మోడీ ముచ్చట పడి పెట్టిన వెజ్ వంటకాలు ట్రంప్ ముట్టనేలేదు!

  • Published By: sreehari ,Published On : February 25, 2020 / 04:15 PM IST
మోడీ ముచ్చట పడి పెట్టిన వెజ్ వంటకాలు ట్రంప్ ముట్టనేలేదు!

రాకరాక భారత్ వచ్చిన ఆప్త మిత్రుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోసం ప్రధాని నరేంద్ర మోడీ ముచ్చటపడి వడ్డించిన వెజ్ వంటకాలు ఒకటి కూడా ట్రంప్ దంపతులు ముట్టలేదట. కానీ, ట్రంప్ కోసం ప్రత్యేకమైన వంటకాలను సిద్ధం చేశారు. ట్రంప్ నచ్చిన మాంసాహారం లేకపోయినా అంతకంటే ఎక్కువగానే ట్రంప్ ఇష్టపడేలా వెరైటీ వెజ్ ఫుడ్ ఐటమ్స్ వడ్డించారు. ఏర్పాటు చేసిన ఫుడ్ మెనూలో స్పెషల్ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే ఉండటంతో ట్రంప్ పరివారంలో ఎవరూ ఒక్క వెజ్ ఐటమ్ కూడా తినలేదని విశ్వసనీయ సమాచారం. వెజ్ ఐటమ్స్ లో సింగిల్ ఐటమ్ కూడా ట్రంప్ ముట్టలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ట్రంప్ కోసం ప్రత్యేకమైన వంటకాలు :
అసలే ట్రంప్ మాంసాహార ప్రియులు.. తాను ఎక్కడికి వెళ్లినా తప్పనిసరిగా తన ఫుడ్ మెనూలో మాంసాహారం ఉండాల్సిందే. అది లేకుండా ఆయనకు ముద్ద దిగదు. గతంలో ఆయన పర్యటించిన పలు దేశాల్లో కూడా ప్రత్యేకించి ఆయన కోసం ఇష్టమైన వంటకాలను సిద్ధం చేసేవారట. ఇప్పుడు ట్రంప్.. రాకరాక భారత్ పర్యటనకు వచ్చారు. అందులోనూ తన ఆప్తమిత్రుడైన మిత్రుడు మోడీ ఆహ్వానం కావడంతో కుటుంబ సమేతంగా ట్రంప్ ఇండియాను సందర్శించారు. ట్రంప్ భారత్ వచ్చినప్పటి నుంచి ఆయనకు ఇష్టమైన ఫుడ్ మెనూ ఏమి ఉంటుందా? అనే చర్చనీయాంశమైంది. కానీ, భారత పర్యటనలో ట్రంప్ పరివారానికి అందించిన విందులో నాన్ వేజ్ ఐటమ్ లేదంట.

ఆశ్రమంలో ఏ వెజ్ ఐటమ్ ముట్టలేదట :
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఆయన సతీమణి మెలానియా ట్రంప్ కలిసి అహ్మదాబాద్ లోని గాంధీ ఆశ్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ట్రంప్ దంపతులకు ప్రత్యేకమైన విందును ఏర్పాటు చేశారు. మాంసాహారాన్ని ఇష్టంగా తినే అధ్యక్షుడి కోసం పాపులర్ అవార్డ్ విజేత చెఫ్ సురేశ్ ఖన్నా ప్రత్యేకమైన భారతీయ వంటకాలను సిద్ధం చేశారు. చాకొలేట్ చిప్ కుకీస్, ఆపిల్ పై వంటి ఎన్నో వెరైటీ ఐటమ్స్ సిద్ధంగా ఉంచారు.

కానీ, ఈ విందులో ట్రంప్ కానీ ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ కూడా ప్రత్యేకమైన టీ మెనూలో ఏ ఒక్కటి కూడా ముట్టుకోలేదని సమాచారం. ‘సబర్మతి ఆశ్రమంలో ట్రంప్ పరివారం కోసం కొన్ని ఆహార వంటకాలను ఏర్పాటు చేశారు. అయితే ట్రంప్ లేదా ఆయన సతీమణి సహా ఎవరూ ఏమి తినలేదు’ అని ఆశ్రమంలోని ట్రస్టీల్లో ఒకరైన కార్తీకేయ సారాభాయ్ పిటీఐకి తెలిపారు.

సాధారణంగా ట్రంప్.. అమెరికన్ డైట్ అంటే ఎంతో ఇష్టం. చీజ్ బర్గర్లు, డైట్ కోక్, స్టీక్, ఐస్ క్రీం సహా ఫేవరేట్ వంటకాలను ఇష్టంగా తింటారు. మరి.. అలాంటి ట్రంప్.. రెండు రోజుల పాటు భారత్ లో ఎలా సందర్శిస్తారని విమర్శకులు ఆశ్యర్యపోతున్నారు. భారత్‌లో బిలియన్ల మందికిపైగా హిందువులు ఉండగా, 500 మిలియన్ల మంది శాకాహారులే ఉన్నారు. ట్రంప్ కోసం వడ్డించిన సమోసాలను #BroccoliSamosa కూడా ఆయన ముట్టలేదని అహ్మదాబాద్ స్థానిక పత్రిక ఎడిటర్ దీపాల్ త్రివేది ట్వీట్ చేశారు.