Twitter: ఇంటి నుంచే టాయిలెట్ పేపర్స్ తెచ్చుకుంటున్న ట్విట్టర్ స్టాఫ్.. మస్క్ చర్యలతో ఉద్యోగుల తిప్పలు

ప్రస్తుతం అమెరికాలోని అనేక ట్విట్టర్ కార్యాలయాల్లో ఉద్యోగులకు కనీస వసతులు కూడా అందడం లేదు. చివరికి టాయిలెట్ పేపర్స్ కూడా ఉండటం లేదు. దీంతో ఉద్యోగులు తమ ఇంటి నుంచే టాయిలెట్ పేపర్స్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.

Twitter: ఇంటి నుంచే టాయిలెట్ పేపర్స్ తెచ్చుకుంటున్న ట్విట్టర్ స్టాఫ్.. మస్క్ చర్యలతో ఉద్యోగుల తిప్పలు

Twitter: ఎలన్ మస్క్ చర్యలతో ట్విట్టర్ ఉద్యోగులు విపరీతమైన ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే వేల సంఖ్యలో సిబ్బంది ఉద్యోగం కోల్పోగా, ఉన్నవాళ్లు కూడా సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం అమెరికాలోని అనేక ట్విట్టర్ కార్యాలయాల్లో ఉద్యోగులకు కనీస వసతులు కూడా అందడం లేదు.

Chandrababai Naidu : సునామీ తప్పదంటూ .. వైసీపీ నేతలకు చంద్రబాబు ఆఫర్..

చివరికి టాయిలెట్ పేపర్స్ కూడా ఉండటం లేదు. దీంతో ఉద్యోగులు తమ ఇంటి నుంచే టాయిలెట్ పేపర్స్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ట్విట్టర్ సీఈవో ఎలన్ మస్క్ కంపెనీ వ్యయాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాడు. దీనిలో భాగంగా ఉద్యోగుల్ని తీసేశాడు. పలు ఆఫీసుల్ని మూసేశాడు. ఉద్యోగులకు ఇచ్చే అనేక సౌకర్యాల్లోనూ కోత పెట్టాడు. కొన్ని కార్యాలయాల్లో సెక్యూరిటీ స్టాఫ్, శానిటేషన్ స్టాఫ్‌ను కూడా తొలగించాడు. దీంతో ఆఫీసుల్ని శుభ్రం చేసే వాళ్లు కూడా లేకుండాపోయారు. టాయిలెట్లలో పేపర్స్ మార్చే వాళ్లు కూడా లేరు. దీంతో చాలా మంది ఉద్యోగులు తమ టాయిలెట్ పేపర్స్ తామే వెంట తెచ్చుకుంటున్నారు. న్యూయార్క్ నగరంలోని ఆఫీసులోనే ఇలా ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

Naresh- Pavithra : ఇక అంతా అఫీషియల్.. లిప్ కిస్‌తో నరేష్-పవిత్రా పెళ్లి ప్రకటన..

శాన్‌ఫ్రాన్సిస్కోలోని ప్రధాన కార్యాలయంలో కూడా పరిస్థితి ఇలాగే ఉందట. ఈ కార్యాలయాలకు ఇటీవల రెంట్ కూడా చెల్లించలేదట. మరోవైపు శానిటేషన్ సిబ్బంది తమ జీతాల పెంపు కోరుతూ నిరసనకు దిగారు. దీంతో మస్క్ వాళ్లందరినీ తొలగించాడు. పారిశుధ్య సిబ్బంది లేకపోవడంతో అక్కడి వాష్ రూమ్స్ కంపుకొడుతున్నాయని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిగిలిపోయిన ఆహార వ్యర్థాలు కుళ్లిపోతున్నాయి. దీంతో దుర్వాసన మధ్యే పని చేయాల్సి వస్తోంది. ఖర్చుల తగ్గింపులో భాగంగా అట్లాంటాలని డాటా సెంటర్‌ను కూడా కంపెనీ మూసేసింది.