వింతల్లోనే వింత : అప్పుడే పుట్టిన చిన్నారి కడుపులో.. మరో బేబీ

అప్పుడే పుట్టిన ఆడ శిశువు గర్భం దాల్చడం సాధ్యమేనా? సృష్టికి ప్రతిసృష్టి.. వింతల్లో వింతగా చెప్పుకోవాలి.

  • Published By: sreehari ,Published On : March 21, 2019 / 11:38 AM IST
వింతల్లోనే వింత : అప్పుడే పుట్టిన చిన్నారి కడుపులో.. మరో బేబీ

అప్పుడే పుట్టిన ఆడ శిశువు గర్భం దాల్చడం సాధ్యమేనా? సృష్టికి ప్రతిసృష్టి.. వింతల్లో వింతగా చెప్పుకోవాలి.

సాంకేతికపరంగా ప్రపంచ దేశాలు ఎంత డెవలప్ అయినప్పటికీ.. సైన్స్ కు అందని ఎన్నో రహాస్యాలు సృష్టిలో దాగి ఉంటాయి. మనిషి ఊహాకు కూడా అందని ఎన్నెన్నో వింతలు ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. అందులో మనిషి శరీర నిర్మాణం ఒకటి.. సైన్స్ కు ఇప్పటికి ఇది మిస్టరీగానే ఉంది. మానవ మేథస్సు ఎంతగా పరిణితి సాధించినప్పటికీ మనిషి సృష్టి రహస్యాన్ని పసిగట్టలేకపోతున్నారు. సాధారణంగా తల్లి కాన్పులో కవల పిల్లలకు జన్మనివ్వడం చూశాం. ఒకే కాన్పులో గంపెడు కవలలు పుట్టారని కూడా విన్నాం. కవల పిల్లలు అతుక్కుని పుట్టిన సందర్భాలు అనేకం. కానీ, పిండంలో పిండం ఉండటం ఎప్పుడైనా చూశారా? పోనూ విన్నారా? అంతేకాదు.. అప్పుడే పుట్టిన ఆడ శిశువు గర్భం దాల్చడం సాధ్యమేనా? సృష్టికి ప్రతిసృష్టి.. వింతల్లో వింతగా చెప్పుకోవాలి. కొలంబియాకు చెందిన మోనికా వేగా అనే మహిళ గర్భం దాల్చి ఆడ శిశువుకు జన్మించింది. 
Read Also : హోలీ ఎక్సేంజ్ ఆఫర్ : జియోఫోన్ యూజర్లకు మాత్రమే

పిండంలో మరో పిండం.. షాకైన డాక్టర్లు :
ప్రసవం సమయంలో మహిళ గర్భాశయంలో పిండంలో పిండం ఉందని వైద్యులు నిర్ధారించారు. ఆపరేషన్ చేసి బయటకు తీశాక.. ఆడ కవలలుగా తేల్చారు. అయితే.. పుట్టిన ఒక ఆడ శిశువు కడుపులో మరో ఆడ శిశువు పిండం ఉండటం చూసి వైద్యులు షాకయ్యారు. పైగా ఆ పిండం.. పూర్తిస్థాయిలో పెరగలేదని అల్ట్రా స్కానింగ్ చేసిన వైద్యులు తేల్చి చెప్పారు. బ్రిటిష్ మెడికల్ జనరల్ 1808 ప్రకారం.. ప్రతి 5లక్షల శిశువు జననాల్లో అత్యంత అరుదుగా జరుగుతుందని చెబుతోంది. ఇటీవల కాలంలో ఇండియా, ఇండోనేషియా, సింగపూర్ దేశాల్లో ఈ తరహా శిశు జననాలు సంభవించినట్టు వైద్య నిపుణులు చెబుతున్నారు. కొలంబియాలో కవలల జననం కేసు పూర్తిగా అసాధారణమని, నమ్మశక్యం కానిదిగా వైద్యులు అంటున్నారు. మహిళ ప్రెగెన్సీ సమయంలో పరీక్షించిన వైద్యులు పిండంలో పిండం ఉన్నట్టు స్పష్టంగా నిర్ధారించారు. దీన్ని హై రిస్క్ ప్రెగ్నెన్సీగా మిగూల్ పారా సావేద్ర తెలిపారు. 

శిశువు ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వైరల్ :
కొలంబియా మహిళ వేగాను ప్రెగెన్నీ సమయంలో పరీక్షించినప్పుడు 35వారాల గర్భవతిగా వైద్యులు చెప్పారు. ఇంకా ఐదు వారాలైతే శిశువు జన్మిస్తుంది. ఇదే సమయంలో వైద్యులు మహిళ వేగాకు కలర్ డాప్లర్, త్రిడీ 4డీ అల్ట్రా సౌండ్ స్కానింగ్ చేశారు. తొలుత శిశువు కడుపులో ఉన్నది ఏదో తిత్తి అయి ఉంటుందని వైద్యులు భావించారు. శిశువు బొడ్డుతాడుకు అది అత్కుకుని ఉన్నట్టు గుర్తించారు. ఇదే విషయాన్ని తల్లి వేగాకు వైద్యులు చెబితే.. ఆమె అసాధ్యం అంటూ కొట్టిపారేసింది. తర్వాత పరీక్షించిన వైద్యులు ఆమెకు మెల్లగా వివరించారు.

ఈ ఘటనకు సంబంధించి స్థానిక మీడియాలో జోరుగా వార్తలు వ్యాపించాయి. వేగా అనే 33ఏళ్ల మహిళ కవల పిల్లలకు జన్మనిచ్చిందని, అందులో ఒక శిశువు ప్రెగ్నెంట్ అంటూ వార్తలు హల్ చల్ చేశాయి. శిశువు కడుపులో ఉన్న అసంపూర్తిగా ఉన్న పిండాన్ని వైద్యులు తొలగించేందుకు సర్జరీ చేసినట్టు తెలిపారు. గర్భం దాల్చిన పిండం 37 వారాలు కాగా.. బరువు 7 పౌండ్లు ఉన్నట్టు డాక్టర్లు గుర్తించారు. 

శిశువు కడుపులో తలభాగం, చేతులు
ఇదే సిజేరియన్ ఆపరేషన్ కు సరైన సమయమని భావించారు. ఆపరేషన్ సమయంలో శిశువు లోపలి అవయావాలు ఏమైనా దెబ్బతింటాయేమోనని వైద్యులు భయపడ్డారు. డెలవరీ చేసిన మరుసటి రోజున శిశువులోని మరో పిండాన్ని ల్యాపోస్క్రోపిక్ సర్జరీ ద్వారా విజయవంతంగా వైద్యులు తొలగించారు. రెండు అంగుళాలు ఉన్న తొలగించిన పిండంలో బ్రెయిన్, హార్ట్ ప్రధాన భాగాలు లేవని, కేవలం తలభాగం, చేతులు అసంపూర్తిగా ఉన్నట్టు పర్రా సావేంద్ర తెలిపారు. కొన్నిసార్లు అవాంచిత పిండాలు ట్యుమర్లుగా కూడా మారుతాయని తెలిపారు. ప్రస్తుతం బేబీ ఆరోగ్యంగా ఉందని వైద్యులు చెప్పారు.  
Read Also : అరెస్ట్ కాకుండా తప్పించుకోడానికి : ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలనుకున్న నీరవ్