మందుబాబు తెలివి : కారులో మంటలు..బీరుపోసి ఆర్పేశాడు

  • Published By: veegamteam ,Published On : September 29, 2019 / 06:06 AM IST
మందుబాబు తెలివి : కారులో మంటలు..బీరుపోసి ఆర్పేశాడు

అనుకోకుండా ప్రమాదం జరిగినప్పుడు మైండ్ అంతా బ్లాంక్ అయిపోతుంది. ఏంచేయాలో అస్సలు తోచదు. కానీ ఓ మందుబాబు మాత్రం ప్రమాదం నుంచి చక్కగా తప్పించుకున్నాడు.అదికూడా ఏమాత్రం కంగారు పడకుండా తాపీగా ఎస్కేప్ అయ్యాడు. ఇంతకీ ఆ మందుబాబు తెలివితేటలు ఏంటి? వచ్చిన ప్రమాదం ఏంటో తెలుసుకుందాం..

అది జర్మనీలోని బవేరియా రాష్ట్రంలోని హెస్బాచ్ సిటీ. ఓ వ్యక్తి బీరు బాటిల్స్ కొనుక్కున్నాడు. వాటిని కారులో పెట్టుకుని వెళ్తున్నాడు. ఆ సమయంలో సడెన్ గా కారు ఇంజన్ లో మంటలు చెలరేగాయి. ఆ మంటలు చూసి అతను ఏమాత్రం భయపడలేదు. కనీసం కంగారు కూడా పడలేదు. తాపీగా కారులో ఉన్న బీరు బాటిల్స్ తీసుకుని కారు దిగాడు. బాటిల్స్ ఓపెన్ చేసి మంటలపై బీరు పోశాడు. మంటలు ఆరిపోయాయి. 

అదేంటి మద్యం పోస్తే మంటలు పెరుగుతాయి కానీ ఆరిపోవటమేంటి అనే డౌట్ మీకు వచ్చే ఉంటుంది. ఆ..వచ్చింది కదూ. సదరు వ్యక్తి కారులో మంటలు వచ్చిన సమయంలో అక్కడే ఉన్న పోలీసులు ఈ విషయాన్ని గమనించాడు. ఫైర్ ఇంజన్ కు ఫోన్ చేయగా వారు వచ్చేసరికే సదరు వ్యక్తి బీరు పోసి మంటల్ని ఆర్పేసాడని పోలీసులు డీపీఏ వార్తా సంస్థకు తెలిపారు. అదే విషయాన్ని డీపీఏ వెల్లడించింది. 

కారులో ఉన్న బీరును మంటలపై పోయటం..క్షణాల్లో మంటల్ని ఆర్పేసిన సదరు మందుబాబు తెలివితేటల్ని నెటిజనులు తెగ పొగిడేస్తున్నారు. కాగా..ఇతర ఆల్కహాల్‌తో పోలిస్తే బీరులో 90 నుంచి 95 వరకు శాతం నీరు ఉంటుంది. అందుకే, ఆ మంటలు ఈజీగా  ఆరిపోయాయి. ఏది ఏమైనా ప్రమాదం జరిగినప్పుడు భయపడకుండా..వెంటనే స్పందించిన  మందుబాబు తెలివికి అందరూ ఆశ్చర్యపోతున్నారు.