covid-19 కారణంగా వచ్చే ప్రొటీన్ శరీరంలో బ్లడ్ క్లాట్ తీసుకురావొచ్చు

covid-19 కారణంగా వచ్చే ప్రొటీన్ శరీరంలో బ్లడ్ క్లాట్ తీసుకురావొచ్చు

Covid-19 కారణంగా మీ శరీరంలో ఓ రకమైన ప్రొటీన్ నిక్షిప్తమై ఉంటే మీకు బ్లడ్ క్లాటింగ్ సమస్య రావొచ్చని రీసెర్చర్స్ అంటున్నారు. కెంట్ యూనివర్సిటీ టీం చేసిన రీసెర్చ్ లో ఈ విషయం బయటపడింది. SARS-CoV2 వైరస్ కారణంగానే కొవిడ్ 19 వస్తుంది. దీనిని ఇప్పటికీ కొందరు లక్షణాలు బయటపడకపోవడంతో ఇన్ఫెక్షన్ కు గురైనప్పటికీ గుర్తించలేకపోతున్నారు. ప్రాణాంతకమైన వ్యాధి అని ఇతరులు బాధపడుతున్నా తెలుసుకోలేకపోతున్నారు.



COVID-19కారణంగా వయస్సుతో పాటు మరిన్ని రిస్క్‌లు రావొచ్చని.. ఆడాళ్ల కంటే మగాళ్లలో ఇవి ఎక్కువగా ఉండొచ్చని వైద్యులు చెబుతున్నారు. COVID-19 కారణంగా బ్లడ్ క్లాటింగ్ పెరిగి థ్రాంబోసిస్ ఫార్మేషన్ పెరిగేలా చేస్తుంది. ఈ స్టడీలో మనుషుల్లో జీన్స్… కణాల స్వభావంపై రీసెర్చ్ నిర్వహించారు. కొవిడ్ 19 కారణంగా ఇన్ఫెక్ట్ అయిన కణాలు ఆడాళ్లు, మగాళ్ల మధ్యలో వ్యత్యాసాలు, వయస్సుతో పాటు మారే స్వభావం గురించి రీసెర్చ్ నిర్వహించారు.

200మంది కంటే ఎక్కువ మందిలో గ్లైకొప్రొటీన్ ను గుర్తించారు. దానిని ట్రాన్సఫెరిన్ అని పిలుస్తారట. ఈ కారణంగానే బ్లడ్ క్లాటింగ్ అవుతుందని.. వయస్సుతో పాటు ఈ సమస్య పెరుగుతుందని.. మహిళల్లో కంటే మగాళ్లలోనే ఈ సమస్య ఎక్కువగా ఉంటుందని గుర్తించినట్లు చెప్పారు.



శరీరంలో ఉండే గ్లైకో ప్రోటీన్లకు షుగర్ కూడా యాడ్ అయి ఉంటుంది. అవి శరీరంలో చాలా కీలక బాధ్యతలను నెరవేరుస్తాయి. తద్వారా శరీరంలో ఇమ్యూనిటీని పెంచుకోవడం, అరుగుదలకు, రీ ప్రొడక్టివ్ సిస్టమ్స్ కు ఇవి బాగా ఉపయోగపడతాయి. ట్రాన్సఫరిన్ లో పొటెన్షియల్ ఉండి కొవిడ్ 19 పేషెంట్లలో చాలా సమస్యలను త్వరగా గుర్తించే బయోమార్కర్ గా పనిచేస్తుందని గుర్తుచేశారు.