపిస్తుంది. అటువంటిదే ఈ నవారు మంచం కూడా.

సాధార‌ణంగా గ్రామాల్లో అన్నిఇళ్ల‌ల్లోను నవారు మంచాలు ఉంటాయి. నవారు మంచం లేదని ఇల్లు ఉండదు అంటే ఆశ్చర్యపోనక్కరలేదు. ప‌ల్లెటూళ్ల‌లో న‌వారు మంచాలు సర్వసాధారణమే. పొలం వెళ్లిన ఇంటియజమాని అయినా..ఇంటిపనులు చేసిన అలసిపోయిన ఇల్లాలు అయినా కాసేపు అలా నవారు మీద ఒరిగితే చాలు రిలాక్స్ అయిపోతారు.

ఊళ్ల‌లో న‌వారు మంచం అల్లేయటం ఇల్లాళ్లకు వెన్నతో పెట్టిన విద్య. జడ అల్లినంత ఈజీగా నవారు మంచం అల్లేస్తారు. దీనికోసం వేల‌కు వేలు పోయాల్సిన ప‌ని ఉండ‌దు. చీప్ అండ్ బెస్ట్‌లో దొరికే మంచం ఇది. అందుకే.. దీనికి ఊళ్ల‌లో అంత క్రేజ్. ఏది ఏమైనా ఆన్ లైన్ లో ఈ మంచం గురించి విన్నాక చిన్నప్పుడు నవారు మంచం మీద పడుకునో..లేదా నవారు మంచం మీద పడుకున్నవారిని కిందనుంచి చేత్తో గుచ్చిన తీపి జ్ఞాపకాలు గుర్తుకొస్తుంటాయి కదూ..ఏది ఏమైనా నవారు మంచం మీద పడుకుంటే ఈ సుఖమే వేరప్పా అనిపిస్తుంది కదూ..