కీబోర్డు చెక్ చేశారా? : వాట్సాప్‌లో ‘ట్రాన్స్‌జెండర్’ ఎమోజీలు

కీబోర్డు చెక్ చేశారా? : వాట్సాప్‌లో ‘ట్రాన్స్‌జెండర్’ ఎమోజీలు

సోషల్ మీడియాలో ఎమోజీలది ప్రత్యేక స్థానం. మనం ఎదుటివారికి చెప్పాలనుకునే భావాలను (ఎక్స్ ప్రెషన్స్) వీటిద్వారా తెలియజేస్తుంటాం.

కీబోర్డు చెక్ చేశారా? : వాట్సాప్‌లో ‘ట్రాన్స్‌జెండర్’ ఎమోజీలు

సోషల్ మీడియాలో ఎమోజీలది ప్రత్యేక స్థానం. మనం ఎదుటివారికి చెప్పాలనుకునే భావాలను (ఎక్స్ ప్రెషన్స్) వీటిద్వారా తెలియజేస్తుంటాం.

ఎమోజీలు!!  మన భావాలను వీటి ద్వారానే మొబైల్స్ లో వ్యక్తం పరుస్తుంటాం.. సోషల్ మీడియాలో ఎమోజీలది ప్రత్యేక స్థానం. మనం ఎదుటివారికి చెప్పాలనుకునే భావాలను (ఎక్స్ ప్రెషన్స్) వీటిద్వారా తెలియజేస్తుంటాం. ముఖ్యంగా వాట్సాప్ లో ఎమోజీల హవా మామూలుగా ఉండదు.. ఏడ్చినా.. నవ్వినా.. కోపగించుకున్నా..నిద్రపోతున్నా.. లేజీగా ఉన్నా ఇలా ఏ భావమైనా సరే ఓ ఎమోజీని చిటుక్కుమని నొక్కేసి పంపించేస్తుంటారు. వీటిలో మేల్ (పురుషులు) ఫిమేల్ (స్త్రీలు) మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు ట్రాన్స్ జెండర్స్ (థర్డ్ జెండర్స్)  ఎమోజీలు కూడా వస్తున్నాయి. 
Read Also : పేటీఎం-గూగుల్ పే తరహాలో : జియోమీ ‘MI Pay’ వచ్చేసింది

ఫేస్‌బుక్‌కు చెందిన ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన ప్లాట్‌ఫామ్‌‌లో పలు మార్పులను తీసుకొస్తోంది. దీంట్లో భాగంగానే ట్రాన్స్‌జెండర్ ఎమోజీలను కూడా తీసుకువచ్చేందుకు వాట్సాప్ గత ఫిబ్రవరి నెలలో తన ప్లాట్‌ఫామ్‌కు ఒక సీక్రెట్ ట్రిక్‌ను జత చేసింది. దీంతో చాట్ చేసేటప్పుడు ట్రాన్స్‌జెంటర్ ప్రైడ్ ఎమోజీని పంపొచ్చు. ఈ ఫీచర్ కేవలం వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండేది. 

ఇప్పుడు ట్రాన్స్‌జెండర్ ఎమోజీలు వాట్సాప్ కీబోర్డులోకి కూడా  వచ్చేశాయి. కీబోర్డులో కనిపించే ఎమోజీలపై క్లిక్ చేయడం ద్వారా వాటిని ఎవరికైనా పంపించాలనుకుంటే పంపొచ్చు.  2.19.73 ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌ యూజర్లందరూ ఈ ఫీచర్‌కు అందుబాటులోకి వచ్చేసింది. మెయిన్ వెర్షన్ వాట్సాప్ ఉపయోగించే యూజర్లు వీటి కోసం మరికొన్ని రోజులు ఆగాల్సిందేనట. 

Read Also : అదిరిపోయే ఫీచర్లు : జియోమీ Redmi Go సేల్ .. ధర ఎంతంటే?

×