టర్కీలో కరువు తాండవం : మరో 45రోజుల్లో ఎడారిగా మారబోతున్న ఇస్తాంబుల్!

టర్కీలో కరువు తాండవం : మరో 45రోజుల్లో ఎడారిగా మారబోతున్న ఇస్తాంబుల్!

Turkey drought-Istanbul could run out of water in 45 days : టర్కీలో కరువు తాండవిస్తోంది.. భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఎప్పుడూ నీటితో కళకళలాడే ఇస్తాంబుల్ ఎడారిలా మారబోతోంది. రాబోయే 45 రోజుల్లోగా నీళ్లు లేక నదులు, జలాశయాలన్నీ ఎండిపోతున్నాయి. డ్యామ్ లు సైతం నీటిమట్టం తగ్గిపోయి అడుగంటిపోతున్నాయి. ప్రధానంగా టర్కీలోని ప్రధాన నగరాల్లో వచ్చే కొన్ని నెలల్లో నీళ్లు ఎండిపోయి ఎడారిని తలపించనున్నాయి.

ఎందుకు టర్కీలో ఇంతగా కరువు సంభవించడానికి కారణం ఏంటి? అతి తక్కువ వర్షపాతమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. దశబ్ద కాలంలో తీవ్ర కరువుకు దారితీసింది. ఫలితంగా 17 మిలియన్ల మంది టర్కీ ప్రజలు నీటి కొరతను ఎదుర్కోనున్నారు. జనవరి నెల నుంచి మరో 110 రోజుల్లో అనేక డ్యాములు, రిజర్వాయర్లలో కూడా నీళ్లు ఎండిపోయే పరిస్థితి ఎదురుకానుంది. ఇజ్మిర్, బ్యూర్సా అనే రెండు నగరాలు టర్కీలో అతిపెద్దవి. ఈ రెండు నగరాల్లోనే డామ్స్ 36శాతం, 24శాతం మేర నీళ్లు లేక వెలవెలబోతున్నాయి. ఇక గోధుమను ఉత్పత్తి చేసే ప్రాంతాలైన కోన్యా ప్లేన్, ఎడ్రైన్ ప్రావిన్స్ లో కూడా నీళ్లు లేక సాగు చేసే పరిస్థితి లేదు.

గ్రీస్, బుల్గారియా సరిహద్దుల్లోని ఈ ప్రాంతాలకు సాగుబడికి చేయడమే కష్టంగా మారింది. 2020 రెండవ భాగంలో వర్షపాతం చాలా తక్కువగా ఉంది. నవంబరులో సంవత్సరానికి 50శాతం వర్షపాతం కూడా నమోదు కాలేదు. గత నెలలో వర్షం కోసం వరుణున్ని ప్రార్థించాలంటూ మత వ్యవహారాల డైరెక్టరేట్ సూచించింది. నీటి డిమాండ్‌ను అదుపులో ఉంచే చర్యలకు బదులుగా మరిన్ని ఆనకట్టలను నిర్మించడం ద్వారా టర్కీ నీటి సరఫరాను విస్తరించాలని నిర్ణయించింది.

టర్కీ గత రెండు దశాబ్దాల్లో వందలాది ఆనకట్టలను నిర్మించిందని ఇస్తాంబుల్‌లోని నీటి నిర్వహణ నిపుణుడు అక్గాన్ అల్హాన్ తెలిపారు. పర్యావరణ సమస్యలపై టర్కీ చాలాకాలంగా ఆర్థిక వృద్ధికి ప్రాధాన్యతనిచ్చింది. మునిసిపాలిటీలు ఇప్పుడు నీటిని ఎలా ఆదా చేసుకోవడంలో జాగ్రత్తగా ఉండాలని  కోరింది. పళ్ళు తోముకునేటప్పుడు లేదా షేవింగ్ చేసేటప్పుడు నల్లాను ఆపివేయడం, తక్కువ వినియోగ నల్లాలను నిర్మించడం చేయాలని సూచించారు. టర్కీ నగరాలకు రాబోయే కొద్ది నెలల్లో నీటి కొరత రాకుండా ఉండాలంటే వెంటనే వర్షాలు పడటం అత్యవసరమని అంటున్నారు.