Viral News: అమ్మ ఫోన్ తో ఆడుకుంటూ రూ.1.50 లక్షల షాపింగ్ చేసిన బుడతడు

ఆడుకునేందుకు అమ్మ ఫోన్ తీసుకున్న ఓ బుడతడు.. ఆన్ లైన్ షాపింగ్ ద్వారా రూ.1.50 లక్షల విలువైన వస్తువులను కొనుగోలు చేసిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది.

Viral News: అమ్మ ఫోన్ తో ఆడుకుంటూ రూ.1.50 లక్షల షాపింగ్ చేసిన బుడతడు

Toddler

Viral News: అమ్మ ఫోన్ తో ఆడుకుంటూ రూ.1.50 లక్షల షాపింగ్ చేసిన బుడతడు

చిన్న పిల్లలకు స్మార్ట్ ఫోన్లు అలవాటు చేసే ముందు.. ప్రతి తల్లిదండ్రులు జాగ్రత్త పడాల్సిన సంఘటన ఇది. మాటలు కూడా రాని చిన్నారులకు ఫోన్ అందిస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో తెలిపే ఘటన ఇది. ఆడుకునేందుకు అమ్మ ఫోన్ తీసుకున్న ఓ బుడతడు.. ఆన్ లైన్ షాపింగ్ ద్వారా రూ.1.50 లక్షల విలువైన వస్తువులను కొనుగోలు చేసిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. అమెరికాలోని న్యూజెర్సీలో నివసిస్తున్న ప్రవాస భారతీయులు.. ప్రమోద్ కుమార్, మధుమతి కుమార్ దంపతులు, తమ రెండేళ్ల కుమారుడి వల్ల ఒక విచిత్ర పరిస్థితి ఎదుర్కొన్నారు. న్యూజెర్సీలో ఉంటున్న ప్రమోద్ కుమార్ కుటుంబం ఇటీవల ఇల్లు మారారు.

Also Read: Sanitary Napkins: అబ్బాయిలకు శానిటరీ న్యాప్‌కిన్స్? బీహార్ స్కూల్లో వెలుగులోకి ఘటన

కొత్త ఇంటిలోకి అవసరమైన గృహోపకారణాలను కొనేందుకు మధుమతి కుమార్.. ఆన్‌లైన్‌ యాప్ ద్వారా కావాల్సిన వస్తువులను వెతికి.. కార్ట్ లోకి యాడ్ చేసి పెట్టుకుంది. పనులన్నీ చక్కబెట్టుకుని తీరిగ్గా కావాల్సిన వస్తువులను కొనుక్కోవచ్చులే.. అనుకుని ఫోన్ పక్కన పడేసింది. అయితే తాను ఆన్‌లైన్‌ కార్ట్ లో యాడ్ చేసిపెట్టిన ఒక్కో వస్తువు.. ఇంటికి చేరుకుంటుండడంతో ఆశ్చర్యపోయిన మధు కుమార్.. ఒక వేళా తన భర్త ప్రమోద్ ఆర్డర్ చేసి ఉంటాడేమోనని అడిగింది. తానేమి ఆర్డర్ చేయలేదని ప్రమోద్ బదులివ్వడంతో తన ఇద్దరు పిల్లలను అడిగింది. వారు కూడా ఏమి ఆర్డర్ చేయలేదని చెప్పడంతో.. ఇక ఇది తమ రెండేళ్ల కుమారుడు ఆయాన్ష్ కుమార్ పనే అయివుంటుందని గ్రహించారు.

Also Read: Samantha : మరోసారి ఐటెం సాంగ్ చేయబోతున్న సమంత??

ఇంటికి చేరుకున్న వస్తువులను వెనక్కు ఇచ్చేందుకు సదరు సంస్థకు ఫోన్ చేయగా, విషయాన్ని గ్రహించిన వారు.. వస్తువులన్నీ తీసుకుని పూర్తి డబ్బు వాపసు చేస్తామని హామీ ఇచ్చారట. అయితే తమ ముద్దుల కొడుకు తెలిసీతెలియక చేసిన చిలిపి పనికి గుర్తుగా కొన్ని వస్తువులను ఉంచుకుని మిగతా వాటిని రిటర్న్ చేస్తామని ప్రమోద్ కుమార్ దంపతులు చెప్పుకొచ్చారు. ఇకపై ఫోన్ తెరుచుకోకుండా లాక్ చేస్తామని ప్రమోద్ కుమార్ చెప్పుకొచ్చారు. ఇక ఈవార్త సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్లు స్పందిస్తూ తల్లిదండ్రులు తమ పిల్లలు ఏమి చేస్తున్నారో ఓ కంట కనిపెడుతూ ఉండాలని కామెంట్స్ చేస్తున్నారు.