గొంతులో చిప్స్ ఇరుక్కుని చిన్నారి మృతి

  • Published By: madhu ,Published On : March 12, 2020 / 08:09 AM IST
గొంతులో చిప్స్ ఇరుక్కుని చిన్నారి మృతి

చిప్ప్..ఓ చిన్నారి ప్రాణం తీసింది. అప్పటిదాక..ఆడుతూ..పాడుతూ..సరదగా గడిపిన ఆ చిన్నారి విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. చిప్స్ ఎంత పనిచేసిందంటూ..తలబాదుకుంటున్నారు. చిప్స్ గొంతులో ఇరుక్కపోవడం..శ్వాస తీసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడిన ఆ చిన్నారి…ప్రాణం గాలిలో కలిసిపోయింది. ఈ విషాద ఘటన రాస్ అల్ ఖైమాలో చోటు చేసుకుంది.

14 నెలల చిన్నారి..చిప్స్ తింటోంది. అకస్మాత్తుగా..ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందులు పడుతోంది. వెంటనే తల్లిదండ్రులు గమనించారు. చిన్నారిని తలకిందులు చేశారు. చిప్స్ బయటకు తీసేందుకు ప్రయత్నించారు. చెంపల మీద కొట్టారు. అయినా..చిన్నారి గొంతులో ఇరుక్కున్న చిప్స్ మాత్రం బయటకు రాలేదు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చిన్నారిని కాపాడేందుకు శతవిధాల ప్రయత్నించారు. అప్పటికే శ్వాసనాళం మూసుకపోవడం, మెదడుకు ఆక్సిజన్ అందకపోవడంతో..చిన్నారి శరీరం నీలంగా మారిపోయింది.

ఇక చిన్నారి లేదని వైద్యులు వెల్లడించారు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటన అక్కడున్న వారిని కలిచివేసింది.  ఇదే తరహాలో…రెండేళ్ల బాలుడు ద్రాక్ష పండు ఇరుక్కుని చనిపోయిన ఘటన కూడా రాస్ అల్ ఖైమాలో 2018లో చోటు చేసుకుంది. వారికి ఏమీ తెలియని వయస్సులో ఉంటారు కనుక..నిర్లక్ష్యంగా వదిలివేయవద్దని వైద్యులు తల్లిదండ్రులకు సూచించారు. ఏ మాత్రం ఎమరుపాటుగా ఉంటే..చాలా ఇబ్బందులు తలెత్తె ప్రమాదం ఉందని..వైద్యులు హెచ్చరించారు. 

Read More : గుడ్ న్యూస్ : లాభాల్లో తెలంగాణ ఆర్టీసీ