Animals Covid Vaccine : మనుషులకే కాదు జంతువులకూ కరోనా టీకా.. ఆ జూలోని పులులు, సింహాలకు వ్యాక్సిన్లు

Animals Covid Vaccine : మనుషులకే కాదు జంతువులకూ కరోనా టీకా.. ఆ జూలోని పులులు, సింహాలకు వ్యాక్సిన్లు

Animals Covid Vaccine

Animals Covid Vaccine : కరోనావైరస్ మహమ్మారికి కట్టడి చేయాలంటే ఏకైక మార్గం వ్యాక్సినేషన్ అని నిపుణులు తేల్చారు. దీంతో అన్ని దేశాలకు ప్రజలందరికి టీకాలు ఇచ్చే కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నాయి. రోజూ లక్షల మందికి టీకాలు ఇస్తున్నాయి. మనుషుల సంగతి పక్కన పెడితే.. మరి జంతువుల సంగతి ఏంటి? వాటిని కరోనా బారిన నుంచి కాపాడాలంటే వాటికి కూడా టీకాలు ఇవ్వాల్సిందేనా? అంటే, అవుననే అంటున్నారు నిపుణులు.

అగ్రదేశం అమెరికాలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా జరుగుతోంది. తాజాగా అక్కడ జంతువులకు కూడా కరోనా టీకాలను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ వ్యాక్సిన్ ఆ దేశంలోని ఒక్లాండో జూలో ఉన్న జంతువులకు వేశారు. పులులు, సింహాలు, ఎలుగుబంట్లకు వ్యాక్సిన్ వేసినట్టు అక్కడ వైద్య సేవలు అందించే డాక్టర్ హర్మాన్ తెలిపారు.

జూలో ఉన్న జంతువులకు వాటి రోగ నిరోధకశక్తి ఆధారంగా ఎంపిక చేసి, దాని ప్రకారం టీకాలను ఇస్తున్నట్టు డాక్టర్ వెల్లడించారు. జంతువుల కోసం జోటీస్ అనే సంస్థ ప్రత్యేకంగా వ్యాక్సిన్ ను రూపొందించిందని చెప్పారు. తొలి విడతలో తమ జూ 100 డోసుల వ్యాక్సిన్ అందుకుందని తెలిపారు. జోటీస్ సంస్థ ఇప్పటి వరకు 70 జూలకు 11 వేల డోసుల వ్యాక్సిన్లను సరఫరా చేసిందని చెప్పారు. తమ జూలో ఒక్క జంతువు కూడా కరోనా బారిన పడలేదని… అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా వాటికి వ్యాక్సిన్లు ఇస్తున్నామని తెలిపారు.