కరోనా పేషెంట్ ’ఉమ్మి‘ని రూ.5వేలకు కొన్న ఉద్యోగి..యజమాని తాగే కూల్ డ్రింకులో కలిపి మర్డర్ ప్లాన్

కరోనా పేషెంట్ ’ఉమ్మి‘ని రూ.5వేలకు కొన్న ఉద్యోగి..యజమాని తాగే కూల్ డ్రింకులో కలిపి మర్డర్ ప్లాన్

Attempted murder on boss with Corona patient Saliva : ఎవరైనా మరెవరినైనా చంపాలనుకుంటే కిరాయి గూండాల్ని పెట్టుకుంటారు. లేదంటే కత్తులు కటార్లు ఉపయోగించి చంపుతారు. కానీ ఇది కరోనా కాలం..కరోనా పేషెంటు ‘ఉమ్మి’ (saliva)నే హత్యలు చేయటానికి ఉపయోగిస్తున్నారు. అటువంటి ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ఉద్యోగి తన బాస్ నే చంపేయాలనుకున్నాడు. దాని కోసం ఏకంగా కరోనా సోకిన వ్యక్తి నుంచి ఉమ్మిని రూ.వేలకు కొన్నాడు. ఆ తర్వాత ఆ ఉమ్మిని బాస్ తాగే కూల్ డ్రింక్ లో కలిపాడు. అక్కడితో అతగాడి అరాచకం ఆగలేదు. 22 లక్షల రూపాయలతో ఉడాయించాడు. అసలు కరోనా పేషెంట్ ఉమ్మి తీసుకొచ్చిన ఇలా వినూత్నంగా మర్డర్ ప్లాన్ వేసిన అతడి సైలెంట క్రిమినల్ ఆలోచనలు మాత్రం షాక్ అయ్యేలా చేసిన ఘటన టర్కీలో జరిగింది..! మరి ఆ కూల్ డ్రింక్ ను ఆ బాస్ తాగాడా? లేదా..?!

ఆఫీసుల్లో ఉద్యోగులకు వారి బాస్ ల మీద కోసం ఉంటుంది. కానీ మరీ చంపేయాలనేంత కోపం ఉంటుందా? ప్రమోషన్లు ఇవ్వలేదనో..జీతాలు పెంచటంలేదనో ఇలా రకరకాల కోపాలుంటాయి. కానీ ఏకంగా చంపేయాలన్నంత కోపం వచ్చిన ఓ ఉద్యోగి ఏకంగా కరోనా సోకిన వ్యక్తి నుంచి ఉమ్మిని రూ.5వేలు ఇచ్చి మరీ కొన్నాడు. ఆ తర్వాత ఆ ఉమ్మిని బాస్ తాగే కూల్ డ్రింక్ లో కలిపేశాడు. ఆ తర్వాత బాస్ ఆఫీసుకు తెమ్మని ఇచ్చిన 22 లక్షల రూపాయలతో ఎస్కేప్ అయ్యాడు.

ఈ వినూత్న క్రిమినల్ మర్డర్ ప్లాన్ లోకి వెళ్తే..టర్కీలోని ఆడనా ప్రాంతంలో ఇబ్రహీం ఉన్వేర్దీ అనే వ్యక్తికి కారు డీలర్ షిప్ వ్యాపారం ఉంది. అతడి కింద రమజాన్ సైమెన్ అనే వ్యక్తి మూడేళ్లుగా పనిచేస్తున్నాడు. ఈక్రమంలో ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ..రమజాన్ సైమెన్ యజమాని ఇబ్రహీం ఉన్వేర్దీ మీదా ఆయన కుటుంబంపై కక్ష పెంచుకున్నాడు. అతడిని చంపితే కుటుంబం కూడా ఏడుస్తుందనే ఉద్ధేశ్యంతో పక్కా ప్లాన్ వేశాడు. తాను చంపినట్లుగా తెలీకూడదు. కానీ యజమాని చచ్చిపోవాలి అనుకున్నాడు.

దానికి కరోనాను ఉపయోగించాలనుకున్నాడు. అలా కరోనా సోకిన వ్యక్తి దగ్గరకెళ్లి అతని ‘ఉమ్మి’ని అడిగాడు. దానికి తను అసలు కరోనా సోకినవాళ్ల దగ్గరకు సొంత బంధువులే రావట్లేదు..నువ్వొచ్చి ఏకంగా ఉమ్మినే అడుగుతున్నావేంటీ? అని షాక్ లోనే అడిగాడు. దానికి రమజాన్ అవన్నీ నీకెందుకు? డబ్బులిస్తాను ఉమ్మిని ఇచ్చేమని అడిగాడు. అలా సేకరించిన ఉమ్మిని అతి జాగ్రత్తగా తీసుకొచ్చి బాస్ తాగే కూల్ డ్రింక్ లో కలిపేశాడు. కానీ ఇబ్రహీం ఉన్వేర్దీ మాత్రం ఆ కూల్ డ్రింక్ తాగలేదు. కారణం..ఆఫీసులో ఉన్న ఓ వ్యక్తి రమజాన్ పై అనుమానంతో బాస్ ను అప్రమత్తం చేశాడు. అతను ఇచ్చిన సమాచారంతో ఇబ్రహీం ఆ కూల్ డ్రింక్ తాగలేదు. దీంతో ప్రాణాలతో బైటపడ్డాడు.

ఈ దారుణ ఘటనపై ఇబ్రహీమ్ పోలీసులకు ఫోన్ చేశాడు. గతంలోనూ చేసిన నిర్వాకాలపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సదరు రమజాన్ కోసం గాలిస్తున్నారు. దీనిపై ఇబ్రహీం మాట్లాడుతూ..’నేను రమజాన్ ను ఎంతో నమ్మాను. ఎంత నమ్మానంటూ నా లాకర్ పాస్ వర్డ్ లు కూడా అతడికి చెప్పేంత నమ్మాను. మా కుటుంబంలో వ్యక్తిలా మెలిగేవాడు. కానీ ఇంత దారుణానికి ఒడిగడతాడని ఎప్పుడూ అనుకోలేదని వాపోయాడు. కరోనా సోకిన వ్యక్తి నుంచి ఉమ్మిని ఐదు వేల రూపాయలకు కొని దాన్ని నేను..నా భార్య తాగాలనుకునే కూల్ డ్రింక్ లో కలిపి నాకు నేను కరోనాతో చనిపోయానని నమ్మించాలనుకున్నాడు. కానీ అదృష్టం బాగుండీ మా ఆఫీసులోనే పనిచేసే ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో ప్రాణాలతో బైటపడ్డాం అని చెప్పాడు. ఈ విషయం తెలిసి నా భార్య వణికిపోయింది. పిల్లలతో కలిసి బయటకు రావాలంటేనే భయపడుతోందని తెలిపాడు.

నేను ఇటీవల నాకారును రూ.22లక్షలకు అమ్మాను. కారు అమ్మగా వచ్చిన డబ్బుల్ని రమజాన్ కు ఇచ్చి ఆఫీసుకు తీసుకురమ్మని చెప్పాను. కానీ నామీద ఇలా కరోనా పేషెంట్ ఉమ్మితో హత్యాయత్నం చేసి ఆ డబ్బులతో పరారయ్యాడు. తన డబ్బులతో రమజాన్ ఎస్కేప్ అయ్యాక నేను ఫోన్ చేశాను. కానీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. కానీ మర్నాడు నాకు ఫోన్ చేసి నాకు డబ్బులు అవసరం అనీ, వాటితో గతంలో తాను తీసుకున్న లోన్ ను తీర్చేశానని చెప్పాడు.రమజాన్ నా 22 లక్షల రూపాయలతో ఎస్కేప్ అయ్యాడు. పోలీసులు అతడిని వెంటనే అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను‘ అని ఇబ్రహీం తెలిపాడు. ఈ ఘటనపై టర్కీ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సైమెన్ కోసం గాలిస్తున్నారు.